Traffic Challan | ఇకపై వాట్సాప్ లో ట్రాఫిక్ చలాన్లు-hyderabad traffic police will send your challan on whatsapp ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Traffic Challan | ఇకపై వాట్సాప్ లో ట్రాఫిక్ చలాన్లు

Traffic Challan | ఇకపై వాట్సాప్ లో ట్రాఫిక్ చలాన్లు

HT Telugu Desk HT Telugu
May 16, 2022 08:42 PM IST

ఇకపై వాట్సాప్ లోనూ ట్రాఫిక్ చలాన్ల అప్ డేట్స్ రానున్నాయి. ఈ మేరకు రవాణా శాఖ నిర్ణయం తీసుకుంది.

<p>ప్రతీకాత్మక చిత్రం</p>
ప్రతీకాత్మక చిత్రం (REUTERS)

ట్రాఫిక్ చలాన్లపై.. రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే.. చలాన్లపై డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇకపై వాట్సాప్ లోనూ చలాన్లు రానున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. నిర్ణయం తీసుకున్నారు. వాహన యజమానులు వాహనాలను రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు నివాస చిరునామా వివరాలు, ఫోన్ నంబర్‌ను కూడా ఇస్తారు. రవాణా శాఖ దగ్గర.. వాహనాదారుల వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే అందుకు సంబంధించిన చలాన్ అప్ డేట్ వాట్సాప్‌కు కూడా ఫార్వార్డ్ చేస్తారు.

yearly horoscope entry point

ఇప్పటి వరకు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులు, వాహన యజమానులందరికీ వారి మొబైల్ ఫోన్‌లకు ఎస్‌ఎంఎస్‌లుగా జరిమానా సందేశాలు అందేవి. కానీ, ఇప్పుడు, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా ప్రాచుర్యం పొందిన వాట్సాప్ మెసేజింగ్ సేవను ఉపయోగించుకోనున్నారు.

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఈ-చలాన్ విభాగంలోని బృందం వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్‌కు ఈ-చలాన్ పోర్టల్‌లో ట్రాఫిక్ జరిమానాలను అప్‌డేట్ చేస్తూనే ఉంటుంది. దీంతో వాహన యజమాని మొబైల్ ఫోన్‌కు ముందుగా మెసేజ్ పంపుతారు. ఆ తర్వాత పోస్టల్ చలాన్ వస్తుంది. అయితే ఇప్పుడు వాట్సాప్ ద్వారా కూడా చలానాను పంపిస్తారు.

Whats_app_banner