Visakha DSNLU Jobs 2024 : దామోదరం సంజీవయ్య నేషనల్ లా వర్శిటీలో ఉద్యోగాలు - ముఖ్య తేదీలివే-visakhapatnam damodaram sanjivayya national law university issued job notification for various posts 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Visakha Dsnlu Jobs 2024 : దామోదరం సంజీవయ్య నేషనల్ లా వర్శిటీలో ఉద్యోగాలు - ముఖ్య తేదీలివే

Visakha DSNLU Jobs 2024 : దామోదరం సంజీవయ్య నేషనల్ లా వర్శిటీలో ఉద్యోగాలు - ముఖ్య తేదీలివే

Damodaram Sanjivayya National Law University : పలు పోస్టుల భర్తీకి విశాఖలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్శిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తులకు జూలై 1వ తేదీని తుది గడువుగా ప్రకటించారు.

దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్శిటీలో ఉద్యోగాలు

Damodaram Sanjivayya National Law University Jobs 2024 : విశాఖలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్శిటీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని ఓ ప్రకటనలో కోరింది. దరఖాస్తులకు జూలై 1వ తేదీని తుది గడువుగా ప్రకటించింది. www.dsnlu.ac వెబ్ సైట్ నుంచి దరఖాస్తు ఫారమ్ ను డౌన్లోడ్ చేసుకోని ఆఫ్ లైన్ సమర్పించాల్సి ఉంటుంది.

ముఖ్య వివరాలు :

  • ఉద్యోగ ప్రకటన - దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్శిటీ, విశాఖ.
  • ఉద్యోగాలు - నాన్ టీచింగ్, టీచింగ్
  • ఖాళీల వివరాలు - ప్రొఫెసర్లు, అసిసోయేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, టీచింగ్ అసోసియేట్స్, రిసెర్చ్ అసిస్టెంట్స్, అకౌంట్ ఆఫీసర్, పర్సనల్ సెక్రెటరీ, అసిస్టెంట్ రిజిస్ట్రార్
  • అర్హతలు - డిగ్రీ, పీజీ, పీహెచ్డీ అర్హతో పాటు పని చేసిన అనుభవం ఉండాలి. నోటిఫికేషన్ లో పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
  • దరఖాస్తు ఫారమ్ - రూ. 2 వేలు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ. 1000గా నిర్ణయించారు.
  • దరఖాస్తు ఫారమ్ ను https://dsnlu.ac.in/ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి.
  • పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్ ను ‘Registrar, Damodaram Sanjivayya National Law University, “NYAYAPRASTHA”, Sabbavaram, Visakhapatnam 531 035 (A.P) అడ్రస్ కు పంపాలి.
  • అధికారిక వెబ్ సైట్ - https://dsnlu.ac.in/notifications/ 

డిఫెన్స్‌ ల్యాబొరేటరీస్‌ స్కూల్‌లో టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలు…

DLS RCI Hyderabad Recruitment 2024: హైదరాబాద్‌లోని డిఫెన్స్ ల్యాబొరేటరీస్ స్కూల్, ఆర్‌సీఐ ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా 15 ఉద్యోగాలను భర్తీ చేయనుంది.అడ్‌హక్‌ ప్రాతిపదికన భర్తీ ఈ ఉద్యోగాల్లో టీచింగ్, నాన్ - టీచింగ్ కొలవులు ఉన్నాయి. దరఖాస్తులకు జూన్ 10వ తేదీని తుది గడువుగా ప్రకటించారు. ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ముఖ్య వివరాలు..

ఉద్యోగ నోటిఫికేషన్ - డిఫెన్స్ ల్యాబొరేటరీస్ స్కూల్, ఆర్‌సీఐ, హైదరాబాద్.

మొత్తం ఖాళీలు - 15

ఖాళీల వివరాలు - ప్రైమరీ టీచర్: 05 పోస్టులు

ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (టీజీటీ): 05 పోస్టులు

ల్యాబ్‌ ఇన్‌ఛార్జ్‌ (ఏటీఎల్‌ ల్యాబ్‌ ఇన్‌చార్జ్‌): 01 పోస్టు

ఏఐ టీచర్‌ (టీజీటీ): 01 పోస్టు

ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ టీచర్‌: 02 పోస్టులు

అడ్మినిస్ట్రేషన్‌ స్టాఫ్‌: 01 పోస్టు

వయోపరిమితి : పోస్టును అనుసరించి వయోపరిమితి వివరాలను పేర్కొన్నారు.

అర్హతలు - పోస్టును అనుసరించి డిప్లొమా, ఇంటర్మీడియట్‌, డిగ్రీ, పీజీ, డీఈడీ, బీఈడీ ఉండాలి. టీచింగ్ పోస్టులకు టెట్‌, సీటెట్‌ ఉత్తీర్ణత తప్పనిసరి. పని అనుభవం కూడా ఉండాలి.

దరఖాస్తులు - ఆన్ లైన్ లో ఫామ్ ను డౌన్లోడ్ చేసుకోని ఆఫ్ లైన్ లో సమర్పించాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 10.06.2024.

దరఖాస్తు ఫారమ్ డౌన్లోడ్ లింక్ - https://www.dlsrci.in/media/docs/TeachersRecruitmentRegistrationForm.pd

అప్లికేషన్లు పంపాల్సిన చిరునామా - DEFENCE LABORATORIES' SCHOOL, VIGNYANAKANCHA, RCI, HYDERABAD - 500069.

ఈమెయిల్- DLSRCI.RECRUITMENT@GMAIL.COM