TSGENCO Recruitment 2023 : జెన్‌కోలో 339 ఏఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ - ఇవాళ్టి నుంచే దరఖాస్తులు
TSGENCO Recruitment 2023 Updates: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్. జెన్ కో లో అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా… మొత్తం 339 ఏఈ పోస్టులను భర్తీ చేయనుంది. ఇవాళ్టి నుంచే దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి.
TSGENCO Recruitment 2023:తెలంగాణ రాష్ట్ర పవర్ జెనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా 339 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనుంది. వీటిలో లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ కింద 94 పోస్టులు, డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కింద 245 పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. ఈ పోస్టుల భర్తీకి అక్టోబరు 7న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. అక్టోబరు 29వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. హాల్ టికెట్లను పరీక్షకు ఏడు రోజుల ముందు విడుదల చేస్తామని జెన్ కో వెల్లడించింది.
ముఖ్య వివరాలు :
భర్తీ చేసే సంస్థ - తెలంగాణ జెన్ కో
ఉద్యోగాలు - అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ)
మొత్తం ఖాళీల సంఖ్య - 339 (లిమిటెడ్-94, జనరల్-245)
అర్హత- సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి- 01.07.2023 నాటికి 18-44 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు విధానం - ఆన్ లైన్
దరఖాస్తులు ప్రారంభం - అక్టోబరు 7వ తేదీ
దరఖాస్తు రుసుం - దరఖాస్తు ఫీజుగా రూ.400, పరీక్ష ఫీజుగా రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం - రాతపరీక్ష ఆధారంగా.
పరీక్ష విధానం - మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు సెక్షన్ల నుంచి 100 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది.
జీతం - రూ.65,600 - రూ.1,31,220 (RPS-2022).
ఆన్‌లైన్ దరఖాస్తు, పరీక్ష ఫీజు చెల్లింపు తుది గడువు - 29.10.2023
దరఖాస్తు సవరణకు అవకాశం: 01.11.2023
హాల్‌టికెట్లు: పరీక్షకు 7 రోజుల ముందు
ఎగ్జామ్ నిర్వహించే తేదీ: 03.12.2023
అధికారిక వెబ్ సైట్ - https://tsgenco.co.in/TSGENCO/home.do