Cental Tribal University : సమ్మక్క - సారక్క ట్రైబల్ వర్శిటీలో డిగ్రీ స్పాట్ అడ్మిషన్లు - ముఖ్య తేదీలివే
Sammakka Sarakka Tribal University : సమ్మక్క - సారక్క సెంట్రల్ ట్రైబల్ వర్శిటీ నుంచి స్పాట్ అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదలైంది. బీఏ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. అక్టోబర్ 3వ తేదీన సీట్లను కేటాయించనున్నారు. https://ssctu.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి వివరాలు తెలుసుకోవచ్చు.
తెలంగాణలోని ములుగు జిల్లాలో సమ్మక్క - సారక్క సెంట్రల్ ట్రైబల్ వర్శిటీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇటీవలే తాత్కాలిక భవనాలను కూడా ప్రారంభించారు. ఇదే సమయంలో వర్శిటీలో ప్రవేశాల కోసం అడ్మిషన్ల నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఈ ప్రక్రియ దాదాపు పూర్తి అయింది. అయితే తాజాగా యూనివర్శిటీ నుంచి స్పాట్ అడ్మిషన్లకు ప్రకటన జారీ అయింది.
బీఏ ప్రోగ్రామ్ లో కోర్సుల్లో ప్రవేశాలు అందుబాటులో ఉన్నాయి. ఇంగ్లీష్ అనర్స్ తో పాటు ఎకానమిక్స్ కోర్సులు ఉన్నాయి. నాలుగేళ్ల కాలపరిమితితో వీటిని ప్రవేశపెట్టారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు https://docs.google.com/forms/d/e/1FAIpQLSeBna4IDgGA4y1GQtAUTvZxVjwvhB4OHiKEIPgwn2hgr5BPtw/viewform ఫామ్ పై క్లిక్ చేసి వివరాలను ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. రెండు కోర్సుల్లో కలిపి మొత్తం 17 సీట్లు ఖాళీగా ఉన్నాయి. అక్టోబర్ 3వ తేదీన ములుగు జిల్లా కేంద్రానికి దగ్గర ఉన్న ములుగు వర్శిటీలో ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు టెన్త్, ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికెట్లు, ట్రాన్స్‌ఫర్, మైగ్రేషన్ సర్టిఫికెట్లు, పాస్ ఫొటోలు, మెడికల్ అఫిడవిట్, కుల ధ్రువీకరణ పత్రాలను స్మార్ట్ ఫోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి. ఇదే సమయంలో పైన ఇచ్చిన గూగుల్ ఫామ్ ఫూర్తి చేయాలి.
ఐసెట్ ప్రవేశాలు :
మరోవైపు తెలంగాణ ఐసెట్ 2024 ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా ఐసెట్ ప్రవేశాలకు సంబంధించి స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ జారీ అయింది. ఇప్పటికే తుది విడత కౌన్సెలింగ్ పూర్తి అయింది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక విడత కౌన్సెలింగ్ తేదీలను ప్రకటించారు. సెప్టెంబర్ 30వ తేదీన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవటంతో పాటు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. అక్టోబర్ 1వ తేదీన ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. అక్టోబర్ 4వ తేదీలోపు సీట్లు కేటాయిస్తామని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
రిజిస్ట్రేషన్ తో పాటు ధ్రువపత్రాల పరిశీలన పుర్తి అయిన అభ్యర్థులు అక్టోబర్ 1 నుంచి 2వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. 2వ తేదీన ఫ్రీజ్ చేసుకోవచ్చు. అక్టోబర్ 4వ తదీలోపు అభ్యర్థులకు సీట్లను కేటాయిస్తారు. అక్టోబర్ 4 నుంచి 5 తేదీల్లో సీట్లు పొందిన విద్యార్థులు నిర్ణయించిన ఫీజును చెల్లించాలి. అక్టోబర్ 5 నుంచి 7 తేదీల్లో ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.