AP SSC Supplementary Exams : ఏపీ పదో తరగతి సప్లిమెంటరీకి సర్వం సిద్ధం, 685 పరీక్ష కేంద్రాల్లో మే 24 నుంచి ఎగ్జామ్స్!-amaravati ap ssc supplementary exams 2024 starts may 24th hall tickets already released ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Ssc Supplementary Exams : ఏపీ పదో తరగతి సప్లిమెంటరీకి సర్వం సిద్ధం, 685 పరీక్ష కేంద్రాల్లో మే 24 నుంచి ఎగ్జామ్స్!

AP SSC Supplementary Exams : ఏపీ పదో తరగతి సప్లిమెంటరీకి సర్వం సిద్ధం, 685 పరీక్ష కేంద్రాల్లో మే 24 నుంచి ఎగ్జామ్స్!

Bandaru Satyaprasad HT Telugu
May 21, 2024 04:30 PM IST

AP SSC Supplementary Exams : ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 685 పరీక్ష కేంద్రాల్లో మే 24 నుంచి జూన్ 3 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.

ఏపీ పదో తరగతి సప్లిమెంటరీకి సర్వం సిద్ధం, 685 పరీక్ష కేంద్రాల్లో మే 24 నుంచి ఎగ్జామ్స్!
ఏపీ పదో తరగతి సప్లిమెంటరీకి సర్వం సిద్ధం, 685 పరీక్ష కేంద్రాల్లో మే 24 నుంచి ఎగ్జామ్స్!

AP SSC Supplementary Exams : ఏపీ పదో తరగతి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఎస్ఎస్సీ హాల్ టికెట్లను బోర్డు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. విద్యార్థులు నేరుగా హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ ఏడాది సప్లిమెంటరీ పరీక్షలకు 1,61,877 మంది విద్యార్థులు హాజరుకానున్నారని ప్రభుత్వ పరీక్షల విభాగం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా మే 24 నుంచి జూన్‌ 3 వరకు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయి. అయితే పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను ఉదయం 8.45 గంటల నుంచి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. ఏపీ 10వ తరగతి ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులతోపాటు ఇంప్రూవ్‌మెంట్‌ కోసం విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకావచ్చు.

685 పరీక్ష కేంద్రాలు

ఈ ఏడాది పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు 1,61,877 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరిలో 96,938 మంది అబ్బాయిలు, 64,939 మంది అమ్మాయిలు పరీక్షలు రాయనున్నారని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 685 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ఈ పరీక్షల నిర్వహణకు 6,900 మంది ఇన్విజిలేటర్లతో పాటు 685 మంది డిపార్టుమెంటల్‌ అధికారులు, 86 ఫ్లైయింగ్‌ స్క్వాడ్స్‌, 685 మంది చీఫ్‌ సూపరింటెండెంట్స్‌ ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్

  • మే 24 - ఫస్ట్‌ ల్యాంగ్వేజ్‌
  • మే 25 - సెకండ్‌ ల్యాంగ్వేజ్‌
  • మే 27 - ఇంగ్లిష్‌
  • మే 28- గణితం
  • మే 29- ఫిజికల్ సైన్స్
  • మే 30 - జీవ శాస్త్రం
  • మే 31 - సాంఘికశాస్త్రం
  • జూన్‌ 1 - కాంపోజిట్ విద్యార్థులకు ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2, ఓఎస్‌ఎస్‌ పేపర్‌-1
  • జూన్ 3 - ఓఎస్ఎస్ పేపర్-2

ఏపీ ఎస్ఎస్సీ సప్లిమెంటరీ పరీక్ష హాల్ టికెట్ డౌన్‌లోడ్ ఇలా?

Step 1 : విద్యార్థులు bse.ap.gov.in అధికారిక వెబ్‌సైట్‌పై క్లిక్ చేయండి.

Step 2: హోమ్‌పేజీలోని "SSC అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్ 2024" లింక్ పై క్లిక్ చేయండి.

Step 3: కొత్త పేజీలో జిల్లా, స్కూల్ పేరు, విద్యార్థి పేరు, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి డౌన్ లోడ్ హాల్ టికెట్ పై క్లిక్ చేయండి.

Step 4 : ఏపీ ఎస్ఎస్సీ సప్లిమెంటరీ హాల్ టికెట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

Stpe 5 : సప్లిమెంటరీ అడ్మిట్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకోండి.

ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి నిర్వహించనున్నారు. సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లను ఇవాళ బోర్డు విడుదల చేయనున్నట్లు సమాచారం. మే 24 నుంచి జూన్‌1వ తేదీ వరకు ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. సప్లిమెంటరీ పరీక్షలను రోజుకు రెండు షిఫ్టుల్లో నిర్వహిస్తారు. ఆయా తేదీల్లో ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు నిర్వహించనున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం