Modi In Telangana : కుటుంబ పార్టీలకు కుటుంబమే ఫస్ట్, మోదీకి నేషన్ ఫస్ట్- ప్రధాని మోదీ
Modi In Telangana : మోదీ గ్యారంటీ అంటే పక్కా అమలయ్యే గ్యారంటీ అని ప్రధాని మోదీ అన్నారు. తెలంగాణలో రెండో రోజు పర్యటిస్తున్న ప్రధాని మోదీ రూ.7 వేల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
Modi In Telangana : తెలంగాణ ప్రజలు ప్రేమను రెండింతలు అభివృద్ధి రూపంలో తిరిగి అందిస్తామని ప్రధాని మోదీ (PM Modi)అన్నారు. ఇది మోదీ గ్యారెంటీ, మోదీ గ్యారంటీ(Modi Guarantee) అంటే.. గ్యారంటీగా పూర్తి అయ్యే గ్యారంటీ అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు శివారులోని పటేల్ గూడలో ప్రధాని మోదీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. లింగంపల్లి- ఘట్‌కేసర్ ఎంఎంటీఎస్ రైలును ప్రధాని మోదీ వర్చ్‌వల్‌గా ప్రారంభించారు. దాదాపు రూ.7 వేల కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. అనంతరం సంగారెడ్డిలో బీజేపీ విజయ సంకల్ప సభ(BJP Meeting)లో మోదీ పాల్గొన్నారు. ఈ సభలో మోదీ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ , కాంగ్రెస్ పై విమర్శలు చేశారు. కుటుంబ పాలన సాగించే వారిలో అభద్రతా భావం ఎక్కువన్నారు. కాంగ్రెస్ అవినీతిని బయటపెడుతున్నాననే తనపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.
కుటుంబ పాలనకు బీజేపీ వ్యతిరేకం
ప్రపంచంలో తెలుగు వారి ఖ్యాతి వ్యాప్తి చెందిందన్న ప్రధాని మోదీ.. ఇది దేశానికి గర్వకారణమన్నారు. కశ్మీర్‌లో 370 ఆర్టికల్ రద్దు(Article 370) చేశామని, అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ట చేశామన్నారు. మోదీ ఇచ్చిన గ్యారంటీలు పక్కాగా అమలు అవుతాయన్నారు. జమ్ము కశ్మీర్(Jammu Kashmir) నుంచి తమిళనాడు వరకు కుటుంబ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కుటుంబాలు(Family Political Parties) మాత్రమే బాగుపడ్డాయని విమర్శించారు. అందుకే బీజేపీ కుటుంబ పాలనను వ్యతిరేకిస్తుందన్నారు. తాను కుటుంబ పాలనపై ప్రశ్నిస్తున్నందుకు తనకు కుటుంబం లేదని విమర్శలు చేస్తున్నారన్నారు. కుటుంబ పాలన చేసే వారికి రాష్ట్ర సంపద దోచేందుకు లైసెన్స్ ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఒక్కో కుటుంబంలో 50 మంది వరకు ప్రజల సొమ్ము దోచుకుతింటున్నారని మండిపడ్డారు. మోదీకి కుటుంబం లేకపోతే కుటుంబ పార్టీలన్నీ యుద్ధానికి దిగుతాయా? అని ప్రశ్నించారు. కుటుంబ పార్టీలు తమ కుటుంబమే ఫస్ట్ అనుకుంటాయని, కానీ మోదీకి నేషన్ ఫస్ట్ అన్నారు.
వారసత్వ నేతలకు మోదీ భయం
దోచుకుతింటున్న వారసత్వ రాజకీయాలను తాను వ్యతిరేకిస్తున్నానని ప్రధాని మోదీ అన్నారు. కుటుంబ పార్టీలతో ప్రతిభ ఉన్నవారికి అన్యాయం జరుగుతోందన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము కానివ్వనన్నారు. వారసత్వ నేతలకు మోదీ (Modi in Telangana)భయం పట్టుకుందన్నారు. కుటుంబ పాలకుల అవినీతి సొమ్మును వెలికితీస్తున్నానన్నారు. వీళ్లంతా నల్లధనం దాచుకోవడానికే విదేశాల్లో ఖాతాలు తెరిచారన్నారు. మేమంతా మోదీ కుటుంబమే అని తెలంగాణ ప్రజలు అంటున్నారన్నారు. 70 ఏళ్లలో కాంగ్రెస్(Congress) చేయలేని పనిని పదేళ్లలో బీజేపీ ప్రభుత్వం చేసి చూపిందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనన్నారు. ఈ రెండు పార్టీలూ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ కోట్లు దోచుకుతిందన్నారు. తెలంగాణలో బీజేపీ పట్ల ప్రజల ఆదరణ పెరుగుతోందన్నారు.
"అవినీతి, బుజ్జగింపు, బంధుప్రీతిపై నిలువెల్ల మునిగిన ఇండియా కూటమి నాయకులు ఇప్పుడు బీజేపీని చూసి బెదిరిపోతూ, అసత్య ప్రచారాలు చేస్తున్నారు. మోదీకి కుటుంబం లేదని మాట్లాడుతున్నారు. దేశ ప్రజల భవిష్యత్తును ఉజ్వలం చేయడం కోసం నా జీవితంలోని ప్రతి క్షణం ఆర్పిస్తాను. దేశ ప్రజలంతా మోదీ కుటుంబ సభ్యులు అవుతారు" - ప్రధాని మోదీ
సంబంధిత కథనం