Kakinada District : విషాదం... పామాయిల్ తోటలో కరెంట్ తీగలు తగిలి ముగ్గురు మృతి
23 September 2023, 12:52 IST
- Kakinada District Crime News: కాకినాడ జిల్లాలో విషాద ఘటన వెలుగు చూసింది. పామాయిల్ తోటలో పని చేస్తున్న ముగ్గురు వ్యక్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు.
కాకినాడలో విషాదం
Kakinada: కాకినాడ జిల్లాలో విషాదం జరిగింది. జగ్గంపేట మండలం రాజపూడిలోని ఓ పామాయిల్ తోటలో విద్యుత్‌షాక్‌తో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వ్యవసాయ బోరుకు మరమ్మతులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.పొలంలోని కరెంట్ తీగలు పైపులకు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందారు. సూరిబాబు, కిల్లినాగు, గల్ల బాబీలను మృతులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు… కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
గోడ కూలి ముగ్గురు మృతి…
గడిచిన రెండు రోజులుగా తెలంగాణలోని వరంగల్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హనుమకొండ జిల్లా శాయంపేటలో విషాద ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం శిథిలావస్థకు చేరిన ఓ ఇంటి పైకప్పు కూలిపోయింది. ఈ ఘటనలో మోర పెద్ద సాంబయ్య, లోకపోయిన సారమ్మ, భోగి జోగమ్మ మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే పాత గోడలు ఉన్న దగ్గర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఇక అప్పుల బాధతో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన శుక్రవారం వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో వెలుగు చూసింది. మృతుడిని నల్లోల్ల నర్సింహులు(32)గా గుర్తించారు. పత్తి పంట వేసి నష్టం రావటంతో.. అప్పుల భారం భరించలేక సూసైడ్ చేసుకున్నట్లు తెలిసింది,