TOSS Admissions 2023 : ఓపెన్ టెన్త్, ఇంటర్ ప్రవేశాలకు మరో ఛాన్స్ - అప్లికేషన్ల గడువు పొడిగింపు
Telangana Open School Society: ఓపెన్ లో ఇంటర్, పదో తరగతి పూర్తి చేయాలనుకునే వారికి మరో అవకాశం కల్పించింది తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS). ఆన్ లైన్ దరఖాస్తుల గడువును మరోసారి పొడిగిస్తూ ప్రకటన విడుదల చేసింది.
Telangana Open School Society 2023 -2024: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) కీలక అలర్ట్ ఇచ్చింది. వివిధ కారణాల రీత్యా రెగ్యూలర్ విధానంలో టెన్స్, ఇంటర్ చదువలేనివారి కోసం ఇప్పటికే అడ్మిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఇందులో భాగంగా ఈ విద్యా సంవత్సరం(2023-24)లో 10వ తరగతి, ఇంటర్‌లో ప్రవేశాలు కల్పించనుంది. షెడ్యూల్ ప్రకారం ఇప్పటికే దరఖాస్తుల గడువు ముగియటంతో... చదువాలనుకునే వారికి మరో అవకాశం కల్పించింది. అక్టోబర్ 13వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు తాజాగా ప్రకటన విడుదల చేసింది.
అక్టోబరు 13వ తేదీలోపు అభ్యర్థులు నిర్ణీత ఫీజులను చెల్లించాలని అధికారులు ప్రకటించారు. పూర్తి వివరాలను https://www.telanganaopenschool.org/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసిన తర్వాత మీ అప్లికేషన్ ను ఎంచుకున్న స్కూల్ లేదా కాలేజీలో సమర్పించాలని అధికారులు స్పష్టం చేశారు.
మెయిల్ అడ్రెస్ : Email : tossadmissions@gmail.com
సాంకేతిక ఇబ్బందులు ఎదురైతే ఫోన్ చేయాల్సిన నెంబర్ : 9391251934
ఇంటర్ అడ్మిషన్లు - మరో ఛాన్స్…
TS Inter Admissions Extended : తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్మిషన్ల గడువు పొడిగించారు. 2023-24 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ అడ్మిషన్ల చివరి తేదీని అక్టోబర్ 9 వరకు పొడిగించింది. ఈ నిర్ణయానికి సంబంధించి బోర్డు జూనియర్ కాలేజీల ప్రిన్సిపాల్స్ కు ఉత్తర్వులు జారీ చేసింది. రూ.1000 ఆలస్య రుసుము చెల్లించి ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో కోర్సులో ప్రవేశం పొందవచ్చని సర్క్యులర్‌లో పేర్కొంది. అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ రంగ కళాశాలల్లో ఇంటర్ కోర్సులో ప్రవేశానికి ఎటువంటి ఆలస్య రుసుము చెల్లంచాల్సిన అవసరం లేదని బోర్డు పేర్కొంది. ఇకపై అడ్మిషన్ల చివరి తేదీని పొడిగించమని తెలిపారు.
“అక్టోబర్ 9వ తేదీ వరకు అభ్యర్థులను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేర్చుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాల్స్ అందరికీ సూచించాం. దీనివల్ల అర్హులైన విద్యార్థులు తమ ఉన్నత విద్యను అభ్యసించే అవకాశాన్ని కోల్పోకుండా ఉంటారు’’ అని బోర్డు పేర్కొంది.
దరఖాస్తు ఇలా…
ఇంటర్మీడియట్ అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.in పై క్లిక్ చేయండి
హోమ్‌పేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్మిషన్ లింక్‌పై క్లిక్ చేయండి
దరఖాస్తుదారు నమోదు చేసుకోవాలనుకునే మండలం, జిల్లాను ఎంచుకోండి
కళాశాలల జాబితా తెరపై కనిపిస్తుంది
కాలేజీలను ఎంచుకుని సబ్మిట్ చేయండి