IRCTC Ooty Tour 2024 : 6 రోజుల ఊటీ ట్రిప్ - బడ్జెట్ ధరలోనే హైదరాబాద్ నుంచి స్పెషల్ ప్యాకేజీ, ఇదిగో షెడ్యూల్
IRCTC Ooty Tour Package 2024: ఈ హాట్ సమ్మర్ లో ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా..? అయితే మీకోసం ఐఆర్‌సీటీసీ టూరిజం సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి ఊటీకి సూపర్ ప్యాకేజీ అందిస్తోంది. వివరాలను ఇక్కడ చూడండి……
IRCTC Hyderabad Ooty Package 2024 : సమ్మర్ వచ్చేసింది...! ఎండలు దంచికొడుతున్నాయి. ఏదైనా చల్లగా ఉండే ప్రాంతానికి వెళ్లి సేద తీరాలని చాలా మంది అనుకుంటారు. ఇందుకోసం బెస్ట్ ప్లేస్ లను సెర్చ్ చేస్తుంటారు. అందులోనూ తక్కువ ధరలో ఉండే ప్యాకేజీలను చూస్తుంటారు. అయితే ఇలాంటి వారికోసం ఐఆర్‌సీటీసీ టూరిజం(Irctc Tourism) రకరకాల ప్యాకేజీలను తీసుకువస్తోంది. తక్కువ ధరలోనే పలు ప్రాంతాలను చూపించే ప్లాన్ లను ప్రకటిస్తోంది. ఇందులో భాగంగా.... తాజాగా ఊటీకి టూర్ ప్యాకేజీని తీసుకువచ్చింది. హైదరాబాద్ నుంచి ULTIMATE OOTY EX HYDERABAD పేరుతో ఆపరేట్ చేస్తోంది. ఇందులో భాగంగా... ఊటీతో పాటు కున్నూర్ వంటి టూరిజం ప్రాంతాలను చూసి రావొచ్చు.
ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీని 09-APR 2024వ తేదీన అందుబాటులో ఉంది. ప్రతి మంగళవారం తేదీల్లో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో కూడా బుకింగ్ చేసుకోవచ్చు. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. హైదరాబాద్ నుంచి ట్రైన్ జర్నీ ఉంటుంది.
ఊటీ టూర్ షెడ్యూల్ 2024:
Day 1 : ఊటీ టూర్ ప్యాకేజీ(Ooty Tour Package)లో భాగంగా మొదటి రోజు హైదరాబాద్‌లో జర్నీ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12.20 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్ రైలు(Train No.17230) ఉంటుంది. రాత్రి అంతా జర్నీ చేయాలి.
Day 2 : రెండో రోజు ఉదయం 8 గంటలకు కొయంబత్తూర్ రైల్వే స్టేషన్(Railway Station) కు వెళ్తారు. అక్కడ నుంచి ఊటీకి తీసుకెళ్తారు. హోటల్‌లో చెకిన్ అవ్వాలి. తర్వాత బొటానికల్ గార్డెన్స్, ఊటీ లేక్ ను చూపిస్తారు. రాత్రి భోజనం చేసి ఊటీలో బస చేయాలి.
Day 3 : మూడో రోజు దొడబెట్ట పీక్, టీ మ్యూజియం(Tea Museum), పైకారా ఫాల్స్ సందర్శనకు వెళ్తారు. రాత్రికి ఊటీలో బస చేయాలి.
Day 4 : నాలుగో రోజు కూనూర్ సైట్ సీయింగ్ కు తీసుకెళ్తారు. రాత్రికి ఊటీలోనే భోజనం చేసి బస చేయాలి.
Day 5 : ఐదో రోజు ఉదయం హోటల్ నుంచి చెక్ అవుట్ చేయాలి. అక్కడ నుంచి కొయంబత్తూర్ రైల్వే స్టేషన్‌కు పర్యాటకులను తీసుకెళ్తతారు. మధ్యాహ్నం 4.35 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్ ఉంటుంది. రాత్రి మెుత్తం జర్నీ చేయాలి.
Day 6 : ఆరో రోజు మధ్యాహ్నం 12.20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.
హైదరాబాద్ - ఊటీ టూర్ ప్యాకేజీ(Ooty Tour Package) ధర చూసుకుంటే..కంఫర్డ్ క్లాస్(3A) లో సింగిల్ షేరింగ్ కు రూ. 33020ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 18480 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.14870గా ఉంది. స్టాండర్డ్ క్లాస్ లో ట్రిపుల్ షేరింగ్ కు రూ. 12410గా నిర్ణయించారు. డబుల్ షేరింగ్ కు రూ. 16020 గా ఉంది. 5 నుంచి 11 ఏళ్ల మధ్య ఉండే చిన్నారులకు వేర్వురు ధరలు ఉంటాయి.ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవుతాయి. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు