TSRTC Bus Tracking App: జస్ట్ వన్ క్లిక్.. మీరు వెళ్లాల్సిన బస్సు ఎక్కడుందో తెలుసుకోవచ్చు -tsrtc bus tracking app now available for tracking bus services in real time ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tsrtc Bus Tracking App: జస్ట్ వన్ క్లిక్.. మీరు వెళ్లాల్సిన బస్సు ఎక్కడుందో తెలుసుకోవచ్చు

TSRTC Bus Tracking App: జస్ట్ వన్ క్లిక్.. మీరు వెళ్లాల్సిన బస్సు ఎక్కడుందో తెలుసుకోవచ్చు

HT Telugu Desk HT Telugu
Jan 14, 2023 08:40 AM IST

TSRTC Bus Tracking Updates: ప్రయాణికుల కోసం మరో సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది టీఎస్ఆర్టీసీ. వెళ్లాల్సిన బస్సు ఎక్కడుందో తెలుసుకొనేందుకు ‘టీఎస్‌ఆర్టీసీ బస్‌ ట్రాకింగ్‌’ యాప్‌ను వినియోగంలోకి తీసుకొచ్చింది.

టీఎస్ ఆర్టీసీ బస్ ట్రాక్ యాప్,
టీఎస్ ఆర్టీసీ బస్ ట్రాక్ యాప్, (tsrtc)

TSRTC Latest News Updates: గత కొంతకాలంగా వినూత్న నిర్ణయాలతో ఆర్టీసీని బలోపేతం చేసే దిశగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అడుగులు వేస్తోంది. ఓ వైపు ప్రస్తుతం ఉన్న భారాన్ని తగ్గించుకోవటంతో పాటు... ప్రయాణికులను ఆకర్షించేలా మార్పులు తీసుకువస్తోంది. ప్రత్యేక ఆఫర్లతో పాటు సులువైన ప్రయాణ సౌకర్యాన్ని కల్పించేలా ఏర్పాట్లు చేస్తోంది. తాజాగా మరో సర్వీస్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది ఆర్టీసీ.

ప్రయాణికులు వెళ్లాల్సిన బస్సు ఎక్కడుందో తెలుసుకొనేందుకు ‘టీఎస్‌ ఆర్టీసీ బస్‌ ట్రాకింగ్‌’ యాప్‌ను వినియోగంలోకి తీసుకొచ్చింది. సీటు రిజర్వేషన్‌ చేసుకుంటున్న ప్రయాణికుల ఫోన్లకు టికెట్‌ వివరాలతోపాటు బస్‌ ట్రాకింగ్‌ లింక్‌ను సందేశ రూపంలో వస్తుంది. లింక్‌పై క్లిక్‌ చేయగానే సంబంధిత బస్సు ఎకడుందో సులువుగా సింపుల్ గా తెలిసిపోతుంది. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణించే బస్సుల వివరాలతోపాటు అవి ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయో సులువుగా తెలుసుకోవచ్చు. ఈ యాప్‌ గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. www.tsrtc.telangana.gov.in నుంచి కూడా ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. బస్సు బ్రేక్‌డౌన్‌, వైద్య సహాయం, రోడ్డు ప్రమాదం తదితర వివరాలను ప్రయాణికులు ఈ యాప్‌లో నమోదు చేయవచ్చు.తొలి విడత కింద మొత్తం 1,800 బస్సులను ఈ యాప్‌తో అనుసంధానం చేసినట్లు అధికారులు వెల్లడించారు. సంక్రాంతి పండగ సందర్భంగా ఏర్పాటు చేసిన 600 ప్రత్యేక బస్సులూ ఈ జాబితాలో ఉన్నాయి.

మరోవైపు ఈ సంక్రాంతి సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ భారీగా ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ప్రయాణికులను త్వరగా గమ్యస్థానాలకు చేర్చేందుకు టోల్ ప్లాజాకు సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకుంది. టోల్‌ప్లాజాల వద్ద టీఎస్‌ఆర్టీసీ బస్సుల కోసం ప్రత్యేక లేన్ ఏర్పాటు చేయాలని కోరుతూ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, తెలంగాణ రోడ్లు, భవనాల శాఖలకు లేఖ రాసింది. దీనికి ఆ రెండు శాఖలు అంగీకరించడంతో.. టోల్‌ప్లాజాల వద్ద టీఎస్ఆర్టీసీ బస్సుల కోసం ప్రత్యేక లేన్ కేటాయించనున్నారు. ఆర్టీసీ బస్సులకు ప్రత్యేక లేన్ కేటాయించడంతో.. బస్సుల్లో ప్రయాణించేవారికి టోల్‌ప్లాజాల వద్ద గంటలకొద్ది వేచి ఉండే సమస్య తప్పుతుంది. ఫలితంగా త్వరగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. ఈ నెల 12 నుంచి 14వరకు టోల్‌ప్లాజాల వద్ద టీఎస్‌ఆర్టీసీ బస్సుల కోసం ప్రత్యేక లైన్ కేటాయించారు. అన్ని టోల్‌గేట్ల వద్ద మూడు షిప్ట్‌ల్లో సిబ్బందిని ఆర్టీసీ అందుబాటులో ఉంచింది. ఈసారికి 4,233 ప్రత్యేక బస్సులను నడుపుతోంది తెలంగాణ ఆర్టీసీ. మరోవైపు ఏపీ ఆర్టీసీ 6400 ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకువవచ్చింది. ముందస్తు టికెట్లు బుకింగ్ చేసుకునే వారికి రాయితీలు కూడా ప్రకటించాయి ఆయా సంస్థలు.

Whats_app_banner