Gang Rape : బాపట్ల జిల్లాలో ఘోరం - బాలికపై సామూహిక అత్యాచారం…!
30 June 2024, 9:40 IST
- Gang Rape On Girl in Bapatla : బాపట్ల జిల్లాలో ఘోరం జరిగింది. ఓ మైనర్ బాలికపై ఐదుగురు సామూహిక అత్యాచారం చేశారు. వీరిలో ముగ్గురు యువకులతో పాటు ఇద్దరు మైనర్లు ఉన్నారు. నిందితులపై పోక్సో కేసు నమోదైంది.
బాలికపై గ్యాంగ్ రేప్
Gang Rape On Girl in Bapatla District : బాపట్ల జిల్లాలో ఓ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. రేప్ చేసిన వారిలో ఇద్దరు మైనర్ బాలురు కూడా ఉన్నారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు గంటల వ్యవధిలోనే కేసును చేధించి… నిందితులను అరెస్ట్ చేశారు. వీరిపై ఫోక్సోతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
నిజాంపట్నం మండల పరిధిలోని ఓ గ్రామంలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే…. ఓ బాలిక పదో తరగతి ఫెయిల్ కావడంతో ఇంటివద్దేనే ఉంటుంది. ఇటీవలే పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు రాసింది. వేమూరు మండలంలో పెరవలి చెందిన సదరు బాలిక… మూడు రోజుల క్రితం నిజాంపట్నం మండల పరిధిలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లింది.
అదే గ్రామానికి చెందిన మైనర్ బాలుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో వారిద్దరూ ఫోన్‌లో తరుచూ మాట్లాడుకునే వారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి బాలికకు బాలుడు ఫోన్ చేసి బయటకు రమ్మని కోరాడు. ఆ తరువాత ఆ బాలికను స్నేహితుడు సహాయంతో ద్విచక్ర వాహనంపై ఊరు శివారుకు తీసుకెళ్లాడు. అక్కడి నుంచి బాలికను పొలాల్లోకి తీసుకెళ్లి…. సమీపంలోని మామిడి తోటలోకి తీసుకెళ్లాడు.
అప్పటికే బాలుడి స్నేహితులైన మరో మైనర్ బాలుడితో పాటు వీరంకి వేణు, వీరంకి సతీష్, జన్నకూటి వెంకటేష్ ఉన్నారు. ఈ ఐదుగురు ఆ బాలికపై అత్యాచారం చేశారు. రాత్రి పది గంటల సమయంలో బాలిక ఇంట్లో కనిపించకపోవడంతో కంగారు పడ్డ కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు.
ఇంతలోనే గ్రావ శివారు నుంచి ఏడుస్తూ వస్తున్న బాలికను చూసి కుటుంబ సభ్యులు ఏం జరిగిందని అడిగారు. తనపై జరిగిన అత్యాచారం గురించి చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
అడవులదీవి ఎస్ఐ వెంకటరవి గ్రామానికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధిత బాలిక వద్ద వివరాలు సేకరించారు. బాలిక నుంచి అందిన ఫిర్యాదు మేరకు నిందితులపై అత్యాచారం, కిడ్నాప్, పోక్సో కేసులను నమోదు చేసినట్లు రేపల్లె డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. అనంతరం గాలింపు చర్యలు చేపట్టి గంటల వ్యవధిలోనే నిజాంపట్నం మండలం సజ్జావారిపాలెం వద్ద నిందితులను అరెస్టు చేశామని పేర్కొన్నారు.