IRCTC Madhya Pradesh Tour 2024 : 5 రోజుల మధ్యప్రదేశ్ ట్రిప్ - బడ్జెట్ ధరలోనే హైదరాబాద్ నుంచి ఫ్లైట్ టూర్ ప్యాకేజీ
- IRCTC Hyderabad - Madhya Pradesh Tour: ఈ సమ్మర్ లో అధ్యాత్మిక పుణ్యకేత్రానికి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా..? అయితే హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్ మహా దర్శన్ పేరుతో ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది IRCTC టూరిజం. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి…
- IRCTC Hyderabad - Madhya Pradesh Tour: ఈ సమ్మర్ లో అధ్యాత్మిక పుణ్యకేత్రానికి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా..? అయితే హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్ మహా దర్శన్ పేరుతో ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది IRCTC టూరిజం. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి…
(1 / 7)
హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్ లోని పలు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది IRCTC టూరిజం.
(/unsplash.com/)(2 / 7)
MADHYA PRADESH MAHA DARSHAN పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ట్రైన్ జర్నీ ద్వారా సాగే ఈ టూర్ లో ఉజ్జయిని, ఓంకారేశ్వర్, భోపాల్, సాంచితో పాటు ప్రాంతాలు కవర్ అవుతాయి.
(/unsplash.com/)(3 / 7)
4 రాత్రులు, 5 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ ఏప్రిల్ 03,2024 తేదీన అందుబాటులో ఉంది
(/unsplash.com/)(4 / 7)
తొలిరోజు హైదరాబాద్ నుంచి బయల్దేరుతారు. నేరుగా ఇండోర్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి ఉజ్జయినికి వెళ్తారు. చుట్టుపక్కన ఉన్న ఆలయాలను సందర్శిస్తారు. రాత్రి ఉజ్జయినిలోనే బస చేస్తారు.
(/unsplash.com/)(5 / 7)
ఆ తర్వాత ఉజ్జయిని, ఓంకారేశ్వర్ సందర్శిస్తారు. తిరిగి ఇండోర్ కు చేరుకుని హైదరాబాద్ బయల్దేరుతారు. ఐదో రోజు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ ఎయిర్ పోర్టులో దిగుతారు.
(Photo From IRCTC Websitr)(6 / 7)
ఈ మధ్యప్రదేశ్ మహా దర్శన్ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే... సింగిల్ షేరింగ్ కు రూ. 29,400 ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 23,600ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.22,700గా ఉంది. కంఫార్ట్ క్లాస్ లో ఈ ధరలు ఉంటాయి.
(/unsplash.com/)(7 / 7)
ఇక టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, వీసా ఛార్జీలు, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. చిన్న పిల్లలకు వేర్వురు ధరలు ఉన్నాయి. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి బుకింగ్ తో పాటు పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు ఏమైనా సందేహాలు ఉంటే 8287932229 నెంబర్ ను సంప్రదించవచ్చు.
(/unsplash.com/)ఇతర గ్యాలరీలు