AP Group 1 Prelims : నేడు ఏపీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష-appsc group 1 prelims 2024 exam will be held today ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Group 1 Prelims : నేడు ఏపీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష

AP Group 1 Prelims : నేడు ఏపీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష

Maheshwaram Mahendra Chary HT Telugu
Mar 17, 2024 08:10 AM IST

AP Group 1 Prelims 2024 Updates: ఇవాళ ఏపీలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ జరగనుంది. ఇందుకోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ విస్తృత ఏర్పాట్లు చేసింది.

ఏపీ గ్రూప్ 1
ఏపీ గ్రూప్ 1

APPSC Group 1 Prelims 2024: ఏపీ గ్రూప్ 1 ప్రిలిమ్స్(APPSC Group 1 Prelims) పరీక్షకు సర్వం సిద్ధమైంది. ఇవాళ ఉదయం 10 గంటలకు పరీక్ష ప్రారంభం కానుంది. ఉదయం సెషల్ లో పేపర్ 1 ఎగ్జామ్ ఉండగా, మధ్యాహ్నం తర్వాత పేపర్ -2 ఉంది. ఇందుకోసం 1,48,881 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గం.ల వరకూ పేపర్-1, మధ్యాహ్నం 2 గం.ల నుంచి సాయంత్రం 4 గం.ల వరకూ పేపర్-2 పరీక్ష జరుగుతుంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 81 పోస్టులను భర్తీ చేయనున్నారు.

yearly horoscope entry point

గ్రూపు-1 పరీక్షలు జరిగే పరీక్షా కేంద్రాల పరిధిలో 144వ సెక్షన్ విధించి ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. ప్రతీ పరీక్ష కేంద్రం(Exam Centers) వద్ద ఇద్దరు పురుష, ఇద్దరు మహిళా పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. అంతే గాక పరీక్షల పర్యవేక్షణకు ప్రతి జిల్లాకు ఒక ఐఏఎస్ అధికారిని ఇన్ ఛార్జ్ గా నియమించామని తెలిపారు. ప్రతీ పరీక్షా కేంద్రానికి జిల్లా స్థాయి సీనియర్ అధికారులను లైజన్ అధికారులుగా నియమించి పరీక్షలు సజావుగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు.

రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్ ద్వారా పరీక్షలు (AP Group 1 Prelims)జరుగుతున్న తీరును నిరంతరం పర్యవేక్షించాలని ఏపీపీఎస్సీ అధికారులను సీఎస్ ఆదేశించారు. అలాగే జిల్లాల్లో కూడా కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు. పరీక్ష అనంతరం ఆన్సర్ సీట్లు ఇతర సామాగ్రి కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్ లకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అభ్యర్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకూడదని, ఇలా ఎవరైనా తీసుకొచ్చి పరీక్ష కేంద్రంలో పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని ఏపీపీఎస్సీ హెచ్చిరించింది.

స్కీనింగ్ టెస్ట్ లో భాగంగా ముందు ప్రిలిమ్స్ పరీక్షAP group 1 Prelims 2024) నిర్వహిస్తారు. మొత్తం 240 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. ఇందులో పేపర్-1లో 120 మార్కులకు 120 ప్రశ్నలు, పేపర్-2లో 120 మార్కులకు 120 మార్కులు అడుగుతారు. ఒక్కో పేపర్ కు గం. 2 ల సమయం కేటాయిస్తారు. పేపర్-1లో పార్ట్-ఏలో హిస్టరీ అండ్ కల్చర్, పార్ట్-బిలో రాజ్యాంగం, పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, పార్ట్-సిలో ఏపీ, ఇండినయ్ ఎకానమీ, ప్లానింగ్, పార్ట్-డిలో జాగ్రఫి నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన వారికి మెయిన్స్ పరీక్ష రాసేందుకు అనుమతినిస్తారు. ఇక మెయిన్స్ రాత పరీక్షలో మొత్తం ఐదు పేపర్లు ఉంటాయి. వీటితోపాటు లాంగ్వేజెస్ పేపర్లు తెలుగు, ఇంగ్లీష్ కూడా ఉంటాయి. అయితే వీటిని క్వాలిఫైయింగ్ పరీక్షలుగా పరిగణిస్తారు. మొత్తం ఐదు పేపర్లలో ఒక్కో పేపర్ కు 150 మార్కుల చొప్పున మొత్తం 750 మార్కులకు మెయిన్స్ రాత పరీక్షను నిర్వహిస్తారు. మెయిన్స్ లో అర్హత సాధించిన అభ్యర్థులకు 75 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

Whats_app_banner