Minister Damodara: ప్రతి దరఖాస్తు పరిశీలిస్తామన్న మంత్రి దామోదర రాజ నర్సింహ-minister damodara raja narasimha clarified that the government will consider every application ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Minister Damodara: ప్రతి దరఖాస్తు పరిశీలిస్తామన్న మంత్రి దామోదర రాజ నర్సింహ

Minister Damodara: ప్రతి దరఖాస్తు పరిశీలిస్తామన్న మంత్రి దామోదర రాజ నర్సింహ

HT Telugu Desk HT Telugu
Dec 29, 2023 09:11 AM IST

Minister Damodara: ప్రజల నుండి స్వీకరించిన ప్రతి దరఖాస్తును ప్రభుత్వం పరిశీలిస్తుందని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.

దరఖాస్తులు స్వీకరిస్తున్న మంత్రి దామోదర రాజనర్సింహ
దరఖాస్తులు స్వీకరిస్తున్న మంత్రి దామోదర రాజనర్సింహ

Minister Damodara: ప్రభుత్వ పాలనను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు ప్రతి గడపకూ సంక్షేమాన్ని అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలనీ వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.

yearly horoscope entry point

ఆందోల్ నియోజకవర్గం లో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 'ప్రజా పాలన' కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొని లబ్దిదారుల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు తమ ప్రభుత్వం ప్రజల వద్దకే వెళ్లి ప్రజా పాలన కార్యక్రమం చేపట్టి 6 గ్యారంటీ ల అమలుకు శ్రీకారం చుట్టిందన్నారు.

డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు పని దినాలలో జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలలోని ప్రతి వార్డులలో ప్రజా పాలన సదస్సులు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామనీ తెలిపారు. ప్రజల నుండి స్వీకరించిన ప్రతి దరఖాస్తును ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలిపారు.

అభయ హస్తం లో భాగంగా మహాలక్ష్మి , రైతు భరోసా, చేయూత, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు మొదలగు పథకాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని అన్నారు. ఎవరైనా లబ్ధిదారులు ఆనివార్య కారణాల వలన ఈ రోజు దరఖాస్తు ఇవ్వలేని వారు ఈ నెల 6 లోగా గ్రామ పంచాయతీ ,మున్సిపల్ కార్యాలయంలో అందజేయవచ్చునని తెలిపారు.

ప్రజా పాలన కార్యక్రమం ద్వారా ప్రజలకు 95 శాతం లబ్ది...

ఇప్పటికే ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం, ఆరోగ్య శ్రీ పరిమితి రూ.10 లక్షల పెంపు హామీని నెరవేర్చామని చెప్పారు.100 రోజుల్లో అర్హులకు 6 గ్యారంటీ లు అమలు చేస్తామన్నారు. ప్రజా పాలన కార్యక్రమాన్ని అధికారులు విజయవంతం చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ పిలుపునిచ్చారు.

ప్రజా పాలన కార్యక్రమం ద్వారా ప్రజలకు 95 శాతం లబ్ది చేకూరుతుందన్నారు. ఇంకా ఏమైనా మిగిలి ఉంటే వాటి పరిష్కారం కోసం కృషి చేస్తామని చెప్పారు. ప్రజలు నమ్మకంతో మాకు అవకాశం ఇచ్చారనీ ప్రజల కష్ట సుఖాల్లో తోడుంటామని మంత్రి అన్నారు .

ప్రభుత్వానికి ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ కుమార్, మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా లు స్థానిక ప్రజా ప్రతినిదులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Whats_app_banner