T Congress Bus Yatra Live Updates : సమ్మక్క-సారలమ్మ జాతరను కుంభమేళ తరహాలో జాతీయ ఉత్సవంగా నిర్వహిస్తాం- రాహుల్ గాంధీ
- Rahul Gandhi -Priyanka Gandhi Telangana Tour : తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో… కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం ప్రారంభం కానుంది. ఆ పార్టీ అగ్ర నేతలు రాహుల్, ప్రియాంక గాంధీ ములుగు జిల్లాలోని రామప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బస్సు యాత్ర లైవ్ అప్డేట్స్ కోసం పేజీని రీఫ్రెష్ చేయండి…
Wed, 18 Oct 202301:53 PM IST
5 రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం - రాహుల్ గాంధీ
కాంగ్రెస్ బీజేపీ ఆలోచన విధానంపై కొట్లాడుతుంది. రానున్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీని ఓడిస్తుంది. బీజేపీ బీ టీమ్ బీఆర్ఎస్ కూడా ఓడించాలి.
Wed, 18 Oct 202301:37 PM IST
కేసీఆర్ పై ఒక్క కేసు కూడా ఉండదు- రాహుల్ గాంధీ
తెలంగాణలో బీఆర్ఎస్ గెలవాలని బీజేపీ కోరుకుంటుంది. బీజేపీ, బీఆర్ఎస్ కలిసే ఉన్నాయి. నాపై 24 నాలుగు కేసులు పెట్టారు. నా ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేశారు. కేసీఆర్ పై ఒక్క కేసు పెట్టరు. కేసీఆర్ పై సీబీఐ, ఈడీ కేసులు ఉండవు. కేసీఆర్ నరేంద్ర మోదీ చేతుల్లో ఉన్నారు. బీజేపీకి రాజకీయంగా మద్దతు కావాల్సి వస్తే కేసీఆర్ సపోర్టు చేస్తారు.
Wed, 18 Oct 202301:33 PM IST
కరెంటు బిల్లులో 200 యూనిట్లు ఉచితంగా ఇస్తాం-రాహుల్ గాంధీ
పోడు భూములపై ఆదివాసీలకు హక్కుల కల్పిస్తాం. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆదివాసీల బిల్లు ఆమోదించాం. కాంగ్రెస్ ఇస్తున్న హామీలను నిలబెట్టుకుంటుంది. మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళలకు నెలకు రూ.2500 ఇస్తాం. రూ.500 లకే గ్యాస్ సిలిండర్ ఇస్తాం. భూమి లేని రైతు కూలీలకు రూ.12 వేలు ఇస్తాం. కరెంట్ బిల్లుల్లో 200 యూనిట్లు ఉచితంగా ఇస్తాం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.4 వేల పింఛన్ ఇస్తాం. యువతీ యువకులకు 5 లక్షల ఆర్థిక సాయం చేస్తాం. సమ్మక్క-సారలమ్మ ఉత్సవాన్ని జాతీయ ఉత్సవంగా చేస్తాం. కుంభమేళా తరహాలో చేస్తాం. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే సమ్మక్క-సారలమ్మ జాతరను జాతీయ ఉత్సవంగా చేస్తాం.
Wed, 18 Oct 202301:28 PM IST
కాంగ్రెస్ మాట ఇస్తే నిలబెట్టుకుంటుంది- రాహుల్ గాంధీ
కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ రూ.లక్ష కోట్లు దోచుకున్నారు. రూ.లక్ష రైతు రుణమాఫీ చేస్తామని మోసం చేశారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాం. రాజస్థాన్ లో రూ.25 లక్షల వరకు వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. దేశంలో ఉచిత వైద్య సేవలు అందిస్తుంది కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో మాత్రమే. ఛత్తీస్ ఘడ్ లో రైతుల వద్ద మద్దతు ధర కంటే ఎక్కువగా కొనుగోలు చేస్తుంది. కర్ణాటకలో మొదటి రోజే హామీలు అమలు చేశాం. కర్ణాటకలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ. ప్రతీ నెల మహిళల ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయి.
