Telangana SSC Hall Tickets 2024 : తెలంగాణ పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు(TS SSC Hall Tickets) అందుబాటులోకి వచ్చాయి. అధికారిక వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చని ఎస్ఎస్సీ బోర్డు అధికారులు ప్రకటన విడుదల చేశారు. మార్చి 18వ తేదీన ప్రారంభమై….ఏప్రిల్ 2వ తేదీతో ముగియనున్నాయి. మొత్తం 7 రోజులపాటు పరీక్షలు జరగనున్నాయి. ఈసారి జరగబోయే పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,676 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈసారి 5,08 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇప్పటికే పాఠశాలలకు విద్యార్థులకు సంబంధించిన హాల్ టికెట్లను(Telangana SSC Hall Ticket Download 2024) పంపించింది పరీక్షల బోర్డు. అయితే వెబ్ సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకునేందుకు వీలుగా వీటిని మార్చి 7వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకువచ్చింది.
మార్చి 18- ఫస్ట్ లాంగ్వేజ్(తెలుగు, కాంపోజిట్ కోర్సు)
మార్చి 19- సెకండ్ లాంగ్వేజ్( హిందీ)
మార్చి 21- థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లీష్)
మార్చి 23- మ్యాథమెటిక్స్
మార్చి 26- సైన్స్ పేపర్ -1(ఫిజిక్స్)
మార్చి 28- సైన్స్ పేపర్ -2(బయాలజీ)
మార్చి 30- సోషల్ స్టడీస్
ఏప్రిల్ 1- ఒకేషనల్ కోర్సు (సంస్కృతం, అరబిక్ మొదటి పేపర్),
ఏప్రిల్ 2- ఒకేషనల్ కోర్సు(సంస్కృతం, అరబిక్ రెండో పేపర్)
గత అనుభవాల దృష్ట్యా మాల్ ప్రాక్టీస్ ను అడ్డుకునేందుకు, ప్రశ్నాపత్రాల నిర్వహణ విషయంలో కఠినంగా వ్యవహరించనున్నట్లు విద్యాశాఖ అధికారులు స్పష్టం చేసింది. ఎలాంటి లీకేజీలకు అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. పరీక్షల నిర్వహణపై ఇటీవలే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని… ఎలాంటి లోపాలు ఉండవద్దని సూచించారు. ముఖ్యంగా లీకేజీ వంటి ఘటనలకు అవకాశం ఇవ్వొద్దని.. ఇన్విజిలేటర్లు కూడా ప్రభుత్వం సూచించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద భద్రతా చర్యలు కూడా పకడ్బందీగా ఉండాలన దిశానిర్దేశం చేశారు.
AP SSC Hall Tickets : ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు(AP SSC Hall Tickets Download) ఆన్ లైన్ లో విడుదలయ్యాయి. విద్యార్థులు నేరుగా అధికారిక వెబ్ సైట్ లో హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. పదో తరగతి వార్షిక పరీక్షలకు పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 18 నుంచి 30 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. హాల్ టికెట్ల డౌన్‌లోడ్‌కు విద్యార్థి పేరు, జిల్లా పేరు, పాఠశాల పేరు, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
అధికారిక వెబ్ సైట్ www.bse.ap.gov.in నుంచి విద్యార్థులు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 2023–24 విద్యా సంవత్సరంలో పదో తరగతి(AP SSC Exams) పబ్లిక్ పరీక్షలకు 6,23,092 మంది రెగ్యులర్ విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో 3,17,939 మంది బాలురు, 3,05,153 మంది బాలికలు ఉన్నారు. అయితే గతేడాది పదో తరగతి తప్పి తిరిగి రాస్తున్న వారు 1,02,528 మంది రెగ్యులర్‌గా పరీక్షలు రాయనున్నారు. మొత్తంగా ఈసారి 7,25,620 మంది టెన్త్ పరీక్షలకు హాజరుకానున్నారు. పదో తరగతి(10th Exams) పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 3,473 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. మార్చి 18 నుంచి మార్చి 28 వరకు ప్రధాన పరీక్షలు నిర్వహిస్తున్నారు. 29, 30 తేదీల్లో ఓరియంటల్, ఒకేషనల్ పరీక్షలు నిర్వహిస్తారు. పేపర్ లీక్(Paper Leak) , మాల్ ప్రాక్టీస్ అరికట్టేందుకు విద్యాశాఖ 156 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 682 సిట్టింగ్ స్వాడ్స్‌ను సిద్ధం చేసింది. దీంతో 130కి పైగా పరీక్ష కేంద్రాలలో సీసీ కెమెరాలను(CC Cameras) ఏర్పాటు చేశారు. వీటితో నిరంతరం పరీక్షల నిర్వహణ తీరును విద్యాశాఖ అధికారులు పర్యవేక్షించనున్నారు. గత ఏడాది పేపర్ లిక్ వివాదం దృష్టిలో పెట్టుకుని పరీక్ష నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.