Hyderabad : హైదరాబాద్ భారతదేశానికి సైన్స్ రాజధానిగా ఎలా అభివృద్ధి చెందుతోంది?
Hyderabad : హైదరాబాద్ భారతదేశానికి సైన్స్ రాజధానిగా అభివృద్ధి చెందుతోంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ చారిత్రక నేపథ్యం.. విద్యా సంస్థలు, పరిశోధన సంస్థలు ఇక్కడ నెలకొల్పడంతో.. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో భాగ్యనగరం దూసుకుపోతోంది.
హైదరాబాద్ భారతదేశంలోని ప్రముఖ సైన్స్ అండ్ టెక్నాలజీ కేంద్రాల్లో ఒకటి. ఇక్కడ వివిధ రంగాల్లో విస్తృతమైన శాస్త్రీయ పరిశోధనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ, ఐటీ, సాఫ్ట్‌వేర్, జీవశాస్త్రం, వైద్య శాస్త్రం, నానోటెక్నాలజీ, శక్తి, పర్యావరణం రంగాల్లో అనేక పరిశోధనలు జరుగుతున్నాయి.
చారిత్రక నేపథ్యం..
చార్మినార్ నిర్మాణం ద్వారా హైదరాబాద్ శాస్త్రీయ ఆసక్తిని 1591 నుండే ప్రదర్శించింది. డిజైన్, ఇంజనీరింగ్, మెటీరియల్ సైన్స్ వంటి విభాగాల్లో చార్మినార్ ఒక అద్భుతమైన ఉదాహరణ.
నిజామియా అబ్జర్వేటరీ..
ప్రపంచంలోనే అరుదైన ఖగోళ పరిశోధన సంస్థ ఇక్కడ ఉండటం.. హైదరాబాద్ శాస్త్రీయ వారసత్వానికి నిదర్శనం. హైదరాబాద్ భారతదేశంలో విలీనం అవ్వడానికి ముందే ఇక్కడ రీసెర్చ్ సెంటర్లు ఉన్నాయి. సెంట్రల్ ల్యాబరేటరీస్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ వంటి సంస్థలు.. హైదరాబాద్‌లో పరిశోధన రంగాన్ని ప్రోత్సహించాయి.
ఆధునిక కాలంలో..
రీజినల్ రీసెర్చ్ ల్యాబరేటరీని స్థాపించడం.. ఫార్మా రంగంలో హైదరాబాద్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ హైదరాబాద్‌లో ఉండటం కూడా దీనికి కారణం. ఇక ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) ఏర్పాటు సాఫ్ట్‌వేర్, ఐటీ విప్లవానికి నాంది పలికింది.
అనేక ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలను హైదరాబాద్‌లో స్థాపించారు. ఇవి మానవ వనరుల అభివృద్ధికి దోహదపడ్డాయి. ఇదే సమయంలో.. ప్రభుత్వాల నుంచి మంచి ప్రోత్సాహం లభించింది. ముఖ్యంగా తెలంగాణ ఏర్పడ్డాక.. ప్రభుత్వం సైన్స్, సాంకేతిక రంగాల అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టింది.
దేశంలోని వివిధ ప్రాంతాల రవాణా సౌకర్యాలు ఉండటం వల్ల హైదరాబాద్‌లో అనేక కంపెనీలను స్థాపించారు. అనేక విద్యాసంస్థలు ఉండటం వల్ల మానవ వనరులు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌లో సైన్స్, సాంకేతిక రంగాల అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం ఇతర నగరాల కంటే ఎక్కువ ఉంటోంది. అత్యాధునిక మౌలిక సదుపాయాలు ఉండటం వల్ల అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ తమ కార్యకలాపాలను నిర్వహించడానికి ఇష్టపడుతున్నాయి.
ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ..
హైదరాబాద్ ఇండియాస్ ఫార్మా సిటీగా పేరుగాంచింది. ఇక్కడ ఔషధాల అభివృద్ధి, జన్యు ఇంజనీరింగ్, బయో ఇన్ఫర్మాటిక్స్ వంటి రంగాలలో ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, సెంటర్ ఫర్ సెల్ అండ్ మాలిక్యులర్ బయాలజీ వంటి సంస్థలు ఈ రంగంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి.
ఐటీ, సాఫ్ట్‌వేర్..
హైదరాబాద్ ఐటీ హబ్‌గా గుర్తింపు పొందింది. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాలలో విస్తృతమైన పరిశోధనలు జరుగుతున్నాయి.
జీవశాస్త్రం, వైద్య శాస్త్రం..
జీవశాస్త్రం, వైద్య శాస్త్ర రంగాలలో కూడా హైదరాబాద్ ముందు వరుసలో ఉంది. ఇక్కడ కొత్త వ్యాధులకు చికిత్సలు కనుగొనడం, జన్యు వైకల్యాలకు పరిష్కారాలు కనుగొనడం వంటి పరిశోధనలు జరుగుతున్నాయి.
నానోటెక్నాలజీ..
నానో పరిమాణంలో పదార్థాలను ఉపయోగించి కొత్త ఉత్పత్తులు, పరిష్కారాలను అభివృద్ధి చేయడంపై హైదరాబాద్‌లో పరిశోధనలు జరుగుతున్నాయి. శక్తి, పర్యావరణం రంగంలోనూ పరిశోధనలు జరుగుతున్నాయి. పునరుత్పాదక శక్తి వనరులు, పర్యావరణ పరిరక్షణ, శుద్ధి చేసిన నీరు వంటి రంగాలలోనూ పరిశోధనలు జరుగుతున్నాయి.
ఇలా దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్‌లో ఎన్నో రంగాల్లో పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ కారణాలతో.. హైదరాబాద్ భారతదేశానికి సైన్స్ రాజధానిగా ఎలా అభివృద్ధి చెందుతోంది. భవిష్యత్తులోనూ పలు రంగాల్లో హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.