Wed, 18 Oct 202301:03 PM IST
కాంగ్రెస్ ప్రభుత్వంలో రూ.2 లక్షల రైతు రుణమాఫీ
పోరాడి సాధించుకున్న తెలంగాణలో సామాజిక న్యాయం దొరకడంలేదని ప్రియాంక గాంధీ ఆరోపించారు. ఉద్యోగాల కోసం యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి తెలంగాణ ప్రజల ఆశలను వమ్ము చేసిందన్నారు. మీ ఆశలు నెరవేరాలంటే కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆకాంక్షలకు విలువ ఇచ్చిందన్నారు. రాజకీయ మూల్యం చెల్లించి మరీ తెలంగాణను సోనియా గాంధీ ఇచ్చారన్నారు. రైతులకు మద్దతు ధర కంటే ఎక్కువ చెల్లిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామన్నారు. ఇందిరమ్మ రైతు భరోసా కింద ప్రతి ఏకరాకు రైతుకు రూ.15 వేలు ఇస్తామన్నారు. భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామన్నారు.
Wed, 18 Oct 202312:51 PM IST
తెలంగాణ ప్రజల రాష్ట్ర ఆకాంక్షను కాంగ్రెస్ నెరవేర్చింది- ప్రియాంక గాంధీ
'ములుగు జిల్లా పుణ్యభూమి, ఇక్కడ తెలంగాణ రాష్ట్రం కోసం చాలా మంది పోరాటం చేశారు. తెలంగాణ ప్రగతి కోసం ప్రజలు కలలు కన్నారు. సామాజిక న్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ పార్టీని నమ్మారు. కానీ మీ నమ్మకాన్ని బీఆర్ఎస్ వమ్ము చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆంక్షలు నెరవేస్తుంది. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆకాంక్షను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చింది. రాజకీయ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేందుకు సోనియా నిర్ణయం తీసుకున్నారు.'- ప్రియాంక గాంధీ
Wed, 18 Oct 202312:37 PM IST
పదేళ్లు బీఆర్ఎస్ అరాచకపాలన- రేవంత్ రెడ్డి
60 సంవత్సరాల ఆకాంక్ష, వందలాది మంది ఆత్మ బలిదానాలతో తెలంగాణ ఆవిర్భవించిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. పదేళ్లు కల్వకుంట్ల కుటుంబానికి అవకాశం ఇస్తే... అరాచకపాలన, అవినీతి రాజ్యమేలుతోందని ఆరోపించారు. తెలంగాణను కేసీఆర్ కుటుంబం నుంచి విడిపించడానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందన్నారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరలేదన్నారు. అందుకే కాంగ్రెస్ ఆరు గ్యారంటీలతో ఎన్నికలకు వెళ్తుందన్నారు. తెలంగాణ ప్రజల కోసం సోనియా గాంధీ ఆరు గ్యారంటీలు ఇచ్చారన్నారు. ఆడబిడ్డల కోసం మహాలక్ష్మి పథకం తెచ్చామన్నారు.
Wed, 18 Oct 202301:03 PM IST
మహిళా డిక్లరేషన్
ములుగులో కాంగ్రెస్ విజయభేరి సభలో రాహుల్ , ప్రియాంక గాంధీ మహిళా డిక్లరేషన్ ప్రకటించనున్నారు.
Wed, 18 Oct 202312:30 PM IST
రామానుజపురంలో కాంగ్రెస్ విజయభేరి సభ
ములుగు జిల్లా రామానుజపురంలో కాంగ్రెస్ విజయభేరి సభ నిర్వహించింది. ఈ సభలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొన్నారు.
Wed, 18 Oct 202312:20 PM IST
కాంగ్రెస్ విజయభేరి బస్సు యాత్రను ప్రారంభించిన రాహుల్ , ప్రియాంక గాంధీ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. ములుగు జిల్లాలో రామప్ప ఆలయం నుంచి విజయభేరి బస్సు యాత్రను ప్రారంభించారు. రామప్ప నుంచి రామానుజపురం వరకు బస్సులో బయలుదేరారు కాంగ్రెస్ నేతలు. రామానుజపురంలో విజయభేరి సభలో రాహుల్, ప్రియాంక గాంధీ ప్రసంగించనున్నారు. రాహుల్ గాంధీ వాహనం వెంట వేలాదిగా కాంగ్రెస్ కార్యకర్తలు బయలుదేరారు.
Wed, 18 Oct 202312:10 PM IST
ములుగులో కాంగ్రెస్ విజయ భేరీ బస్సు యాత్ర ప్రారంభం
ములుగులో కాంగ్రెస్ విజయ భేరి బస్సు యాత్ర ప్రారంభం అయింది. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి , తెలంగాణ కాంగ్రెస్ నేతలు బస్సు యాత్రలో పాల్గొన్నారు.
