Bhadradri Talambralu Booking : రాములోరి భక్తులకు టీఎస్ఆర్టీసీ(TSRTC) శుభవార్త చెప్పింది. శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలం(Bhadrachalam)లో జరిగే సీతారాముల కల్యాణోత్సవానికి(Sitaramulu Kalyanam) సంబంధించిన తలంబ్రాలను భక్తులకు అందజేయాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) యాజమాన్యం నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. భద్రాచలంలో ఈ నెల 17న శ్రీరామ నవమి సందర్భంగా జరిగే సీతారామ చంద్రుల వారి కల్యాణ తలంబ్రాలను ఆన్లైన్లో బుకింగ్(Talambralu Online Booking) చేసుకునే సదుపాయాన్ని ఆర్టీసీ కల్పించిందని తెలిపారు. టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్ విభాగం వెబ్ సైట్ https://www.tsrtclogistics.in/TSRTC/ ను సందర్శించి.....విశిష్టమైన రాములోరి కల్యాణ తలంబ్రాలు బుక్ చేసుకోవాలని ఆయన సూచించారు. ఆఫ్ లైన్ లో తలంబ్రాలు బుక్ చేసుకునేందుకు టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్ నెంబర్లైన 040-23450033, 040-690000, 040-694400669 నంబర్లను సంప్రదించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కోరారు.
టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ (TSRTC Logistics)వెబ్ సైట్ లో కల్యాణ తలంబ్రాలు బుకింగ్ అందుబాటులో ఉంచారు. అధికారిక సైట్ https://www.tsrtclogistics.in/TSRTC/ లో తలంబ్రాలు బుకింగ్(Bhadradri Talambralu Booking) అనే ఆప్షన్ ఉంటుంది. తర్వాత పేజీలో మీ అడ్రస్, ఇతర వివరాలను పొందుపరిచాలి. తర్వాత తలంబ్రాలు ప్యాకెట్లు ఎన్ని కావాలో ఎంచుకోవాలి. ఒక్కో తలంబ్రాలు ప్యాకెట్ ధర రూ.151 లుగా యాజమాన్యం నిర్ణయించింది. అన్ని వివరాలను పూర్తి చేసిన తర్వాత ఆన్లైన్ పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. యూపీఐ ద్వారా కూడా పేమెంట్ చేయవచ్చు. పేమెంట్ సక్సెస్ అయిన తరువాత మీ బుకింగ్ విజయవంతం అయినట్టుగా మీకు ట్రాన్సక్షన్ నెంబరుతో పాటు ఆర్టీసీ నుంచి ఎస్ఎమ్ఎస్ వస్తుంది. మీరు ఇచ్చిన అడ్రెస్ కు రాములోరి కల్యాణ తలంబ్రాలు వస్తాయి.
భద్రాద్రిలో ఈ నెల 17న అంగరంగ వైభవంగా జరిగే శ్రీరామనవమి వేడుకలకు(Bhadradri Srirama Navami) వెళ్లలేని భక్తులు తలంబ్రాలు పొందాలంటే టీఎస్ఆర్టీసీ(TSRTC) లాజిస్టిక్స్ సెంటర్ల వద్ద బుక్ చేసుకోవచ్చు. రాష్ట్రంలోని అన్ని టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్(TSRTC Logistics) కౌంటర్లలో తలంబ్రాలను(Bhadradri Talambralu) బుక్ చేసుకోవచ్చని సజ్జనార్ చెప్పారు. టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్(TSRTC Logistics) కేంద్రాల్లో రూ.151 చెల్లించి వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. సీతారామచంద్రుల కల్యాణోత్సవం అనంతరం ఈ తలంబ్రాలను భక్తులకు టీఎస్‌ఆర్టీసీ హోం డెలివరీ చేస్తుంది. టీఎస్ఆర్టీసీ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లు కూడా భక్తుల వద్ద నేరుగా ఆర్డర్లను స్వీకరిస్తారని తెలిపారు. తలంబ్రాల సేవను పొందాలనుకునే భక్తులు టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్ నంబర్లైన 040-23450033, 040-69440000, 040-69440069ను సంప్రదించాలని సజ్జనార్ సూచించారు.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా
సంబంధిత కథనం