TS e-Challan Discount : మీ ట్రాఫిక్ పెండింగ్ చలాన్లు చెల్లించారా..? లేదా..? డిస్కౌంట్ ఛాన్స్ కు ఇవాళే లాస్ట్-traffic pending challan discount offer closed today in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts E-challan Discount : మీ ట్రాఫిక్ పెండింగ్ చలాన్లు చెల్లించారా..? లేదా..? డిస్కౌంట్ ఛాన్స్ కు ఇవాళే లాస్ట్

TS e-Challan Discount : మీ ట్రాఫిక్ పెండింగ్ చలాన్లు చెల్లించారా..? లేదా..? డిస్కౌంట్ ఛాన్స్ కు ఇవాళే లాస్ట్

Maheshwaram Mahendra Chary HT Telugu
Jan 31, 2024 09:35 AM IST

Telangana e-Challan Discount Updates : పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు ఇవాళ్టితో ముగియనుంది. ఇంకా మిగిలినవారు కూడా సద్వినియోగం చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు. ఇదే చివరి ఛాన్స్ అని.. గడువు పెంచే అవకాశం లేదని స్పష్టం చేస్తున్నారు.

పెండింగ్ చలాన్లు గడువు
పెండింగ్ చలాన్లు గడువు (Twitter)

Telangana e-Challan Discount News: వాహనదారులు మీ పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు చెల్లించారా..? అలా చేయకపోతే వెంటనే క్లియర్ చేసుకోండి. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రాయితీ గడువు ఇవాళ్టి(జనవరి 31)తో ముగియబోతుంది. డిస్కౌంట్ ఛాన్స్ తో పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకోవచ్చని... గడువు ముగిస్తే అలాంటి అవకాశం ఉండదని పోలీస్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ గడువు తేదీని పొడిగించామని… ఇవాళ్టితో ముగిశాక మళ్లీ పెంచే అవకాశం లేదని స్పష్టం చేస్తున్నారు.

గతేడాది డిసెంబర్ 27 నుంచి ఈ రాయితీల చెల్లింపులు ప్రక్రియ జరుగుతోంది. ఈ రాయితీ అవకాశాన్ని జనవరి 10 వరకు మాత్రమే కల్పించారు. అయితే వాహనదారుల నుంచి మంచి స్పందన రావటంతో… గడువును జనవరి 31వ తేది వరకు పొడిగించారు. దీంతో ఇవాళ్టి వరకు రాయితీతో ట్రాఫిక్ చలాన్లను క్లియర్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఈ రాయితీ వర్తించదని పోలీస్ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా మూడు కోట్ల 59 లక్షల పెండింగ్‌ చలాన్లు ఉండగా…. ఇప్పటి వరకు 40 శాతానికి పైగా మాత్రమే చెల్లింపులు చేశారని తెలుస్తోంది. చలాన్లు ద్వారా రూ.135 కోట్లకుపైగా ఆదాయం సమకూరింది. ఇందులోనూ అత్యధికంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధి నుంచి వసూలైనట్లు తెలిసింది. తాాజాగా తెలంగాణ సర్కార్ పేర్కొన్న రాయితీల ప్రకారం… https://echallan.tspolice.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి చలాన్లను క్లియర్ చేసుకోవచ్చు. Vehicle Number ను ఎంట్రీ చేసి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు సూచిస్తున్నారు.

రాయితీ వివరాలు:

టూ వీలర్స్‌, త్రీ వీలర్స్ - 80 శాతం రాయితీ.

లైట్ / హెవీ మోటర్ వెహికల్స్ పై - 50 శాతం రాయితీ.

ఆర్టీసీ బస్సులపై - 90 శాతం రాయితీ.

హైదరాబాద్ నగరంలోని రాచకొండ,హైదరాబాద్,సైబరాబాద్.... మూడు కమిషనరేట్లతో పాటు రాష్ట్రంలోని ఇతర కమిషనరేట్ లు, జిల్లా ప్రధాన కార్యాలయాలు మొదలు అన్నీ పట్టణంలో పోలీసులు ట్రాఫిక్ నిబంధనలను పాటించని వాహనదారులకు చలాన్లను విధిస్తారు.సీసీ కెమెరాల ఆధారంగా రూల్స్ అతిక్రమించిన వారి పై చర్యలు తీసుకుంటారు. తప్పనిసరిగా కొందరి నుంచి చలాన్లను వసూలు చేస్తున్న చాలా మంది మాత్రం చలాన్లను తిరిగి చెల్లించడం లేదు. ఇటీవల కాలంలో పెండింగ్ చలాన్లు పెద్ద సంఖ్యలో చెల్లించకుండా ఉండటంతో పెండింగ్ చలాన్ల సంఖ్య ఎక్కువగా ఉంది. కొవిడ్ కారణంగా వెహికల్స్ ఓనర్స్ పెండింగ్ చలాన్లు చెల్లించపోయారు. కొన్ని వెహికల్స్ పై వాటి వ్యాల్యూ కంటే ఎక్కువ మొత్తం లో చలాన్లు ఉన్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ పరిధిలోని మూడు కమిషనరేట్లతోపాటు తెలంగాణ వ్యాప్తంగా వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లపై కొద్దిరోజుల కిందట తెలంగాణ సర్కార్ రాయితీని ప్రకటించింది.

గత సంవత్సరం కూడా ఈ అవకాశాన్ని కల్పించింది సర్కార్. చాలా మంది వాహనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. కేవలం 40 రోజుల వ్యవధిలోనే ప్రభుత్వానికి చలాన్ల ద్వారా రూ.300 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది.

Whats_app_banner

సంబంధిత కథనం