తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Trains Info: 13రైళ్ల దారి మళ్లింపు, రెండు రైళ్లు షార్ట్ టెర్మినేషన్, రెండు రైళ్ల రీ షెడ్యూల్

Trains Info: 13రైళ్ల దారి మళ్లింపు, రెండు రైళ్లు షార్ట్ టెర్మినేషన్, రెండు రైళ్ల రీ షెడ్యూల్

HT Telugu Desk HT Telugu

22 August 2024, 13:33 IST

google News
    • Trains Info: విజ‌య‌వాడ డివిజ‌న్, వాల్తేర్ డివిజ‌న్‌లో వివిధ భ‌ద్ర‌తా ప‌నుల కార‌ణంగా మొత్తం 13 రైళ్లు దారి మ‌ళ్లిస్తున్నారు. అలాగే అద‌న‌పు ర‌ద్దీని త‌గ్గించేందుకు నాలుగు ప్ర‌త్యేక రైళ్లు న‌డుపుతారు. రెండు రైళ్లు షార్ట్ టెర్మినెట్‌, రెండు రైళ్లు రీషెడ్యూల్ చేస్తున్నారు.
 ప్రత్యేక రైళ్లు
ప్రత్యేక రైళ్లు

ప్రత్యేక రైళ్లు

Trains Info: దక్షిణ మధ్య రైల్వేలోని విజయవాడ డివిజన్‌లో భద్రతా పనుల కారణంగా, విజయవాడ డివిజన్‌లో10 రైళ్లు దారి మళ్లించిన మార్గంలో నడుస్తాయి. విజయవాడ- ఏలూరు- నిడదవోలుకు మార్గానికి బ‌దులు విజయవాడ- గుడివాడ- భీమవరం టౌన్- నిడదవోలు మీదుగా దారి మళ్లించిన మార్గంలో నడుస్తాయి. ఉత్తరాన ఉన్న పల్వాల్-న్యూ ప్రిథ్లా యార్డ్ మధ్య రైలు కనెక్టివిటీకి సంబంధించి పాల్వాల్ స్టేషన్‌లో ప్రీ ఎన్ఐ అండ్ నాన్ ఇంటర్‌లాకింగ్ పని కారణంగా మూడు రైళ్లు దారి మళ్లించిన మార్గంలో నడుస్తాయి.

అలాగే ప్రయాణీకుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి, కింది షెడ్యూల్ ప్రకారం కొచ్చువేలి - షాలిమార్ - కొచ్చువేలి మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే నిర్ణయించింది. పూజ సీజ‌న్ నేప‌థ్యంలో సంబల్‌పూర్-ఈరోడ్ మ‌ధ్య రెండు ప్ర‌త్యేక రైళ్లు అందుబాటులోకి తెచ్చారు. అలాగే వాల్తేర్ డివిజన్‌లో భ‌ద్ర‌తా పనుల కారణంగా రెండు రైళ్ల‌ను రీషెడ్యూల్ చేశారు.

విశాఖ‌ప‌ట్నం-న్యూఢిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్ దారి మళ్లింపు

విశాఖపట్నం నుండి బ‌య‌లుదేరే విశాఖపట్నం-న్యూఢిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్ (20805) రైలు సెప్టెంబ‌ర్ 4 నుంచి సెప్టెంబ‌ర్ 15 వ‌ర‌కు ఆగ్రా కాంట్-మితావాలి-ఘజియాబాద్-న్యూఢిల్లీ మీదుగా మళ్లించబడుతుంది.

న్యూఢిల్లీ నుండి బ‌య‌లుదేరే న్యూఢిల్లీ - విశాఖపట్నం ఏపీ ఎక్స్‌ప్రెస్ (20806) రైలు సెప్టెంబ‌ర్ 6 నుండి సెప్టెంబ‌ర్ 17 వ‌ర‌కు ఆగ్రా కాంట్-మితావాలి-ఘజియాబాద్-న్యూఢిల్లీ మీదుగా మళ్లిస్తారు.

విశాఖపట్నం నుండి బ‌య‌లుదేరే విశాఖపట్నం-అమృత్‌సర్ హిరాకుడ్ ఎక్స్‌ప్రెస్ (20807) రైలు సెప్టెంబ‌ర్ 6, 7, 10, 13, 14 తేదీల్లో ఆగ్రా కాంట్-మితావాలి-ఘజియాబాద్-న్యూఢిల్లీ మీదుగా మళ్లిస్తారు.

విజయవాడ- గుడివాడ- భీమవరం టౌన్- నిడదవోలు మీదుగా మూడు రైళ్లు

సెప్టెంబ‌ర్ నెల‌లో మూడు రైళ్లు విజయవాడ- ఏలూరు- నిడదవోలుకు మార్గానికి బ‌దులుగా విజయవాడ- గుడివాడ- భీమవరం టౌన్- నిడదవోలు మీదుగా న‌డుస్తాయి. ఏలూరు, తాడేపల్లిగూడెంను స్టాప్‌ల‌ను తొలగించారు. ఎర్నాకులం నుండి బయలుదేరి ఎర్నాకులం-పాట్నా సూప‌ర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (22643) రైలు సెప్టెంబ‌ర్ 2 నుంచి సెప్టెంబ‌ర్‌ 23 వ‌ర‌కు దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది. ఎస్ఎంవీ బెంగళూరు-గౌహతి సూప‌ర్ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్ (12509) రైలు సెప్టెంబ‌ర్ 4 నుంచి సెప్టెంబ‌ర్ 27 దారి మళ్లించిన మార్గంలో న‌డుస్తుంది. సీఎస్‌టీ ముంబై-భువనేశ్వర్ కోణార్క్ ఎక్స్‌ప్రెస్ (11019) రైలు సెప్టెంబ‌ర్ 2 నుంచి సెప్టెంబ‌ర్ 29 వ‌ర‌కు మళ్లించిన మార్గంలో నడుస్తుంది.

నిడదవోలు-భీమవరం టౌన్-గుడివాడ-విజయవాడ మీదుగా ఏడు రైళ్లు

ఏడు రైళ్లు నిడదవోలు-ఏలూరు-విజయవాడ మార్గానికి బ‌దులుగా నిడదవోలు-భీమవరం టౌన్-గుడివాడ-విజయవాడ మీదుగా దారి మళ్లించిన మార్గంలో న‌డుస్తాయి. ధన్‌బాద్ నుండి బయలుదేరే ధన్‌బాద్-అలెప్పి బొకారో ఎక్స్‌ప్రెస్ (13351) రైలు దారి మళ్లించిన మార్గంలో సెప్టెంబ‌ర్ 2 నుంచి సెప్టెంబ‌ఱ్ 29 వరకు నడుస్తుంది. తాడేపల్లిగూడెం, ఏలూరును స్టాప్‌ల‌ను తొలగించారు.

టాటా నుండి బయలుదేరే టాటా-యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ (18111) రైలు మళ్లించిన మార్గంలో సెప్టెంబ‌ర్ 5 నుండి 26 వ‌ర‌కు నడుస్తుంది. ఏలూరు స్టాప్‌ను తొలగించారు. జసిదిహ్ నుండి బయలుదేరే జసిదిహ్-తాంబరం ఎక్స్‌ప్రెస్ (12376) రైలు సెప్టెంబ‌ర్ 4 నుంచి సెప్టెంబ‌ర్ 25 వ‌ర‌కు దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది. ఏలూరు స్టాప్‌ను తొలగించారు.

హటియా నుండి బయలుదేరే హతియా-ఎర్నాకులం ఎసీ ఎక్స్‌ప్రెస్ (22837) రైలు సెప్టెంబ‌ర్ 2 నుండి సెప్టెంబ‌ర్ 23 వ‌ర‌కు దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది. ఏలూరు స్టాప్‌ను తొల‌గించారు. హటియా నుండి బయలుదేరే హతియా-ఎస్ఎంవీ బెంగళూరు ఎక్స్‌ప్రెస్ (18637) రైలు సెప్టెంబ‌ర్ 7 నుంచి సెప్టెంబ‌ర్ 28 వ‌ర‌కు దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది.

