TSPSC Group 4 Hall tickets : తెలంగాణ గ్రూప్-4 హాల్ టికెట్లు వచ్చేశాయ్, ఇలా డౌన్ లోడ్ చేసుకోండి!-telangana group 4 hall ticket released tspsc website exam on july 1st ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tspsc Group 4 Hall Tickets : తెలంగాణ గ్రూప్-4 హాల్ టికెట్లు వచ్చేశాయ్, ఇలా డౌన్ లోడ్ చేసుకోండి!

TSPSC Group 4 Hall tickets : తెలంగాణ గ్రూప్-4 హాల్ టికెట్లు వచ్చేశాయ్, ఇలా డౌన్ లోడ్ చేసుకోండి!

Bandaru Satyaprasad HT Telugu
Jun 24, 2023 01:57 PM IST

TSPSC Group 4 Hall tickets : గ్రూప్-4 పరీక్షకు టీఎస్పీఎస్సీ హాల్ టికెట్లు విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 8,180 పోస్టులకు జులై 1న పరీక్ష నిర్వహించనున్నారు.

తెలంగాణ గ్రూప్-4 హాల్ టికెట్లు
తెలంగాణ గ్రూప్-4 హాల్ టికెట్లు (Image Credit : Unsplash)

TSPSC Group 4 Hall tickets : తెలంగాణ గ్రూప్-4 పరీక్షకు టీఎస్పీఎస్సీ అధికారులు ఏర్పాట్లు చేస్తు్న్నారు. జులై 1న నిర్వహించే గ్రూప్-4(Group-4) పరీక్షకు హాల్ టికెట్లు విడుదల చేశారు. హాల్ టికెట్ల టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్ సైట్ నుంచి అభ్యర్థులు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. జులై 1వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,180 గ్రూప్-4 పోస్టులకు గత ఏడాది నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. గ్రూప్-4 పోస్టులకు మొత్తం 9.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

భారీగా దరఖాస్తులు

గ్రూప్‌-4 సర్వీసు పోస్టులకు భారీగా దరఖాస్తులు చేసుకున్నారు. టీఎస్పీఎస్సీ చరిత్రలో ఈ స్థాయిలో దరఖాస్తు చేయడం ఇది రెండోసారి అని అధికారులు తెలిపారు. 2018లో 700 వీఆర్వో ఉద్యోగాలకు 10.58 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. గతంలో 7.9 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. జిల్లా స్థాయిలో పోస్టులు కావడంతో పోటీపడుతున్న అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని అధికారులు తెలిపారు. గ్రూప్-4 పోస్టుల భర్తీకి గత ఏడాది డిసెంబరు 2న నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టుల భర్తీకి డిసెంబరు 30 నుంచి ఫిబ్రవరి 3 వరకు అప్లికేషన్లు స్వీకరించారు.

ఇలా డౌన్ లోడ్ చేసుకుండి

Step 1 : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ (TSPSC) అధికారిక వెబ్‌సైట్ https://www.tspsc.gov.in/ సందర్శించండి.

Step 2 : గ్రూప్ -4 హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకుండి అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.

Step 3 : మీ అప్లికేషన్ ID, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేయండి.

Step 4 : పాప్-అప్ మెను నుంచి గ్రూప్ 4 ఎగ్జామినేషన్ అడ్మిట్ కార్డ్‌ని చూడవచ్చు.

Step 5 : మీ హాల్ టికెట్ ను డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోండి.

గ్రూప్ 4 మొత్తం ఖాళీల సంఖ్య 8,180 కాగా... ఇందులో జూనియర్ అకౌంటెంట్ పోస్టులు 429, ఆర్థికశాఖ - 191, మున్సిపల్ శాఖ - 238, జూనియర్ అసిస్టెంట్ 5730 పోస్టులు , జూనియర్ ఆడిటర్ పోస్టులు 18 , వార్డ్ ఆఫీసర్ పోస్టులు 1862 ఉన్నాయి. ఈ పరీక్షను మొత్తం 300 మార్కులకు ఆన్‌లైన్ రాతపరీక్ష లేదా ఓంఎంఆర్ ఆన్సర్ షీట్ విధానంలో నిర్వహించనున్నారు. గ్రూప్-4 పరీక్షలో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 (జనరల్ స్టడీస్)- 150 మార్కులకు, పేపర్-2 (సెక్రటేరియల్ ఎబిలిటీస్)-150 మార్కులకు ఉంటాయి. ఆబ్జెక్టివ్ విధానంలోనే ప్రశ్నలు అడుగుతారు.

Whats_app_banner