President Draupadi Murmu : నేడు భద్రాద్రి రాములోరి చెంతకు ద్రౌపది ముర్ము...
President Draupadi Murmu శీతాకాల విడిది కోసం భాగ్యనగరానికి వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు తెలంగాణలోని ప్రముఖ పుణ్య క్షేత్రాలను దర్శించుకోనున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాష్ట్రపతి పర్యటన సాగనుంది. భద్రాచలం రాముల వారిని రాష్ట్రపతి దర్శించుకోనున్నారు. అనంతరం అసిఫాబాద్‌లో కొత్తగా నిర్మించిన ఏకలవ్య పాఠశాలను రాష్ట్రపతి వర్చువల్‌గా ప్రారంభిస్తారు. భద్రాచలం, సారపాక మండలాల్లో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు.
President Draupadi Murmu రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు భద్రాచలం రాముల వారిని దర్శించుకోనున్నారు. ఉదయం 7:20 గంటలకు హైదరాబాద్‌లోని రాష్ట్రపతి నిలయం నుంచి బయల్దేరి. 7:40 గంటలకు హకీంపేటలోని ఎయిర్‌ఫోర్స్ స్టేడియానికి రాష్ట్రపతి చేరుకుంటారు. 7:50 గంటలకు ప్రత్యేక విమానంలో బయల్దేరి 8:50 గంటలకు రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 9 గంటలకు బయల్దేరి 9:50 గంటలకు భద్రాచలంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 10 గంటలకు హెలిప్యాడ్ నుంచి రోడ్డు మార్గం ద్వారా 10:10 గంటలకు భద్రాచలం చేరుకుంటారు.
ఉదయం 10:15 గంటల నుంచి 10:30 గంటల వరకు ఆలయాన్ని సందర్శించి, ప్రసాద్ స్కీం కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. 10:30 గంటలకు స్వామివారిని దర్శించుకుంటారు. ఉదయం10:45 గంటల నుంచి 11:30 గంటల వరకు సమ్మక్క సారలమ్మ జంజతి పూజారి సమ్మేళనంలో పాల్గొంటారు. అనంతరం వర్చువల్ విధానంలో కుమురంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్ జిల్లాల్లో నూతనంగా నిర్మించిన ఏకలవ్య పాఠశాలలను రాష్ట్రపతి ప్రారంభిస్తారు.
భద్రాద్రి రాముల వారి దర్శనం తర్వాత రాష్ట్రపతి ఐటీసీ అతిథి గృహానికి చేరుకుంటారు. ఉదయం 11:40 నుంచి మధ్యాహ్నం 1:15 గంటల వరకు లంచ్ బ్రేక్ ఉంటుంది. మధ్యాహ్నం 1:15 గంటలకు 1:25 గంటలకు భద్రాచలం హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. 1:35 గంటలకు హెలికాప్టర్‌లో తిరిగి వెళ్తారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ రాష్ట్రపతితో పాటు పాటు ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటారు. భద్రాద్రి పర్యటన ముగిసిన తర్వాత రాస్ట్రపతి ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయానికి చేరుకుంటారు. రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని, ప్రసాద్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మరోవైపు ఈ నెల 30న యాదాద్రికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. ఈ పర్యటన సజావుగా సాగేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
రామప్ప ఆలయాన్ని దర్శించుకోనున్న రాష్ట్రపతి
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం మధ్యాహ్నం 3.45 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో వరంగల్‌లోని ప్రఖ్యాత రామప్ప ఆలయ సందర్శనకు ఆమె బయలుదేరుతారు. దర్శనం పూర్తయిన వెంటనే తిరిగి హైదరాబాద్ కు రాష్ట్రపతి పయనమవుతారు. బొల్లారంలోని హెలిప్యాడ్‌కు రాష్ట్రపతి సాయంత్రం 5 గంటల 15 నిమిషాలకు చేరుకుంటారు. అక్కడి నుంచి రాష్ట్రపతి నిలయానికి ద్రౌపది ముర్ము రోడ్డు మార్గంలో చేరుకుంటారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రామప్ప సందర్శనకు రానున్న నేపథ్యంలో ములుగు జిల్లా అధికార యంత్రాంగం సమాయత్తమైంది. రాష్ట్రపతి పర్యటనలో పాల్గొనే ఆఫీసర్లకు, సిబ్బందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఐటీడీఏ పీవో, ఇతర ఉన్నతాధికారులు సహా సిబ్బంది అందరికీ కొవిడ్ పరీక్షలు చేశారు.
సంబంధిత కథనం
టాపిక్