Wed, 18 Oct 202311:51 AM IST
టార్గెట్ తెలంగాణ
ఈ ఎన్నికల్లో ఎలాగైనా తెలంగాణలో అధికారంలోకి రావాలని చూస్తోంది కాంగ్రెస్. ఇందులో భాగంగా… అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీ బస్సు యాత్రను చేపట్టారు. ఈ టూర్ లో భాగంగా.. అధికార బీఆర్ఎస్, బీజేపీని టార్గెట్ చేసే అవకాశం ఉంది.
Wed, 18 Oct 202311:47 AM IST
ప్రత్యేక పూజలు
రామప్ప ఆలయంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చరిత్రను అడిగి తెలుసుకున్నారు.
Wed, 18 Oct 202311:45 AM IST
స్వాగతం పలికిన కాంగ్రెస్ నేతలు
రామప్ప దేవాలయానికి చేరుకున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి, ఏఐసిసి తెలంగాణ ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే, వంశీ చంద్ రెడ్డి గారు, టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి , భట్టి విక్రమార్క గారు, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే సీతక్క స్వాగతం పలికారు.
Wed, 18 Oct 202311:43 AM IST
ఎల్లుండి బోధన్ కు రాహుల్..
ఎల్లుండి బోధన్ వెళ్లి నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని సందర్శించి, కార్మికులతో మాట్లాడతారు రాహుల్ గాంధీ.
Wed, 18 Oct 202311:43 AM IST
రేపటి షెడ్యూల్ ఇదే
రేపు ఉదయం భూపాలపల్లి నుంచి మంథని వెళ్తారు రాహుల్ గాంధీ. అక్కడ నిర్వహించే పాదయాత్రలో రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు పాల్గొంటారు. మంథని నుంచి పెద్దపల్లి వెళ్లి సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రాత్రి 7గంటలకు కరీంనగర్‌లో చేపట్టే పాదయాత్రలో రాహుల్ పాల్గొని, రాత్రికి అక్కడే బస చేస్తారు.
Wed, 18 Oct 202311:42 AM IST
కార్మికులతో రాహుల్ ముఖాముఖి
బీడీ కార్మికులు, గల్ఫ్ దేశాలకు వలస వెళ్లినవారి కుటుంబాలు, నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ కార్మికులతో రాహుల్‌గాంధీ నేరుగా మాట్లాడేలా మరో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
Wed, 18 Oct 202311:42 AM IST
రైతులతో రాహుల్ గాంధీ
ఈ పర్యటనలో భాగంగా రాహుల్‌గాంధీతో మహిళలు, రైతులు, నిరుద్యోగులు, వ్యాపారులతో ముఖాముఖిలను ఏర్పాటు చేశారు. ఇందులో నేరుగా రైతులు, నిరుద్యోగులతో రాహుల్ గాంధీ స్వయంగా మాట్లాడనున్నారు.
Wed, 18 Oct 202311:41 AM IST
మూడు రోజులపాటు యాత్ర…
ఈ యాత్ర ములుగు, జయశంకర్-భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్ జిల్లాల్లో మూడు రోజులపాటు కొనసాగనుంది. యాత్ర సందర్భంగా ములుగు, పెద్దపల్లి, ఆర్మూర్ పట్టణాల్లో బహిరంగ సభలను, భూపాలపల్లి, మంథని, కరీంనగర్, నిజామాబాద్‌లలో పాదయాత్రలను నిర్వహించనున్నారు.
Wed, 18 Oct 202311:40 AM IST
ములుగులో భారీ సభ
తొలుత ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప ఆలయం వద్ద బస్సుయాత్రను ప్రారంభిస్తారు. అనంతరం ములుగు సమీపంలో నిర్వహిస్తున్న ఎన్నికల తొలి సభలో పాల్గొంటారు.
Wed, 18 Oct 202311:36 AM IST
రామప్పు నుంచి ములుగు వరకు
కాసేపట్లో కాంగ్రెస్ తలపెట్టిన బస్సు యాత్రను ప్రారంభించనున్నారు రాహుల్ గాంధీ. రామప్పు నుంచి ములుగు వరకు బస్సు యాత్ర కొనసాగనుంది.
Wed, 18 Oct 202311:36 AM IST
ప్రత్యేక పూజలు
రామప్పకు చేరుకున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Wed, 18 Oct 202311:34 AM IST
కాంగ్రెస్ బస్సు యాత్ర…
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో… కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం ప్రారంభం కానుంది. ఆ పార్టీ అగ్ర నేతలు రాహుల్, ప్రియాంక గాంధీ ములుగు జిల్లాలోని రామప్ప ఆలయం వద్ద బస్సుయాత్రను ప్రారంభించనున్నారు. ఇప్పటికే వారిద్దరూ రామప్పుకు చేరుకున్నారు.