TSRTC Ticket Reservation : ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ - రిజర్వేషన్ ఛార్జీల మినహాయింపుపై ప్రకటన-tsrtc announced waiver of reservation charges for long distance passengers ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tsrtc Ticket Reservation : ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ - రిజర్వేషన్ ఛార్జీల మినహాయింపుపై ప్రకటన

TSRTC Ticket Reservation : ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ - రిజర్వేషన్ ఛార్జీల మినహాయింపుపై ప్రకటన

Maheshwaram Mahendra Chary HT Telugu
May 03, 2024 02:47 PM IST

TSRTC Reservation Charges : దూరం వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ(TSRTC) గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికుల కోసం రిజర్వేషన్ చార్జీలను మినహాయింపు ఇస్తున్నట్లు సంస్థ ఎండీ సజ్జనార్ ఓ ప్రకటనలో తెలిపారు.

తెలంగాణ ఆర్టీసీ
తెలంగాణ ఆర్టీసీ

TSRTC Latest News : వేసవి వేళ దూర ప్రయాణం చేసే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం రిజర్వేషన్ చార్జీలకు మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఓ ప్రకటనలో తెలిపారు.

yearly horoscope entry point

ఎనిమిది రోజుల ముందు ముందస్తు రిజర్వేషన్ చేసుకునే వారికి మాత్రమే ఈ మినహాయింపు వర్తిస్తుందని ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో(TSRTC) ముందస్తు రిజర్వేషన్ కోసం http://tsrtconline.in వెబ్ సైట్ ని సంప్రదించాలని సూచించారు. ఈ రాయితీ(TSRTC Discount Offer)ని వినియోగించుకోవాలని ప్రయాణికులకు కోరారు.

ప్రతి 10 నిమిషాలకో TSRTC బస్సు..

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తెలంగాణ ఆర్టీసీ(TSRTC) కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్-విజయవాడ(Hyderabad to Vijayawada) రూట్ లో వెళ్లే ప్రయాణికుల కోసం ప్రతి 10 నిమిషాలకో బస్సును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మార్గంలో ప్రతిరోజు 120కి పైగా బస్సులను సంస్థ నడుపుతున్నట్లు తెలిపింది.

ఇందులో లహరి ఏసీ స్లీపర్ 2, నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ 2, ఈ-గరుడ 10, గరుడ ప్లస్ 9, రాజధాని 41, సూపర్ లగ్జరీ 62 బస్సులున్నాయని సంస్థ ఎండీ సజ్జనార్ వివరించారు. ఈ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకునే వారికి 10 శాతం రాయితీని సంస్థ కల్పిస్తోందని సజ్జనార్ వెల్లడించారు. తిరుగుప్రయాణ టికెట్ పై ఈ డిస్కౌంట్ వర్తిస్తుందన్నారు.

బెంగళూరుకు వెళ్లే ప్రయాణికులు ముందస్తు రిజర్వేషన్ చేసుకుంటే తిరుగు ప్రయణంపై 10 శాతం రాయితీని టీఎస్ఆర్టీసీ(TSRTC) కల్పిస్తోంది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లే అన్ని హైఎండ్ సర్వీసుల్లోనూ ఈ రాయితీ వర్తిస్తుంది. ఈ రూట్లలో వెళ్లే ప్రయాణికులు ఈ 10 శాతం రాయితీని వినియోగించుకోవచ్చు.

శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు

శ్రీశైలానికి ప్రత్యేక బస్సులను ప్రకటించింది తెలంగాణ ఆర్టీసీ(TSRTC). భక్తుల సౌకర్యార్థం శ్రీశైల(Srisailam) పుణ్యక్షేత్రానికి సరికొత్త రాజధాని ఏసీ బస్సులను నడుపుతోందని తెలిపింది. హైదరాబాద్ నుంచి ప్రతి గంటకో బస్సును భక్తులకు అందుబాటులో ఉంచినట్లు ఎండీ సజ్జనార్ తెలిపారు.

ఈ బస్సుల్లో జేబీఎస్ నుంచి రూ.524, BHEL నుంచి రూ.564 టికెట్ ధర ఉందని తెలిపారు. అత్యాధునిక హంగులతో ఘాట్ రోడ్డుకు తగ్గట్టుగా ఈ రాజధాని ఏసీ బస్సులను ప్రత్యేకంగా సంస్థ తయారు చేయించామని తెలిపారు. వేసవిలో చల్లదనం అందించే ఈ బస్సులను వినియోగించుకుని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకోవాలని సంస్థ కోరుతుందని పేర్కొన్నారు. ఈ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం http://tsrtconline.in వెబ్ సైట్ ని సంప్రదించవచ్చని సూచించారు.

ఆవకాయ పచ్చడి ప్రియులకు తెలంగాణ ఆర్టీసీ(TSRTC) గుడ్ న్యూస్ చెప్పింది. రుచికరమైన అమ్మమ్మ చేతి ఆవకాయ పచ్చడిని మీ బంధువులు, స్నేహితులకు TSRTC ద్వారా సులువుగా పంపించుకోవచ్చని తెలిపింది. మీ సమీపంలోని టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్ల ద్వారా ఆవకాయ పచ్చడిని బంధుమిత్రులకు చేరేవేసే సదుపాయాన్ని సంస్థ కల్పిస్తోందని ఎండీ సజ్జనార్ ఇటీవలే తెలిపారు. 

తెలంగాణతో పాటు టీఎస్ఆర్టీసీ బస్సు సర్వీసులు తిరిగే ఆంద్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర లకు ఆవకాయ పచ్చడిని సంస్థ డెలివరీ చేస్తోంది. పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్‌ నంబర్లైన 040-23450033, 040-69440000, 040-69440069 ను సంప్రదించాలని సూచించారు.

Whats_app_banner