TSPSC Group 1 Updates : ముగిసిన గ్రూప్ 1 దరఖాస్తులు... ఈసారి 4 లక్షల అప్లికేషన్లు, ఆ తేదీ నుంచి 'ఎడిట్ ఆప్షన్'
TSPSC Group 1 Updates 2024: తెలంగాణ గ్రూప్ 1 దరఖాస్తుల ప్రక్రియ మార్చి 16వ తేదీతో ముగిసింది. ఈసారి 4 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చినట్లు టీఎస్పీఎస్సీ ఓ ప్రకటనలో పేర్కొంది.
TSPSC Group 1 Updates 2024 : తెలంగాణలో గ్రూప్ 1 దరఖాస్తుల గడువు(TSPSC Group 1 Applications) ముగిసింది. మార్చి 16వ తేదీతో అప్లికేషన్ల ప్రాసెస్ ముగిసినట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. కొత్త నోటిఫికేషన్ కు సంబంధించి మొత్తం 4.03 లక్షల మంది దరఖాస్తులు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు శనివారం ఓ ప్రకటనను విడుదల చేసింది.
TSPSC Group 1 Applications Edit Option: ఎడిట్ ఆప్షన్
దరఖాస్తుల ప్రక్రియ ముగియటంతో ఎడిట్ ఆప్షన్ కు సంబంధించి మరో అప్డేట్ ఇచ్చింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. దరఖాస్తుల్లో ఏమైనా తప్పులు దొర్లితే సవరించే అవకాశం కల్పించనుంది. ఈ ఎడిట్ ఆప్షన్(TS Group 1 Applications Edit Option) మార్చి 23వ తేదీ నుంచి వెబ్ సైట్లో అందుబాటులోకి వస్తుందని పేర్కొంది.మార్చి 27 సాయంత్రం 5గంటల లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఒక్కసారి ఎడిట్ ఆప్షన్ గడువు ముగిసిన తర్వాత… సవరణలకు అవకాశం ఉండని వెల్లడించింది. https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఎడిట్ ప్రక్రియను చేసుకోవచ్చని తెలిపింది.
గ్రూప్ 1 నోటిఫికేషన్ ముఖ్య తేదీలు:
గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల - ఫిబ్రవరి 19,2024.
ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం - ఫిబ్రవరి 23, 2024.
దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు - మార్చి 17,2024.
దరఖాస్తుల ఎడిట్ - మార్చి 23 నుంచి మార్చి 27,2024.
హాల్ టికెట్లు డౌన్లోడ్ - పరీక్షకు 7 రోజుల ముందు నుంచి అందుబాటులోకి వస్తాయి.
ప్రిలిమ్స్ పరీక్ష - జూన్ 09 2024.
మెయిన్స్ పరీక్షలు - అక్టోబరు 21, 2024 నుంచి ప్రారంభం అవుతాయి.
అధికారిక వెబ్ సైట్ - https://www.tspsc.gov.in/
తెలంగాణ గ్రూప్ 1 దరఖాస్తుల ప్రక్రియ ఫిబ్రవరి 23వ తేదీన ప్రారంభమైంది. మార్చి 14వ తేదీతోనే గడువు ముగిసింది. కానీ టీఎస్పీఎస్సీ మరో రెండు పొడిగించింది. దీంతో మార్చి 16వ తేదీతో అప్లికేషన్ల ప్రక్రియ ముగిసింది.ఈనోటిఫికేషన్ లో భాగంగా 563 ఉద్యోగాలను భర్తీ చేయనుంది టీఎస్పీఎస్సీ(TSPSC). జూన్ 9వ తేదీన ప్రిలిమ్స్ పరీక్ష ఉండగా, అక్టోబరు 21వ తేదీ నుంచి మెయిన్స్ పరీక్షలను నిర్వహించేందుకు సిద్ధమైంది. పరీక్షలకు ఏడు రోజుల ముందుగా వెబ్ సైట్ లో హాల్ టికెట్లను తీసుకురానుంది.
APPSC Group 1 Prelims 2024: మరోవైపు ఇవాళ ఏపీ గ్రూప్ 1 ప్రిలిమ్స్(APPSC Group 1 Prelims) పరీక్ష నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటలకు పరీక్ష ప్రారంభమైంది. ఉదయం సెషల్ లో పేపర్ 1 ఎగ్జామ్ ఉండగా, మధ్యాహ్నం తర్వాత పేపర్ -2 ఉంది. ఇందుకోసం 1,48,881 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గం.ల వరకూ పేపర్-1, మధ్యాహ్నం 2 గం.ల నుంచి సాయంత్రం 4 గం.ల వరకూ పేపర్-2 పరీక్ష జరుగుతుంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 81 పోస్టులను భర్తీ చేయనున్నారు.