హటియా నుండి బయలుదేరే హతియా-ఎస్ఎంవీ బెంగళూరు ఎక్స్‌ప్రెస్ (12835) రైలు సెప్టెంబ‌ర్ 3 నుంచి సెప్టెంబ‌ర్ 29 వ‌ర‌కు దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది. టాటా నగర్ నుండి బయలుదేరే టాటా నగర్-ఎస్ఎంవీ బెంగళూరు ఎక్స్‌ప్రెస్ (12889) రైలు సెప్టెంబ‌ర్ 6 నుంచి సెప్టెంబ‌ర్ 27 వ‌ర‌కు దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది. ప్రజలు, ప్ర‌యాణికులు ఈ మార్పులను గమనించి తదనుగుణంగా ప్ర‌యాణాలకు ప్లాన్ చేసుకోవాల‌ని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె. సందీప్ తెలిపారు.

కొచ్చువేలి - షాలిమార్ - కొచ్చువేలి రెండు ప్రత్యేక రైళ్లు

ప్రయాణీకుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి, కింది షెడ్యూల్ ప్రకారం కొచ్చువేలి - షాలిమార్ - కొచ్చువేలి మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే నిర్ణయించింది.

కొచ్చువేలి - షాలిమార్ స్పెషల్‌ రైలు (06081) ఆగ‌స్టు 23 నుంచి సెప్టెంబ‌ర్ 13 వరకు న‌డుస్తుంది. శుక్రవారం నాడు సాయంత్రం 4ః20 గంటలకు కొచ్చువేలిలో బయలుదేరుతుంది. ఇది దువ్వాడకు రాత్రి 10:50 గంటలకు చేరుకుంటుంది. అక్క‌డ నుండి రాత్రి 10:52 గంటలకు బయలుదేరి, ఆదివారం మ‌ధ్యాహ్నం 1:40 గంటలకు షాలిమార్ చేరుకుంటుంది. మొత్తం నాలుగు ప‌ర్య‌ట‌న‌లు ఉంటాయి.

షాలిమార్ - కొచ్చువేలి స్పెష‌ల్‌ రైలు (06082) ఆగ‌స్టు 26 నుండి సెప్టెంబ‌ర్ 16 వరకు సోమవారాల్లో మ‌ధ్యాహ్నం 2:20 గంటలకు షాలిమార్‌లో బయలుదేరుతుంది. ఇది మరుసటి రోజు దువ్వాడకు తెల్ల‌వారు జామున 4:18 గంటలకు చేరుకుని, అక్క‌డ నుంచి తెల్ల‌వారు జామున 4:20 గంటలకు బయలుదేరుతుంది. అక్క‌డ నుంచి కొచ్చువేలికి ఉద‌యం 9ః55 గంటలకు చేరుకుంటుంది. మొత్తం నాలుగు ప‌ర్య‌ట‌న‌లు ఉంటాయి. ఈ రైలు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, రాజ‌మండ్రి, దువ్వాడ‌, విజ‌య‌న‌గ‌రం స్టేష‌న్ల‌లో స్టాప్‌లు ఉన్నాయి.

రెండు స్పెష‌ల్ రైళ్లు

పూజ‌ సీజన్‌లో ప్రయాణీకుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి దువ్వాడ మీదుగా సంబల్‌పూర్-ఈరోడ్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే నిర్ణయించింది.

సంబల్‌పూర్-ఈరోడ్ పూజ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (08311) రైలు ఆగ‌స్టు 27 వరకు న‌డుస్తుంది. సంబల్‌పూర్‌లో బుధవారం ఉద‌యం 11.35 గంటలకు బయలుదేరుతుంది. అదే రోజు రాత్రి 9.30 గంటలకు దువ్వాడ చేరుకుని, అక్క‌డ నుంచి రాత్రి 9.32 గంటలకు బ‌య‌లుదేరుతుంది. మ‌రుస‌టి రోజు గురువారం రాత్రి 8.30 గంట‌ల‌కు ఈరోడ్‌కు చేరుకుంటుంది. మొత్తం 15 ట్రిప్పులు ఉంటాయి.

