Mahashivratri Special: 12 జ్యోతిర్లింగాలు ఎక్కడున్నాయో తెలుసా? ఫోటోలు చూడండి-12 jyothirlingas list with images ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Mahashivratri Special: 12 జ్యోతిర్లింగాలు ఎక్కడున్నాయో తెలుసా? ఫోటోలు చూడండి

Mahashivratri Special: 12 జ్యోతిర్లింగాలు ఎక్కడున్నాయో తెలుసా? ఫోటోలు చూడండి

Mar 08, 2024, 01:18 PM IST HT Telugu Desk
Mar 08, 2024, 01:18 PM , IST

  • Mahashivratri Special: 12 జ్యోతిర్లింగాలు ఎక్కడున్నాయో తెలుసా? ఆయా శివలింగాల ఫోటోలతో సహా వివరాలు తెలుసుకోండి.

సనాతన ధర్మంలో జ్యోతిర్లింగానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. జ్యోతిర్లింగాన్ని దర్శించడం ద్వారా సకల బాధలు తొలగిపోతాయని నమ్ముతారు. భారతదేశంలో మొత్తం 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఈ జ్యోతిర్లింగాలన్నీ వివిధ రాష్ట్రాల్లో ఉన్నాయి. ఈ 12 జ్యోతిర్లింగాల గురించి తెలుసుకుందాం...

(1 / 13)

సోమనాథ్ జ్యోతిర్లింగాన్ని భూమి యొక్క మొదటి జ్యోతిర్లింగంగా భావిస్తారు. ఇది గుజరాత్ లోని సౌరాష్ట్ర ప్రాంతంలో గల వెరావల్ రేవులో సముద్రం ఒడ్డున ఉంది. దీనిని చంద్ర దేవ్ స్వయంగా నిర్మించాడని చెబుతారు. సోమకుండ్ కూడా ఇక్కడే ఉంది.

(2 / 13)

 మల్లికార్జున జ్యోతిర్లింగం ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా నది ఒడ్డున శ్రీశైల పర్వతంపై ఉంది. ఇది చాలా పురాతనమైన ఆలయం, ప్రస్తుతం శివరాత్రి పర్వదినం సందర్భంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.

(3 / 13)

మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో క్షిప్రా నది ఒడ్డున ఉంది. దక్షిణ ముఖంగా ఉన్న ఏకైక జ్యోతిర్లింగం ఇది. తెలుగు రాష్ట్రాలకు దగ్గరలోనే ఉంటుంది. మీరూ సందర్శించండి.

(4 / 13)

 12 జ్యోతిర్లింగాలలో ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇది మధ్యప్రదేశ్ లోని ఖాండ్వా జిల్లాలో ఉంది. కుబేరుడు ఇక్కడ తపస్సు చేసి శివలింగాన్ని ప్రతిష్ఠించాడని ప్రతీతి.

(5 / 13)

కేదార్ నాథ్ జ్యోతిర్లింగం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఉంది. కేదార్ నాథ్ సముద్రమట్టానికి 3584 మీటర్ల ఎత్తులో ఉంది.

(6 / 13)

భీమశంకర్ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని పూణే జిల్లాలో సహ్యాద్రి అనే పర్వతంపై ఉంది.

(7 / 13)

కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నగరంలో ఉంది. దీనిని విశ్వేశ్వర్ జ్యోతిర్లింగం అని కూడా పిలుస్తారు.

(8 / 13)

త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఉంది. త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగానికి సమీపంలో బ్రహ్మగిరి అనే పర్వతం ఉంది.

(9 / 13)

జార్ఖండ్ లోని సంతాల్ పరగణలోని జసిదిహ్ రైల్వే స్టేషన్ సమీపంలో బైద్యనాథ్ జ్యోతిర్లింగం ఉంది. దీనిని బాబా బైజ్ నాథ్ ధామ్ అని కూడా పిలుస్తారు.

(10 / 13)

నాగేశ్వర్ జ్యోతిర్లింగం: గుజరాత్ లోని బరోడా ప్రాంతంలోని గోమతి ద్వారకా సమీపంలో ఉంది. ద్వారకాపురి నుండి నాగేశ్వర్ జ్యోతిర్లింగానికి దూరం 17 మైళ్ళు. 

(11 / 13)

రామేశ్వరం జ్యోతిర్లింగం తమిళనాడులోని రామేశ్వరంలో ఉంది. ఈ జ్యోతిర్లింగాన్ని శ్రీరాముడు స్థాపించాడని నమ్ముతారు.

(12 / 13)

శివుని చివరి జ్యోతిర్లింగం ఘుష్మేశ్వర్ జ్యోతిర్లింగం. ఘుష్మేశ్వర్ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని వెరుల్ గ్రామంలో ఉంది.

(13 / 13)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు