HYD Metro Timings : గమనిక.. అక్టోబర్ 10 నుంచే రాత్రి 11 వరకూ మెట్రో-hyderabad metro last service 11 pm from october 10 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyd Metro Timings : గమనిక.. అక్టోబర్ 10 నుంచే రాత్రి 11 వరకూ మెట్రో

HYD Metro Timings : గమనిక.. అక్టోబర్ 10 నుంచే రాత్రి 11 వరకూ మెట్రో

HT Telugu Desk HT Telugu
Oct 09, 2022 03:31 PM IST

Hyderabad Metro Last Service : హైదరాబాద్ మెట్రో రైల్ సేవలు అక్టోబర్ 10 నుంచి పొడిగిస్తున్నారు. చివరి సర్వీస్ రాత్రి 11 గంటలకు బయలుదేరుతుంది. ప్రస్తుతం, చివరి సర్వీస్ రాత్రి 10.45 గంటలకు నడుస్తోంది.

<p>హైదరాబాద్ మెట్రో&nbsp;</p>
హైదరాబాద్ మెట్రో (HT)

మెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త. సోమవారం (అక్టోబర్ 10) నుంచి రాత్రి 11 గంటల వరకు మెట్రోలో ప్రయాణం చేయవచ్చు. ప్రస్తుతం రాత్రి 10.15 గంటల వరకే టర్మినల్‌ సేషన్ల నుంచి చివరి మెట్రో(Metro) నడిచేది. అక్టోబర్ 10 నుంచి ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు రాత్రి సమయాల్లో మెట్రో టైమింగ్స్ మారాయి. చివరి మెట్రో రైలు(Metro Rail) రాత్రి 11 గంటలకు బయల్దేరుతుంది. ఉదయం 6 గంటల నుంచి మెట్రో సేవలు షురూ అవుతాయి.

'10 అక్టోబర్ 2022 (సోమవారం) నుండి హైదరాబాద్ మెట్రో రైలు సర్వీస్ వేళలను పొడిగిస్తున్నట్లు ప్రకటించడం సంతోషంగా ఉంది. రోజువారీ సర్వీసులను సాధారణ ఉదయం 6 గంటలకు ప్రారంభిస్తూ, సంబంధిత టెర్మినల్ స్టేషన్ల నుండి చివరి రైలు రాత్రి 11 గంటలకు బయలుదేరుతుంది.' HMRL మేనేజింగ్ డైరెక్టర్ NVS రెడ్డి ట్విట్టర్‌లో అన్నారు.

పొడిగించిన వ్యవధిలో రైళ్లు 10 నిమిషాల ఫ్రీక్వెన్సీతో నడుస్తాయని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. పీక్ అవర్ సర్వీసులను పెంచామని, వాంఛనీయ స్థాయిలో నడుపుతున్నామని చెప్పారు. మొత్తం నెట్‌వర్క్‌లో రోజుకు 1,050 రైలు ట్రిప్పులు ఉన్నాయన్నారు. పొడిగించిన వ్యవధితో ఇది 1075కి పెరుగుతుందని చెప్పారు.

కొవిడ్ 19(Covid 19) తర్వాత.. ఉద్యోగులను కార్యాలయాలకు తిరిగి రావాలని కోరినప్పటి నుంచి మెట్రో సేవలు గణనీయంగా వినియోగించుకుంటున్నారని అధికారులు తెలిపారు. ఇది రైళ్ల ఫ్రీక్వెన్సీని పెంచాలనే డిమాండ్‌కు దారితీసిందని అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) రైల్ క్రమంగా పుంజుకుంటోందన్నారు. గత కొన్ని నెలల్లో హెచ్‌ఎంఆర్‌ఎల్‌లో రోజూ 3 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారన్నారు. ఉదయం, సాయంత్రం కార్యాలయ వేళల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు.

ప్రయాణికులు.. కొవిడ్-19కి ముందు స్థాయికి చేరుకోవడంతో, రద్దీ పెరిగింది. ప్రయాణికులు మరిన్ని కోచ్‌లను జోడించాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ మెట్రో రైలు(Hyderabad Metro Rail)కు కనీసం రద్దీ సమయాల్లో కోచ్‌లను జోడించాల్సిన సమయం ఆసన్నమైందని ఓ మెట్రో ప్రయాణికుడు అన్నారు.

Whats_app_banner