KCR Meets BRS Leaders: ఖమ్మం జిల్లాలో ఏం జరుగుతోంది..! ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ
KCR Meets BRS Leaders: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బిఆర్‌ఎస్ అధ్యక్షుడు తొలిసారి ఖమ్మం జిల్లా నేతలతో భేటీ అయ్యారు.
KCR Meets BRS Leaders: ఖమ్మం జిల్లా ముఖ్య నేతలతో మాజీ ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సమావేశం అయ్యారు. ఆ జిల్లాలో తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
ఖమ్మం జిల్లా మొదటి నుంచి కాంగ్రెస్ Congess కు కంచుకోటలా ఉన్న నేపద్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం పై చర్చించారు. ఈ క్రమంలో 13న చలో నల్గొండ కు సంబంధించి ఖమ్మం జిల్లా నుంచి జన సమీకరణ భారీగా చేయాలని జిల్లా నేతలను పార్టీ అధినేత కేసీఆర్ కోరారు.
కాంగ్రెస్ సర్కారు అనుసరిస్తున్న మూర్ఖపు వైఖరిని తిప్పికొట్టాలని ఆయన దిశానిర్దేశం చేశారు. కృష్ణా జలాల్లో krishna river హక్కులను కాపాడేందుకు పోరాడాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వ ప్రమాదకర మూర్ఖపు వైఖరిని తిప్పికొట్టి కృష్ణా జలాలపై ప్రాజెక్టులపై తెలంగాణకు రావాల్సిన వాటాను, హక్కులను నూటికి నూరు శాతం కాపాడేందుకు ఎంతదాకనైనా పోరాడాల్సిందేనని బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు.
ఖమ్మం జిల్లా ప్రతినిధులతో సమీక్షలో కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో సాగు నీరు, తాగు నీటి హక్కుల కోసం పోరాడడమే కాకుండా ‘మా నీళ్లు మాకే’ అనే ప్రజా నినాదాన్ని, స్వయంపాలన ప్రారంభమైన అనతికాలంలోనే నిజం చేసి చూయించిన ఘనత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.
కేఆర్ఎంబీ పేరుతో కృష్ణా నదీ ప్రాజెక్టులపై తెలంగాణకున్న హక్కులను కైవసం చేసుకునేందుకు కేంద్రం వేసే ఎత్తుగడలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ కేంద్రం ఒత్తిళ్లను తట్టుకుంటూ పదేండ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేసి కాపాడిందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ అవగాహన రాహిత్యంతో సంతకాలు చేసి తీసుకున్న నిర్ణయంతో భవిష్యత్తులో ప్రాజెక్టుల కట్టలమీదికి కూడా పోలేని పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని ప్రజా మద్దతుతో తిప్పి కొడుతామన్నారు.
ప్రజలకు సాగు నీరు, తాగు నీరు అందక తిరిగి కరువు కోరల్లో చిక్కుకునే ప్రమాదం పొంచివున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రమాదకర మూర్ఖపు వైఖరిని తిప్పి కొట్టి కృష్ణా జలాలపై, ప్రాజెక్టులపై తెలంగాణకు రావాల్సిన వాటాను హక్కులను నూటికి నూరు శాతం కాపాడేందుకు ఎంతదాకనైనా పోరాడాల్సిందేనన్నారు.
(రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం.)