Gaddar Final Rites : ప్రజాకవికి కన్నీటి వీడ్కోలు, ముగిసిన గద్దర్ అంత్యక్రియలు-hyderabad folk singer gaddar final rites completed ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Gaddar Final Rites : ప్రజాకవికి కన్నీటి వీడ్కోలు, ముగిసిన గద్దర్ అంత్యక్రియలు

Gaddar Final Rites : ప్రజాకవికి కన్నీటి వీడ్కోలు, ముగిసిన గద్దర్ అంత్యక్రియలు

Bandaru Satyaprasad HT Telugu
Aug 07, 2023 08:42 PM IST

Gaddar Final Rites : ప్రజాకవి గద్దర్ అంత్యక్రియలు ముగిశాయి. సోమవారం రాత్రి హైదరాబాద్ లోని మహోబోధి విద్యాలయం గ్రౌండ్ లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి.

గద్దర్ అంత్యక్రియలు
గద్దర్ అంత్యక్రియలు

Gaddar Final Rites : ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధనౌక గద్దర్ (77) గద్దర్ అంత్యక్రియలు సోమవారం రాత్రి ముగిశాయి. అనారోగ్యంతో ఆదివారం సాయంత్రం గద్దర్ తుదిశ్వాస విడిచారు. అనంతరం ప్రజల సందర్శనార్థం గద్దర్ భౌతికకాయాన్ని ఎల్బీ స్టేడియంలో ఉంచారు. సోమవారం మధ్యాహ్నం గద్దర్ భౌతికకాయాన్ని అంతిమ యాత్రగా అల్వాల్‌లోని ఆయన ఇంటికి తీసుకెళ్లారు. అల్వాల్ గద్దర్ పార్థివ దేహానికి సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. ఆ తర్వాత మహాబోధి విద్యాలయం గ్రౌండ్‌లో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు ముగిశాయి. ఈ అంతిమ యాత్రకు భారీ సంఖ్యలో ఆయన అభిమానులు, ఉద్యమకారులు, కళాకారులు, వివిధ పార్టీల నేతలు తరలివచ్చారు. చివరిసారిగా గద్దర్‌ను చూసి ఆయన అభిమానులు ఆవేదన చెందారు. విప్లవ వాగ్గేయకారుడు గద్దర్‌‌ అంత్యక్రియలు బౌద్ధ మతపద్ధతిలో నిర్వహించారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు ముగిశాయి. గద్దర్ చివరి కోరిక మేరకు అల్వాల్‌‌లోని మహాబోధి విద్యాలయం గ్రౌండ్‌లో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేశారు. గద్దర్ అంత్యక్రియలకు అభిమానులు, కవులు, కళాకారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అయితే మహాబోధి స్కూల్‌లోకి ఎక్కువ మంది వెళ్లడానికి అవకాశం లేకపోయింది. స్థలం సరిపోదని పోలీసులు చెప్పినా వినకపోవడంతో వారిని అదుపుచేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది. పోలీసుల తీరుపై గద్దర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

గద్దర్ అంత్యక్రియల్లో విషాదం

ప్రజాగాయకుడు గద్దర్ అంత్యక్రియల్లో విషాద ఘటన చోటుచేసుకుంది. మహాబోధి విద్యాలయం వద్ద జరిగిన తోపులాటలో సియాసత్ ఉర్దూ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్ మృతి చెందారు. గద్దర్ అంత్యక్రియలకు జనం పెద్ద సంఖ్యలో రావడంతో తోపులాట జరిగింది. ఈ తోపులాటలో కిందపడిపోయిన అలీ ఖన్ కు గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోంది. ఆయనను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. అలీ ఖాన్ గద్దర్‌కు సన్నిహితుడుగా ఉండేవారని సమాచారం. అల్వాల్ లోని గద్దర్ ఇంటి వద్ద జహీరుద్దీన్ అలీఖాన్ కు గుండెపోటు వచ్చి కింద పడిపోయినట్లు తెలుస్తోంది. ఆయనను స్థానికులు పక్కనే ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆయన చనిపోయినట్లుగా వైద్యులు వెల్లడించినట్లుగా సమాచారం. మహాబోధి విద్యాలయంలో వెనుక ఉన్న గ్రౌండ్ లో గద్దర్ అంత్యక్రియలు నిర్వహించారు. మహాబోధి ప్రాంగణంలోకి వెళ్లేందుకు జనం గేటు ఎక్కే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు వారిని కట్టడి చేశారు. దీంతో మహాబోధి విద్యాలయంలో ముందు ఉద్రిక్తత నెలకోంది. గేటు లోపలికి వెళ్లేందుకు జనం ప్రయత్నించగా తోపులాట చోటుచేసుకుంది.

Whats_app_banner