DOST Web Options : దోస్త్ వెబ్ ఆప్షన్ల తేదీల్లో మార్పు, మే 20 నుంచి అవకాశం-ts dost 2024 admissions web options date changed may 20th starts ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Dost Web Options : దోస్త్ వెబ్ ఆప్షన్ల తేదీల్లో మార్పు, మే 20 నుంచి అవకాశం

DOST Web Options : దోస్త్ వెబ్ ఆప్షన్ల తేదీల్లో మార్పు, మే 20 నుంచి అవకాశం

Bandaru Satyaprasad HT Telugu
May 15, 2024 02:29 PM IST

DOST Web Options : తెలంగాణలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు దోస్త్ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా దోస్త్ వెబ్ ఆప్షన్ల తేదీల్లో మార్పులు చేశారు. మే 20 నుంచి 30 మధ్య దోస్త్ వెబ్ ఆప్షన్లకు గడువు ఇచ్చారు.

దోస్త్ వెబ్ ఆప్షన్ల తేదీల్లో మార్పు, మే 20 నుంచి అవకాశం
దోస్త్ వెబ్ ఆప్షన్ల తేదీల్లో మార్పు, మే 20 నుంచి అవకాశం

DOST Web Options : తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు డిగ్రీ ఆన్ లైన్ సర్వీసెస్ తెలంగాణ(DOST 2024) నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నెల 6 నుంచి 25 వరకు ఫేజ్ -1 రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది. అయితే గతంలో మే 15 నుంచి 27 వరకు ఫేజ్-1 వెబ్ ఆప్షన్లు ప్రకటించారు. విద్యార్థులు, కాలేజీ యాజమాన్యాల వినతిలో వెబ్ ఆప్షన్ తేదీల్లో మార్పు చేశారు. మే 20 నుంచి 30వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు గడువు ఉంటుందని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి సూచించారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి 20 నుంచి వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలని సూచించారు.

దోస్త్ ప్రవేశాలు

తెలంగాణలోని డిగ్రీ కళాశాలల ప్రవేశాల కోసం ‘దోస్త్’(TS DOST 2024) నోటిఫికేషన్ ఇటీవల విడుదలైంది. రాష్ట్రంలోని ఉస్మానియా వర్శిటీ, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మగాంధీ, శాతవాహన విశ్వవిద్యాలయాల పరిధిలోని అన్ని డిగ్రీ కళాశాలల్లో దోస్త్ రిజిస్ట్రేషన్ల ఆధారంగా సీట్లను కేటాయించనున్నారు. ఈ ఏడాదికి సంబంధించి మొత్తం మూడు విడతల్లో డిగ్రీ కాలేజీల్లో సీట్లు భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకునే విద్యార్థులు రూ.200 చెల్లించాలి. ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మే 6వ తేదీ నుంచే ప్రారంభం అయ్యింది. అర్హత గల విద్యార్థులు మే 25వ తేదీ లోపు ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. మే 20 నుంచి వెబ్ ఆప్షన్లు ఎంచుకోవాలి. ఫస్ట్ ఫేజ్ సీట్లను జూన్ 3వ తేదీన కేటాయిస్తారు. జూన్ 10వ తేదీలోపు ఆయా కాలేజీల్లో విద్యార్థులు రిపోర్ట్ చేయాలి. ఇక రెండో విడత రిజిస్ట్రేషన్లు జూన్ 4వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయి.

దోస్త్ ప్రవేశాల ముఖ్య తేదీలివే

ఫేజ్-1 రిజిస్ట్రేషన్లు మే 6వ తేదీ నుంచే ప్రారంభం అయ్యాయి. అర్హత గల విద్యార్థులు మే 25వ తేదీ లోపు ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. మే 20 నుంచి 30 వరకు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవాలి. తొలి విడత సీట్లను జూన్ 3వ తేదీన కేటాయిస్తారు. జూన్‌ 4 నుంచి 10 వరకు సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి. రెండో విడత రిజిస్ట్రేషన్లు జూన్ 4వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయి. జూన్ 13 వరకు రిజిస్ట్రేషన్ కు అవకాశం ఉంటుంది. రెండో విడత సీట్లను జూన్‌ 18వ తేదీన కేటాయిస్తారు. జూన్‌ 19 నుంచి 24వ తేదీలోపు సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కాలేజీల్లో సెల్ఫ్‌ రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది. చివరి విడత జూన్ 19వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. జూన్‌ 25 వరకు విద్యార్థులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. జూన్ 19 నుంచి 26 వరకు వెబ్‌ ఆప్షన్లు ఇవ్వాలి. జూన్‌ 29వ తేదీన తుది విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. జులై 3వ తేదీలోపు విద్యార్థులు కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి. జులై 7వ తేదీ నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభమవుతాయి.

IPL_Entry_Point

సంబంధిత కథనం