ఈరోడ్ - సంబల్‌పూర్ పూజ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (08312) రైలు ఆగ‌స్టు 29 వరకు న‌డుస్తుంది. ఈరోడ్‌లో శుక్రవారం మ‌ధ్యాహ్నం 2.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మ‌ధ్యాహ్నం 1.08 గంట‌ల‌కు దువ్వాడ చేరుకుని, అక్క‌డ నుంచి మ‌ధ్యాహ్నం 1.10 గంట‌ల‌కు బయలుదేరుతుంది. శనివారం రాత్రి 11.15 గంటలకు సంబల్పూర్ చేరుకుంటుంది. మొత్తం 15 ట్రిప్పులు ఉంటాయి.

ఈ ప్ర‌త్యేక రైళ్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పార్వతీపురం, బొబ్బిలి, విజయనగరం, కొత్తవలస, దువ్వాడ, అన‌కాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, భీమ‌వ‌రం, కైక‌లూరు, గుడివాడ‌, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు స్టేష‌న్ల‌లో ఆగుతాయి. ఈ రైళ్ల‌కు సెకెండ్ ఏసీ-1, థ‌ర్డ్‌ ఏసీ-3, స్లీపర్ క్లాస్-9, జనరల్ సెకండ్ క్లాస్-4, సెకండ్ క్లాస్ కమ్ లగేజ్/ డిసేబుల్డ్ కోచ్‌లు-2 ఉన్నాయి.

కేకే లైన్‌లో కోచింగ్ రైళ్ల షార్ట్ టెర్మినేష‌న్‌

కేకే లైన్‌లోని కిరండూల్ ప్రాంతంలో వర్షాల కారణంగా నాలుగు రైళ్లు షార్ట్ టర్మినేట్ చేయబడతాయి. విశాఖపట్నం నుండి బయలుదేరే విశాఖపట్నం-కిరండూల్ ప్యాసింజర్ (08551) రైలు ఆగ‌స్టు 28 వ‌ర‌కు దంతెవాడలో షార్ట్ టర్మినేట్ చేయబడుతుంది. కిరండూల్-విశాఖపట్నం ప్యాసింజర్ స్పెషల్ (08552) రైలు ఆగ‌స్టు 29 వరకు కిరండూల్‌కు బదులుగా దంతెవాడ నుండి ప్రారంభమవుతుంది.

విశాఖపట్నం నుండి బయలుదేరే విశాఖపట్నం-కిరండూల్ ఎక్స్‌ప్రెస్ (18514) రైలు ఆగ‌స్టు 28 వ‌ర‌కు దంతెవాడలో షార్ట్ టర్మినేట్ చేయబడుతుంది. కిరండూల్-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ (18513) రైలు ఆగ‌స్టు 29 వ‌ర‌కు కిరండూల్‌కు బదులుగా దంతెవాడ నుండి బయలుదేరుతుంది. అందువల్ల పైన పేర్కొన్న తేదీల్లో కిరండూల్-దంతెవాడ మధ్య ఈ రైలు సేవలు ఉండవు.

వాల్తేర్ డివిజన్‌లో భ‌ద్ర‌తా పనుల కారణంగా రైళ్లను రీషెడ్యూల్

వాల్తేర్‌ డివిజన్‌లోని పుండి-నౌపడ- పుండి, తిలారు-కోటబొమ్మాళి సెక్షన్‌లలో భ‌ద్ర‌తా పనుల దృష్ట్యా ఆగస్టు 23 తేదీలో ఈ క్రింది రైలు సర్వీసు ప్రభావితమవుతుంది.

కేఎస్ఆర్‌ బెంగళూరు నుండి బ‌య‌లుదేరు కేఎస్ఆర్‌ బెంగళూరు - భువనేశ్వర్ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ (18464) రైలును రీషెడ్యూల్ చేశారు. ఆగ‌స్టు 23 తేదీలో మ‌ధ్యాహ్నం 1ః40 గంట‌ల‌కు బ‌య‌లుదేరాల్సిన రైలు, 2ః30 గంట‌ల ఆల‌స్యంగా సాయంత్రం 4ః10 గంట‌ల‌కు బ‌య‌లుదేరుతుంది.

(జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

తదుపరి వ్యాసం