TG New Medical Colleges : తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్, కొత్తగా నాలుగు మెడికల్ కాలేజీలకు ఎన్ఎంసీ అనుమతి-hyderabad nmc green signal to four new medical colleges at medak yadadri others ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg New Medical Colleges : తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్, కొత్తగా నాలుగు మెడికల్ కాలేజీలకు ఎన్ఎంసీ అనుమతి

TG New Medical Colleges : తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్, కొత్తగా నాలుగు మెడికల్ కాలేజీలకు ఎన్ఎంసీ అనుమతి

Bandaru Satyaprasad HT Telugu
Sep 10, 2024 10:17 PM IST

TG New Medical Colleges : తెలంగాణలో కొత్తగా నాలుగు మెడికల్ కాలేజీలకు ఎన్ఎంసీ అనుమతి ఇచ్చింది. దీంతో 200 మెడికల్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. మెదక్, యాదాద్రి, మహేశ్వరం, కుత్బుల్లాపూర్ లోని కాలేజీలకు అనుమతి ఇచ్చింది.

తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్, కొత్తగా నాలుగు మెడికల్ కాలేజీలకు అనుమతి
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్, కొత్తగా నాలుగు మెడికల్ కాలేజీలకు అనుమతి

TG New Medical Colleges : తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది, కొత్తగా నాలుగు మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) అనుమతి ఇచ్చింది. మెదక్, యాదాద్రి , మహేశ్వరం, కుత్బుల్లాపూర్ కాలేజీలకు ఎన్ఎంసీ అనుమతి లభించింది. ఒక్కో కాలేజీకి 50 సీట్లు కేటాయించింది. దీంతో మొత్తం 200 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. దీంతో ఈ ఏడాది కొత్తగా 8 మెడికల్ కాలేజీలకు కేంద్రం అనుమతి ఇచ్చింది.

మరో 4 మెడికల్‌ కాలేజీలకు గ్రీన్ సిగ్నల్

యాదాద్రి, మెదక్, మహేశ్వరం, కుత్బుల్లాపూర్ మెడికల్ కాలేజీలకు కేంద్ర ఆరోగ్యశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ దరఖాస్తు చేసిన 4 కాలేజీలకు పర్మిషన్ ఇవ్వాలని నేషనల్ మెడికల్ కమిషన్‌ను ఆదేశించింది. ఇదే విషయాన్ని తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం లేఖ పంపించింది. ఒక్కో కాలేజీలో‌ 50 ఎంబీబీఎస్ సీట్ల చొప్పున, మొత్తం 200 సీట్లు ఈ కాలేజీల్లో అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే ములుగు, నర్సంపేట్, గద్వాల్, నారాయణపేట్ మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కమిషన్ అనుమతి ఇచ్చింది. మొత్తం 8 కాలేజీల్లో కలిపి 400 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రభుత్వ కాలేజీల్లోని మొత్తం సీట్ల సంఖ్య 4090కి పెరిగింది.

ఈ ఏడాది మొత్తం 8 కాలేజీలకు ప్రభుత్వం దరఖాస్తు చేసింది. జూన్‌లో ఈ కాలేజీల పరిశీలనకు వచ్చిన ఎన్‌ఎంసీ అధికారులు, ఇక్కడ కాలేజీల ఏర్పాటుకు అవసరమైన సౌకర్యాలు లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. టీచింగ్ స్టాఫ్, సౌకర్యాలు లేకుండా అనుమతులు ఇవ్వలేమన్నారు‌. అధికారులు ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకురావడంతో, అవసరమైన నిధులను కొత్త సర్కార్ కేటాయించింది. ఎన్‌ఎంసీ లేవనెత్తిన లోపాలను సవరించి ఫస్ట్ అప్పీల్‌కు వెళ్లింది. ఈ అప్పీల్ తర్వాత ములుగు, నర్సంపేట్, గద్వాల్, నారాయణపేట్ కాలేజీలకు పర్మిషన్ ఇచ్చిన ఎన్‌ఎంసీ, మిగిలిన 4 కాలేజీలకు పర్మిషన్ ఇవ్వలేదు.

ఈ కాలేజీల అనుమతులపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహా రెగ్యులర్‌గా మానిటర్ చేసి, యాదాద్రి, మెదక్, మహేశ్వరం, కుత్బుల్లాపూర్ కాలేజీలకు స్టాఫ్‌ను నియమించారు. ఇటీవల జరిగిన జనరల్ ట్రాన్స్‌ఫర్లలో తొలుత ఆ 4 కాలేజీల్లోని ఖాళీలను నింపిన తర్వాతే, మిగిలిన కాలేజీల్లోకి స్టాఫ్‌ను బదిలీ చేశారు‌. ప్రొఫెసర్ల కొరతను అధిగమించేందుకు ఎలిజిబిలిటీ ఉన్న వారికి ప్రమోషన్లు ఇప్పించారు. కాలేజీ, హాస్పిట‌ల్‌లో ఉండాల్సిన లాబొరేటరీ, డయాగ్నస్టిక్స్ ఎక్వి‌ప్‌మెంట్ కొనుగోలు చేసేందుకు నిధులు కేటాయించారు. ఇలా ఎన్‌ఎంసీ లేవనెత్తిన అన్ని లోపాలను సవరించి కేంద్ర ఆరోగ్యశాఖకు సెకండ్ అప్పీల్‌ చేశారు.

దిల్లీకి వెళ్లి ఎన్ఎంసీ అధికారులతో చర్చలు

సీఎం రేవంత్ రెడ్డి, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహా ఆదేశాలతో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తూ, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, డాక్టర్ వాణి, ఇతర ఆఫీసర్లు, డాక్టర్ల బృందం దిల్లీకి వెళ్లి కేంద్ర ఆరోగ్యశాఖ, ఎన్‌ఎంసీ అధికారులను కలిశారు. కాలేజీల ఏర్పాటుకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామని, ఇంకేమైనా అవసరం ఉంటే అవి కూడా సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వివరించారు. ఈ నేపథ్యంలోనే మొత్తం అన్ని కాలేజీలకు అనుమతులు ఇవ్వాలని కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయించింది. లెటర్ ఆఫ్ పర్మిషన్ జారీ‌చేయాలని ఎన్‌ఎంసీని ఆదేశించింది.

కాలేజీలకు అనుమతులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి, సకాలంలో‌ అవసరమైన నిధులు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డికి ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా కృతజ్ఞతలు తెలిపారు. మెడికల్‌ ఎడ్యుకేషన్ డైరెక్టర్, డాక్టర్ వాణి, అడిషనల్‌ డీఎంఈ విమలా థామస్, ఇతర ఉన్నతాధికారులను మంత్రి అభినందించారు. సర్కార్ దవాఖాన్లు, కాలేజీల‌ విషయంలో ప్రభుత్వం కమిట్‌మెంట్, చిత్తశుద్ధితో ఉందని మంత్రి మరోసారి స్పష్టం చేశారు‌.

Whats_app_banner

సంబంధిత కథనం