MP Venkat reddy Comments: గెలిచే పరిస్థితి లేదు - ఎంపీ వెంకట్ రెడ్డి కామెంట్స్!-mp komatireddy venkat reddy sensational comments on munugode bypoll ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Mp Venkat Reddy Comments: గెలిచే పరిస్థితి లేదు - ఎంపీ వెంకట్ రెడ్డి కామెంట్స్!

MP Venkat reddy Comments: గెలిచే పరిస్థితి లేదు - ఎంపీ వెంకట్ రెడ్డి కామెంట్స్!

HT Telugu Desk HT Telugu
Oct 22, 2022 02:05 PM IST

mp venkat reddy on munugodu results: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో తాను ప్రచారం చేసినా గెలవదంటూ చేసిన ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది.

కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతితో ఎంపీ కోమటిరెడ్డి (ఫైల్ ఫొటో)
కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతితో ఎంపీ కోమటిరెడ్డి (ఫైల్ ఫొటో) (twitter)

mp komatireddy venkat reddy sensational comments: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.... మునుగోడు ఉప ఎన్నిక నాటి నుంచి కాంగ్రెస్ పార్టీలో చర్చ అంతా ఆయన చుట్టే నడుస్తోంది. తాజాగానే ఓ ఆడియో బయటికి రావటం ఆ పార్టీలో కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు పార్టీ నేతలు... మునుగోడులో విస్తృత్తంగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.... ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న కోమటిరెడ్డి... మునుగోడు ఫలితాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న కోమటిరెడ్డితో పలువురు సన్నిహితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మునుగోడు ఉప​ ఎన్నికపై స్పందించిన ఆయన.. 'మునుగోడులో నేను ప్రచారం చేసినా కాంగ్రెస్‌ గెలవదు. నేను ప్రచారానికి వెళ్తే మహా అంటే కొన్ని ఓట్లు వస్తాయి. కాంగ్రెస్‌ పార్టీ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. వాళ్ల లాగా(టీఆర్ఎస్, బీజేపీ) మనం డబ్బులు పెట్టలేం కదా. ఇప్పటికి ఎమ్మెల్యేగా, ప్రస్తుతంగా ఎంపీగా గెలిచాను. దాదాపు 25 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నాను. ప్రస్తుత రాజకీయాల గురించి నాకు తెలుసు. అవసరమైతే రాజకీయాల నుంచి రిటైర్మెంట్‌ తీసుకుంటా' అంటూ మాట్లాడారు.

అయితే ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పలువురు రకరకాలుగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Komatireddy Venkat Reddy Audio Leak: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆడియో లీక్ కలకలం రేపిన సంగతి తెలిసందే. ప్రత్యేకంగా కాంగ్రెస్ నేతలకు ఫోన్ చేసి తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి ఓటేయ్యాలంటూ చెప్పిన మాటలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా ఏమైనా ఉంటే తాను చూసుకుంటూ చెప్పడం సంచలనంగా మారింది. నెక్స్ట్ పీసీసీ ప్రెసిండెట్ తానే అంటూ కూడా చెప్పటం... పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

ఓ వైపు మునుగోడు ఉప ఎన్నికల్లో జోరుగా ప్రచారం సాగుతున్న సమయంలో కోమటి రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో దుమారం రేపుతున్నాయి. అయితే దీనిపై ఆ పార్టీ నేతలు బహిరంగంగా ఎవరూ స్పందించలేదు. అయితే ఈ వ్యాఖ్యలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

ఇదిలా ఉండగానే...తాజాగా వీడియో బయటికి రావటం హాట్ టాపిక్ గా మారింది. అయితే దీనిపై కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఎంపీ వెంకట్ రెడ్డికి షోకాజ్ నోటీసులు పంపుతారా..? లేకపోతే ఏమైనా కీలక నిర్ణయం తీసుకుంటారా అనేది చూడాలి.

Whats_app_banner