Karimnagar District : హుజురాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం - ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ప్రాణం తీసిన టిప్పర్
Huzurabad Road Accident: హుజురాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు విడిచారు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.
Huzurabad Road Accident : హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని బోర్నపల్లి మూల మలుపు వద్ద బైక్ పై టిప్పర్ బోల్తాపడింది. బైక్ పై ఉన్న బోర్నపల్లికి చెందిన గంట వర్ష(15), గంట విజయ్(17), గంట సింధూజ (18) టిప్పర్ మట్టిలో కూరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో బోర్నపల్లి లో విషాదం అలుముకుంది. టిప్పర్ వస్తున్న విషయాన్ని గమనించి పక్కనే అపిన బైక్ పై టిప్పర్ బోల్తా పడింది. దీంతో బైక్ పై ఉన్న ముగ్గురి లో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా మరొకరిని ఆసుపత్రి కి తరలించేటప్పుడు మృతి చెందారు. విషయం తెలిసిన స్థానికులు జేసిబి సహాయం తో మృత దేహాలను వెలికి తీశారు. మృతుల్లో విజయ్, వర్ష ఇద్దరు సొంత అన్నా చెల్లెలు. సమాచారం అందుకున్న మృతుల కుటుంబీకులు సంఘటన స్థలానికి చేరుకొని బోరున విలిపించారు.
ప్రాణాలు పొగొట్టుకున్న అన్నా చెల్లెలు
బోర్నపల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి బోనాల జాతర నిర్వహించారు. రాత్రి బోనాలతో జాతరకు వెళ్ళిన వారు.. ముగ్గురు బైక్ పై ఇద్దరు అక్కచెల్లెను ఇంటివద్ద దింపి వచ్చేందుకు విజయ్ తన బైక్ పై బయలుదేరగా ఎలబోతారం నుంచి హుజురాబాద్ వైపు వస్తున్న మొరం మట్టితో కూడిన టిప్పర్ అతివేగంగా రావడం గమనించి రోడ్డు ప్రక్కన బైక్ ఆపాడు. ఆజాగ్రత్త నడుపుతు టిప్పర్ డ్రైవర్ మూలమలుపు వద్ద సడెన్ గా బ్రేక్ వేయడంతో టిప్పర్ బోల్తా పడింది. బైక్ పై పడడంతో టిప్పర్ లోని మొరం మట్టిలో కూరుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. డ్రైవర్ పరార్ కాగ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పరామర్శ
పెద్దమ్మ తల్లి జాతరకు వెళ్ళి ఇంటికి తిరుగు ప్రయాణంలో టిప్పర్ సృష్టించిన బీభత్సంతో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురి కుటుంబాలను హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పరామర్శించారు. హుజురాబాద్ ఆసుపత్రి మార్చురి వద్ద మృతదేహాలను చూసి చలించిపోయిన ఎమ్మెల్యే దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. టిప్పర్ డ్రైవర్ పై చర్యలు తీసుకుని మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మృతుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు పాడి కౌశిక్ రెడ్డి.