దోస్త్ రిజిస్ట్రేషన్ల ద్వారా తెలంగాణలోని ఓయూ, కాకతీయ యూనివర్శిటీ, పాలమూరు, మహాత్మగాంధీ, తెలంగాణ వర్శిటీ, శాతవాహన వర్శిటీల పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలను కల్పిస్తారు.
మొత్తం 3 విడతల్లో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేయనుంది తెలంగాణ ఉన్నత విద్యా మండలి. గత ఏడాది కూడా ఇదే మాదిరిగా డిగ్రీ ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేసింది. https://dost.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి ఇతర అప్డేట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు.