Arunachalam Tour : ఈ నెలలో 'అరుణాచలం' ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా..? రూ. 7500కే 4 రోజుల టూర్ ప్యాకేజీ, ఇవిగో వివరాలు
Hyderabad to Arunachalam Tour 2024: అరుణాచలేశ్వరుడిని(Arunachalam) దర్శించుకోవాలని అనుకుంటున్నారా..? అయితే మీకోసం తెలంగాణ టూరిజం ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చింది. నాలుగు రోజుల పాటు ఈ టూర్ సాగుతుంది.హైదరాబాద్ సిటీ నుంచి ఆపరేట్ చేసే ఈ ప్యాకేజీ వివరాలను ఇక్కడ చూడండి…..
Telangana Tourism Hyderabad Arunachalam Tour: అరుణాచలం… ప్రతి ప్రతీ నెల పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ కోసం ఈ పుణ్యక్షేత్రానికి వెళ్తుంటారు. లక్షల సంఖ్యలో భక్తలు వస్తుంటారు. ముఖ్యంగా ఏపీ, తెలంగాణ నుంచి వెళ్లే భక్తల సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంటుంది. అరుణాచలం అనేది… పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటి. దక్షిణభారతంలో అత్యంత పేరు గాంచిన ప్రాంతం.
అరుణాచలం(Arunachalam) చాలా గొప్ప పుణ్యక్షేత్రం. ఈ అరుణాచలం పరమేశ్వరుడిని జ్యోతిర్లింగా స్వరూపంగా భావిస్తారు. దీని చుట్టూ ప్రదక్షిణం చేయటం సాక్ష్తాత్తు శివునికి ప్రదక్షిణం అని భక్తుల విశ్వాసం. ఇక్కడికి వచ్చే భక్తులు గిరిప్రదక్షిణ చేస్తుంటారు. ఇది మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. దారిలో వచ్చే మొత్తం 8 లింగాలను మనం దర్శించుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. గిరి ప్రదక్షిణ చేస్తే మంచి ఫలితాలు అందుతాయని భక్తులు నమ్ముతుంటారు.
ఇక ప్రతీ నెల పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ కోసం అరుణాచలాని(Arunachalam)కి భక్తులు ఎక్కువ సంఖ్యలో వెళ్తుంటారు. అయితే భక్తుల రాకపోకలను దృష్టిలో ఉంచుకొని… తెలంగాణ టూరిజం(Telangana Tourism) సరికొత్త ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘HYDERABAD - ARUNACHALAM - Telangana Tourism’ పేరుతో టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తుంది. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా అరుణాచలానికి తీసుకెళ్తుంది. 4 రోజుల ప్యాకేజీ ఇది. పెద్దలకు రూ. 7500గా టికెట్ ధరను నిర్ణయించారు. చిన్న పిల్లలకు రూ. 6000గా ఉంది. ప్రస్తుతం మే 20వ తేదీన ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది.
హైదరాబాద్ - అరుణాచలం టూర్ ప్యాకేజీ వివరాలు
- HYDERABAD - ARUNACHALAM - Telangana Tourism టూరిజం పేరుతో ఈ ప్యాకేజీని ప్రకటించింది తెలంగాణ టూరిజం.
- ప్రస్తుతం మే 20వ తేదీన ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఆ తర్వాత జూన్ లో ప్యాకేజీ ఉంటుంది.
- పెద్దలకు రూ. 7500, పిల్లలకు రూ. 6వేల టికెట్ ధరగా నిర్ణయించారు.
- మొదటి రోజు సాయంత్రం 6:30 నుంచి బషీర్ బాగ్ నుంచి బయల్దేరుతారు.
- రెండో రోజు ఉదయం కాణిపాకం చేరుకుంటారు. 9 గంటల లోపు దర్శనం పూర్తి అవుతుంది. ఆ తర్వాత Thiruvanamalaiకి బయల్దేరుతారు. మధ్యాహ్నం 3 గంటలకు అరుణాచలం చేరుకుంటారు. దర్శనం పూర్తి చేసుకుంటారు. రాత్రికి అరుణాచలంలోనే ఉంటారు.
- మూడో రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత…వేలూరుకు వెళ్తారు. Sripuram Golden Temple Darshan ఉంటుంది. సాయంత్రం 4 తర్వాత హైదరాబాద్ బయల్దేరుతారు.
- నాలుగో రోజు ఉదయం 5 గంటలకు హైదరాబాద్ కు చేరుకోవటంతో ఈ టూర్ ప్యాకేేజీ ముగుస్తుంది.
- ఈ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 9848540371 ఫోన్ నెంబర్ ను సంప్రదించవచ్చు. info@tstdc.in మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.
- https://tourism.telangana.gov.in/p వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు.పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
ఈ నెలకు సంబంధించిన టూర్ ప్యాకేజీ బుకింగ్ చేసుకోలేకపోతే… వచ్చే నెలలో మళ్లీ ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు. జూన్ నెలలో అయితే 19వ తేదీన అందుబాటులో ఉంది. జూన్ నెల ప్యాకేజీ పూర్తి అయిన తర్వాత… మిగతా నెలల తేదీలను ప్రకటిస్తుంది తెలంగాణ టూరిజం.