CM Revanth Reddy IE Powerful List : అత్యంత శక్తివంతమైన 100 మంది భారతీయుల జాబితాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) 39వ స్థానంలో నిలిచారు. ది ఇండియన్ ఎక్స్ ప్రెస్ ప్రచురించిన జాబితాలో (Most Powerful Persons List)ప్రధాని మోదీ(PM Modi) మొదటి స్థానంలో ఉండగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రెండో స్థానంలో నిలిచారు. మూడో స్థానంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఉన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 39వ స్థానంలో ఉండగా, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి 56వ స్థానం దక్కించుకున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ 16వ స్థానంలో, సోనియా గాంధీ 29, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే 36, ప్రియాంక గాంధీ 62వ స్థానంలో నిలిచారు. భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ 38వ స్థానం దక్కించుకున్నారు. ఈ జాబితాలో సినీ ప్రముఖులు, క్రీడాకారులు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, న్యాయమూర్తులు ఇతర రంగాల ప్రముఖులు ఉన్నారు.
సంబంధిత కథనం