IRCTC Tour Package : సౌరాష్ట్ర టూర్ ప్యాకేజీ.. ఇదిగో డిటేయిల్స్
IRCTC Saurashtra With Statue Of Unity : పర్యాటక ప్రదేశాలకు వెళ్లాలనుకునే వారి కోసం ఐఆర్‌సీటీసీ మరో ప్యాకేజీ ప్రకటించింది. గుజరాత్ లోని ముఖ్యమైన ప్రదేశాలను చూసి రావొచ్చు. సౌరాష్ట్ర విత్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పేరుతో ప్యాకేజీ అందుబాటులో ఉంది.
దేశంలోని వివిధ ప్రాంతాలను చూడాలనుకునేవారి కోసం ఐఆర్‌సీటీసీ(IRCTC) అందుబాటు ధరలు ప్రకటిస్తోంది. మరో ప్యాకేజీని తీసుకొచ్చింది. అహ్మదాబాద్(AHMEDABAD ), ద్వారక(Dwaraka), రాజ్‌కోట్, సోమనాథ్, స్టాచ్యూ ఆఫ్ యూనిటీని సందర్శించొచ్చు. గుజరాత్ లోని పవిత్రమైన పుణ్యక్షేత్రాలను దర్శించుకొవచ్చు. హైదరాబాద్(Hyderabad నుంచి ఫ్లైట్ ద్వారా ఈ టూర్ ఉంది. అక్టోబర్ 29న ప్రారంభమవుతుంది.
Day 1 : హైదరాబాద్ నుంచి బయలుదేరాలి. అహ్మదాబాద్ విమానాశ్రయం చేరుకున్నాక పికప్ చేసుకుని.. హోటల్(Hotel)కు తీసుకెళ్తారు. హోటల్‌లో అల్పాహారం పూర్తి చేసుకుని.. సబర్మతి ఆశ్రమం, అదాలజ్ స్టెప్ వెల్ సందర్శించాలి. మధ్యాహ్నం అక్షరధామ్(akshardham) ఆలయం సందర్శన ఉంటుంది. అహ్మదాబాద్‌లో రాత్రి భోజనం చేసి బస చేయాలి.
Day 2 : అల్పాహారం చేసి చెక్ అవుట్ చేయాలి. సోమనాథ్(Somnath) కి బయలుదేరాలి. సాయంత్రానికి చేరుకుంటారు. హోటల్‌కి వెళ్లాలి. సోమనాథ్ జ్యోతిర్లింగాన్ని సందర్శన ఉంటుంది. డిన్నర్ చేసి.., రాత్రిపూట సోమనాథ్‌లో బస చేస్తారు.
Day 3 : అల్పాహారం ముగించుకుని.. చెక్ అవుట్ చేయాలి. అక్కడ నుంచి ద్వారక(Dwaraka)కు బయలుదేరుతారు. మార్గమధ్యంలో మాధవపూర్ బీచ్ వద్ద ఆగుతారు. మధ్యాహ్నానికి ద్వారక చేరుకుంటారు. హోటల్‌కు వెళ్లాలి. ద్వారకాధీశ దేవాలయాన్ని సందర్శి్స్తారు. ద్వారకలోనే రాత్రి బస చేయాల్సి ఉంటుంది.
Day 4 : అల్పాహారం ముగించుకుని.. చెక్ అవుట్ చేయాల. ద్వారక సందర్శన ఉంటుంది. భోజనం చేసి.. రాజ్‌కోట్‌కు బయలుదేరాలి. అక్కడ హోటల్‌లో దిగి రాత్రి బస చేస్తారు.
Day 5 : అల్పాహారం చేసి హోటల్ నుంచి చెక్ అవుట్ చేయాలి. స్వామినార్యన్ మందిర్, డాల్స్ మ్యూజియం సందర్శన ఉంటుంది. వడోదర(vadodara)కు బయలుదేరాలి. హోటల్‌లో చెక్ ఇన్ అయి.. వడోదరలోనే రాత్రి బస చేయాలి.
Day 6 : అల్పాహారం ముగించుకుని.. లక్ష్మీ విలాస్ ప్యాలెస్(Laxmi Vilas Palace) సందర్శించాలి. స్టాట్యూ ఆఫ్ యూనిటీకి తీసుకెళ్తారు. వడోదరకి తిరిగి వెళ్లి.. రాత్రి బస చేయాలి.
Day 7 : అల్పాహారం చేసి హోటల్ నుంచి చెక్ అవుట్ చేయాలి. మధ్యాహ్నం 12 గంటలకు వడోదర విమానాశ్రయంలో డ్రాప్ చేస్తారు. అక్కడ నుంచి హైదరాబాద్ చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.
ఈ ప్యాకేజీ ధరలు చూసుకుంటే.. సింగిల్ ఆక్యూపెన్సీకి రూ.38350గా నిర్ణయించారు. డబుల్ ఆక్యూపెన్సీకి రూ.29650, ట్రిపుల్ ఆక్యూపెన్సీకి రూ. 28500 ఉంది. భోజనం, హోటల్ లాంటివి ఈ ప్యాకేజీలోనే కవర్ అవుతాయి. టూరిస్టులు తప్పకుండా ఐడీ కార్డు(ID Card)ను వెంట తీసుకెళ్లాలి. మరిన్ని వివరాల కోసం ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ ను సందర్శించండి.