Insulin Racket: బిల్లులు లేకుండా ఢిల్లీ నుంచి ఇన్సులిన్… భారీ డిస్కౌంట్లతో సేల్.. డ్రగ్ కంట్రోల్ అధికారుల దాడులు
Insulin Racket: పన్నులు ఎగ్గొట్టడానికి ఎలాంటి బిల్లులు లేకుండా ఢిల్లీ నుంచి భారీగా కొనుగోలు చేస్తున్న మెడికల్ ఏజెన్సీలపై తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దాడులు చేసి లక్షల రుపాయల ఇన్సులిన్ సీజ్ చేశారు.
Insulin Racket: మధుమేహ రోగులు వినియోగించే ఇన్సులిన్‌ను అడ్డదారిలో సేకరించి భారీ డిస్కౌంట్లకు విక్రయిస్తున్న ముఠాలను తెలంగణ పోలీసులు, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు గుర్తించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో సోదాలు Raidsజరిపి అక్రమ నిల్వలను గుర్తించారు.
తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ DCA అధికారులు జరిపిన దాడుల్లో హైదరాబాద్‌లోని ఆరుగురు హోల్‌సేల్ Wholesale వ్యాపారులపై దాడులు నిర్వహించి లక్షల రుపాయల విలువైన ఇన్సులిన్ నిల్వలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఇన్సలిన్‌ను ఎలాంటి కొనుగోలు బిల్లులు లేకుండా న్యూఢిల్లీ నుండి అక్రమంగా సేకరించారు. డిసిఏ దాడుల్లో భారీ మొత్తంలో 'ఇన్సులిన్' Insulinఇంజెక్షన్లతో పాటు ప్రీ-ఫిల్డ్ పెన్నుల్ని గుర్తించారు.
ఎలాంటి బిల్లులు bills లేకుండా తక్కువ ధరలకు న్యూఢిల్లీ నుండి సేకరించిన ఇన్సులిన్ ఇంజెక్షన్‌లను హైదరాబాద్‌కు చెందిన పలువురు టోకు వ్యాపారులు 40% కంటే తగ్గింపుతో విక్రయిస్తున్నారు.
నగరంలోని రిటైల్ విక్రేతలతో నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకుని భారీగా ఈ ఔషధాలను యథేచ్ఛగా అమ్మేస్తున్నారు. రిటైల్ మార్కెట్ ధరలకంటే తగ్గింపు ధరలతో ఈ ఔషధాల విక్రయాలు జరగడంపై పక్కా సమాచారం అందడంతో సోదాలు జరిపారు. ఈ ఔషధాలు అసలైనవా కాదో నిర్ధారించాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. ఇన్సులిన్ తయారీ, నాణ్యత, ప్రామాణికతపై అధికారులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
డ్రగ్ కంట్రోల్ అధికారుల దాడుల్లో 51.92 లక్షల విలువైన ఇన్సులిన్ పట్టుబడింది. హోల్‌సేల్ వ్యాపారులు 40% కంటే ఎక్కువ రాయితీలతో మార్కెట్‌లో చలామణిలో ఉన్న ప్రముఖ బ్రాండ్ల 'ఇన్సులిన్' ఇంజెక్షన్లను సేకరించారు. ముందే ఇన్సులిన్ నింపిన పెన్నులు అధికంగా ఉన్నాయి.
వీటి గురించి డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు సేకరించిన నిఘా ఆధారంగా, మార్చి 15 నుండి మార్చి 20 వరకు హైదరాబాద్‌లోని ఆరుగురు మెడికల్ డిస్ట్రిబ్యూటర్లపై దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో ప్రముఖ ఫార్మా కంపెనీలు తయారు చేస్తున్న ఇన్సులిన్ ఉత్పత్తులను అధికారులు గుర్తించారు. ఈ ఉత్పత్తులను ఎటువంటి కొనుగోలు బిల్లులు లేకుండా న్యూఢిల్లీ నుండి హోల్‌సేల్ వ్యాపారులు కొనుగోలు చేశారు.
హోల్‌సేల్ వ్యాపారుల సేల్ బిల్లులను ధృవీకరించిన తర్వాత, వివిధ ఇన్సులిన్ సంస్థలకు చెందిన ఇంజెక్షన్‌లను ఎటువంటి బిల్లులు లేకుండా న్యూఢిల్లీ నుండి 40% కంటే ఎక్కువ తగ్గింపుతో అందిస్తున్నట్లు గుర్తించారు.
రూ. . 5263/- MRP కలిగిన ఉత్పత్తిని మార్కెట్లో రూ. 2070/కు టోకు వ్యాపారి ద్వారా అందిస్తున్నారు. ఇది చాలా అసాధారణమైన విషయమని, ఈ ఔషధాల ప్రామాణికతపై అనుమానాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
విచారణలో భగవతి ఫార్మా, పివిటి ద్వారా బిల్లులు లేకుండా ఇన్సులిన్ ఇంజెక్షన్ల నిల్వలను అక్రమంగా సరఫరా చేసినట్లు హోల్‌సేల్ వ్యాపారులు వెల్లడించారు. దీంతో సరఫరా చేసిన సంస్థలపై కూడా కేసులు నమోదు చేశారు. ఈ ప్రత్యేక దాడుల్లో డీసీఏ అధికారులు రూ. 51.92 లక్షల విలువైన ఇన్సులిన్ సీజ్ చేశారు.
దాడుల్లో పట్టుబడిన ఇన్సులిన్ తయారీ, నాణ్యతపై పరీక్షలు జరుపనున్నారు. డిస్కౌంట్లకు ఆశపడి నకిలీ ఔషధాలను కొనుగోలు చేయొద్దని, మందుల ప్రామాణికత నిర్ధారించుకోవాని, ఈ విషయంలో వైద్యులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.