SSC SI Results 2024 : ఎస్ఎస్సీ ఎస్సై తుది ఫలితాలు విడుదల- ఇలా చెక్ చేసుకోండి
SSC SI Results 2024 : ఎస్ఎస్సీ దిల్లీ పోలీస్, ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఎస్సై తుది ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు ఫలితాలను ఎస్ఎస్సీ అధికారిక వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.
SSC SI Results 2024 : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC SI Results) దిల్లీ పోలీస్, ఇతర సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF) సబ్ ఇన్‌స్పెక్టర్ల పోస్టులకు నిర్వహించిన పరీక్ష తుది ఫలితాలు వెలువడ్డాయి. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు పరీక్ష ఫలితాలను(Results) ఎస్ఎస్సీ అధికారిక వెబ్‌సైట్ ssc.gov.in లో చెక్ చేసుకోవచ్చు. దిల్లీ పోలీస్(Delhi Police), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(CRPF), ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్(ITBP), సహస్ర సీమ బల్(SSB) లో సబ్-ఇన్‌స్పెక్టర్ పోస్టులకు మొత్తం 1,865 అభ్యర్థులు ఎంపిక చేశారు. తుది ఫలితాల్లో 166 మంది మహిళా అభ్యర్థులు, 1699 మంది పురుష అభ్యర్థులు ఎంపికయ్యారు.
ఎస్ఎస్సీ ఎస్సై(SSC SI Results) తుది ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి
Step 1 : ఎస్ఎస్సీ అధికారిక వెబ్‌సైట్ ssc.gov.inని సందర్శించండి.
Step 2 : 'ఫలితాలు'పై క్లిక్ చేయండి
Step 3 : తర్వాత 'ఎస్ఎస్సీ దిల్లీ పోలీస్, CAPF SI తుది ఫలితాలు' అనే నోటిఫికేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.
Step 4 : అనంతరం అభ్యర్థుల రోల్ నంబర్‌లను కలిగి ఉన్న పీడీఎఫ్ ఓపెన్ అవుతుంది.
Step 5 : ఫలితాలు చెక్ చేసుకోండి, అనంతరం భవిష్యత్ అవసరాల కోసం పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేయండి.
మాల్‌ప్రాక్టీసెస్, మరింత పరిశీలన కారణంగా 79 మంది అభ్యర్థుల ఫలితాలు ఇంకా ప్రచురించలేదని ఎస్ఎస్సీ ప్రకటించింది. ఎంపిక జాబితాలో అందరి పేర్లు చేరుస్తామని కమిషన్ ప్రకటించింది. ఎస్ఎస్సీ(SSC) దిల్లీ పోలీస్, సీఏపీఎఫ్ ఎస్సై మార్క్ షీట్లను త్వరలో వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తామని కమిషన్ తెలిపింది. అభ్యర్థులు తాజా అప్‌డేట్‌ల కోసం అధికారిక వెబ్‌సైట్‌లో తనిఖీ చేస్తూ ఉండాలని సూచించింది.
మొత్తం 1876 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
దిల్లీ పోలీసు, ఆర్మ్‌డ్ విభాగాల్లో మొత్తం 1876 పోస్టుల భర్తీకి గత ఏడాది జులై 22న నోటిఫికేషన్(SSC SI Notification) విడుదలైంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అక్టోబరు 3 నుంచి 5 వరకు పేపర్-1 కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించారు. పేపర్-1 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్ ఈవెంట్లు నిర్వహించారు. ఈ ఏడాది మార్చి 1 నుంచి 20 వరకు అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన, మెడికల్ టెస్టులు నిర్వహించి 1865 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. 1699 మంది పురుషులు, 166 పోస్టులను మహిళా అభ్యర్థులను ఎంపిక చేశారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.35,400-రూ.1,12,400 జీతం లభించనుంది.
సంబంధిత కథనం