TS SSC Exams 2024 Updates : తెలంగాణ టెన్త్ విద్యార్థులకు కీలక అప్డేట్ - ఆ ప్రశ్నలకు మార్కులు కలవనున్నాయి..!
Telangana SSC Exams 2024 Updates : తెలంగాణలో పదో తరగతి పరీక్షల మూల్యాంకనం ప్రారంభమైంది. అయితే జీవశాస్త్ర ప్రశ్నపత్రంలో తప్పులు దొర్లటంతో పరీక్షలు రాసిన విద్యార్థులు అయోమంలో ఉన్నారు. ఈ విషయంలో పరీక్షల విభాగం క్లారిటీ ఇచ్చింది. 2 మార్కులు కలపాలని నిర్ణయించారు.
Telangana SSC Exams 2024: తెలంగాణలో పదో తరగతి పరీక్షలు (TS SSC Exams) ముగిసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే స్పాట్ వాల్యూయేషన్ కూడా ప్రారంభమైంది. ఏప్రిల్ 11వ తేదీతో మూల్యాంకన ప్రక్రియ((TS SSC Examinations Spot Valuation 2024) పూర్తి అయ్యేలా అధికారులు ఏర్పాట్లు కూడా చేశారు. అయితే ఈసారి జరిగిన పదో తరగతి పరీక్షల్లో…జీవశాస్త్రం(బయాలజీ) ప్రశ్నాపత్రంలో తప్పులు దొర్లాయి. ఈ విషయంలో పరీక్షలు రాసిన విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. పరీక్షలు ముగిసినప్పిటికీ… తప్పుగా వచ్చిన ప్రశ్నల విషయంలో క్లారిటీ లేకపోవటంతో గందరగోళానికి గురయ్యారు. అయితే వీటిపై SSC బోర్డు స్పందిస్తూ… కీలక నిర్ణయం తీసుకుంది. నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం…. తప్పుగా వచ్చిన ప్రశ్నలకు మార్కులు కలపాలని నిర్ణయించారు.
కలవనున్న మార్కులు…!
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం... ఏప్రిల్ 2వ తేదీతో పదో తరగతి(TS Exams Updates) పరీక్షలన్నీ పూర్తి అయ్యాయి. అయితే మార్చి 28వ తేదీన బయోలజీ ఎగ్జామ్ జరిగింది. అయితే ఇందులో 2వ సెక్షన్ లోని ఆరో క్వశ్చన్ విషయంలో తప్పులు దొర్లాయి. ఇంగ్లీష్ మాధ్యామానికి, తెలుగు మాధ్యమంలో వచ్చిన ప్రశ్న విషయంలో తేడా ఉండటంతో విద్యార్థులు స్పష్టతకు రాలేకపోయారు. ఇదే విషయాన్ని పలువురు బోర్డు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై నిపుణుల కమిటీ కూడా చర్చించి... తప్పుగా దొర్లిన ప్రశ్నల విషయంలో ఓ నివేదికను కూడా బోర్డుకు సమర్పించింది. బ్లూ ప్రింట్ విధానానికి విరుద్ధంగా ప్రశ్న ఇచ్చినట్లు కూడా తేల్చింది. ఫలితంగా ఈ రెండు ప్రశ్నలకు మార్కులు ఇవ్వాలని నిర్ణయించారు. ఫస్ట్ 2 క్వశ్చన్లను అటెంప్ట్ చేసిన విద్యార్థికి 2 మార్కులు ఇవ్వాలని నిర్ణయించారు. ఇక ఇదే రెండో విభాగంలోని... ఐదో ప్రశ్న విషయంలో అనుబంధ సమాధానాలు రాస్తే మార్కులు ఇవ్వనున్నారు. ఇవే కాకుండా... ఉర్దూ మీడియానికి సంబంధించి మ్యాథ్స్ పేపర్ లో తలెత్తిన కొన్ని తప్పులపై కూడా బోర్డు అధికారులు... ఎగ్జామినర్లకు ఆదేశాలు ఇచ్చారు.
కొనసాగుతున్న స్పాట్…
మరోవైపు తెలంగాణ పదో తరగతి జవాబు మూల్యాంకనం 11 జిల్లాల్లో నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు సిబ్బంది విధులను నిర్వహిస్తున్నారు. స్పాట్ లో పాల్గొనే సిబ్బంది…. ప్రతిరోజూ ఒక్కరు 40 జవాబు పత్రాలను దిద్దాల్సి ఉంటుంది. ఉదయం షిఫ్ట్ లో 20, సాయంత్రం సెషల్ లో 20 పూర్తి చేస్తారు. ఏప్రిల్ 11వ తేదీతో ఈ స్పాట్ ప్రక్రియ పూర్తి కానుంది. ఆ తర్వాత మార్కుల ఎంట్రీతో పాటు సాంకేతిక అంశాలను పరిశీలన చేసి… ఫలితాలను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచేలా ప్రభుత్వ పరీక్షల విభాగం చర్యలు చేపట్టనుంది. స్పాట్ విషయంలో పాటించాల్సిన నిబంధనల విషయంలో ఇప్పటికే సిబ్బందికి అవగాహన కార్యక్రమాలను పూర్తి చేశారు.
TS 10th Results 2024: తెలంగాణ టెన్త్ ఫలితాలు ఎప్పుడంటే..?
ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈసారి తెలంగాణ పదో తరగతి ఫలితాలు(Telangana SSC Exam Results) కాస్త ముందుగానే రానున్నాయి. 11వ తేదీతో స్పాట్ పూర్తి కానుండగా…. ఏప్రిల్ చివరి వారంలో ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. ఆ దిశగానే అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. గత ఏడాదితో పోల్చితే ఈసారి పరీక్షలు తొందరగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. 2023లో ఏప్రిల్ 3 నుంచి పరీక్షలు ప్రారంభం కాగా… ఏప్రిల్ 13వ తేదీ వరకు జరగాయి. ఫలితాలను మే 10వ తేదీన ప్రకటించారు. అయితే ఈసారి పరీక్షలు మార్చి 18వ తేదీనే మొదలయ్యాయి. ఏప్రిల్ 2వ తేదీతో అన్ని ఎగ్జామ్స్ పూర్తి అయ్యాయి. గతేడాది షెడ్యూల్ తో పోల్చితే… ఫలితాల ప్రకటనకు 27 రోజుల సమయం పట్టింది. ఈసారి కూడా 25 నుంచి 30 రోజుల వ్యవధిలోనే ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. దీన్ని బట్టి చూస్తే….. ఏప్రిల్ చివరి వారంలోనే పదో తరగతి ఫలితాలు(Telangana 10th Results 2024) విడుదలయ్యే అవకాశం ఉంది. ఇది కుదరకపోతే…. మే తొలి వారంలో దాదాపుగా ప్రకటించే ఛాన్స్ ఉంటుంది.
పరీక్ష రాసిన విద్యార్థులు తెలంగాణ SSC బోర్డు అధికారిక వెబ్ సైట్ https://results.bsetelangana.org/ లోకి వెళ్లాలి. లేదా https://bse.telangana.gov.in/ సైట్‌కు వెళ్లొచ్చు. ఇదే కాకుండా HT తెలుగులో కూజా టెన్త్ ఫలితాలు అందుబాటులో ఉండనున్నాయి.