TG SSC Supply Exams : తెలంగాణ పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలకు సర్వం సిద్ధం, 170 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు-telangana ssc supplementary exams 2024 170 exam centers hall tickets released on website ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Ssc Supply Exams : తెలంగాణ పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలకు సర్వం సిద్ధం, 170 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు

TG SSC Supply Exams : తెలంగాణ పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలకు సర్వం సిద్ధం, 170 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు

Bandaru Satyaprasad HT Telugu
May 27, 2024 07:37 PM IST

TG SSC Supply Exams : తెలంగాణలో పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎస్ఎస్సీ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 170 పరీక్షా కేంద్రాల్లో జూన్ 3 నుంచి 13 పరీక్షలు నిర్వహించనున్నారు.

తెలంగాణ పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలకు సర్వం సిద్ధం, 170 పరీక్షా కేంద్రాలు
తెలంగాణ పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలకు సర్వం సిద్ధం, 170 పరీక్షా కేంద్రాలు

TG SSC Supply Exams : తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎస్ఎస్సీ బోర్డు ప్రకటించింది. ఇప్పటికే బోర్డు అధికారిక వెబ్ సైట్ https://bse.telangana.gov.in/ లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంచింది.

పరీక్షా సమయాలు ఇలా?

ఎస్ఎస్సీ పరీక్షల్లో ఫస్ట్ లాంగ్వేజ్ (కాంపోజిట్ కోర్సు), సైన్స్ సబ్జెక్టులకు మినహా అన్ని సబ్జెక్టులకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఫస్ట్ లాంగ్వేజ్ (కాంపోజిట్ కోర్సు) కు ఉదయం 9.30 నుంచి 12.50 వరకు నిర్వహించనున్నారు. అయితే సైన్స్ సబ్జెక్టులలో పార్ట్-I ఫిజికల్ సైన్స్, పార్ట్-II బయోలాజికల్ సైన్స్ ఉన్నాయి. వీటిని రెండు వేర్వేరు రోజులలో ఉదయం 9.30 నుంచి 11.00 వరకు నిర్వహిస్తారు. పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 51,237 మంది అప్లై చేసుకున్నట్లు ఎస్ఎస్సీ బోర్టు ప్రకటించింది. వీరిలో బాలురు 31,625, బాలికలు 19,612 మంది ఉన్నారు.రాష్ట్రంలోని 170 కేంద్రాలలో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్ష నిర్వహణకు 170 మంది చీఫ్ సూపరింటెండెంట్‌లు, 170 డిపార్ట్‌మెంటల్ అధికారులు, 1300 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు బోర్డు ప్రకటించింది. హాల్-టికెట్లు, నామినల్ రోల్స్ ను ఇప్పటికే జిల్లా విద్యాశాఖ అధికారులు ఆయా పాఠశాలలకు పంపినట్లు పేర్కొంది. అభ్యర్థులు తమ హాల్-టికెట్లను స్కూల్ హెడ్ మాస్టర్స్ నుంచి పొందవచ్చని తెలిపింది.

హాల్ టికెట్లు విడుదల

విద్యార్థుల హాల్ టికెట్లు www.bse.telangana.gov.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థుల సందేహాలు నివృత్తి చేసేందుకు హైదరాబాద్‌లోని కంట్రోల్ రూమ్‌(ఫోన్ నెం:040-23230942)ను ఏర్పాటు చేసినట్లు బోర్డు అధికారులు తెలిపారు. అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి ఒక గంట ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని తెలిపారు. మాస్ కాపీయింగ్, అవకతవకలను అరికట్టడానికి పరీక్షా కేంద్రాల పర్యవేక్షణకు రాష్ట్రంలో 38 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు బోర్డు ప్రకటించింది. ఎస్ఎస్సీ సప్లిమెంటరీ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు ప్రతి పరీక్షా కేంద్రంలోని చీఫ్ సూపరింటెండెంట్ గదిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను నిషేధించారు. జూన్-2024 ఎస్ఎస్సీ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.

తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. విద్యాశాఖ శనివారం హాల్ టికెట్లను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. ఎస్ఎస్సీ బోర్డు అధికారిక వెబ్ సైట్ https://bse.telangana.gov.in/ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ప్రధానోపాధ్యాయుల యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ తో లాగిన్ అయ్యి స్కూల్ వారీగా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఇలా

జూన్‌ 3, 2024 నుంచి తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్ని నిర్వహించనున్నారు. ప్రతి రోజు ఉదయం 9.30 నుంచి 12.30 వరకు పరీక్షలు నిర్వహిస్తారు.

  • జూన్ 3- ఫస్ట్‌ లాంగ్వేజ్‌, కంపోజిట్‌ పేపర్ 1, కంపోజిట్ కోర్సుల పరీక్షలు(కంపోజిట్ పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.50 వరకు)
  • జూన్‌ 5- సెకండ్ లాంగ్వేజ్‌
  • జూన్‌ 6 - థర్డ్‌ లాంగ్వేజ్
  • జూన్‌ 7 - మ్యాథ్స్‌
  • జూన్ 8- ఫిజికల్ సైన్స్
  • జూన్‌ 10 - బయాలజీ
  • జూన్‌ 11 - సోషల్
  • జూన్ 12 - ఓరియంటల్‌ సబ్జెక్టు పేపర్ 1( సంస్కృతం, అరబిక్)
  • జూన్ 13 - ఓరియంటల్‌ లాంగ్వేజ్‌ పేపర్ 2

సంబంధిత కథనం