తెలుగు న్యూస్ / ఫోటో /
Jaipal Reddy Statue Inauguration: గల్లీ నుంచి ఢిల్లీకి ఎదిగిన నేత జైపాల్ రెడ్డి
- jaipal reddy statue Inaugurated at madgul: రంగారెడ్డి జిల్లా మాడ్గుల గ్రామంలో కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ జైపాల్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.
- jaipal reddy statue Inaugurated at madgul: రంగారెడ్డి జిల్లా మాడ్గుల గ్రామంలో కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ జైపాల్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.
(1 / 4)
కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ జైపాల్ రెడ్డి విగ్రహాన్ని ఆయన స్వగ్రామం అయిన మాడ్గులలో ఆవిష్కరించారు.(twitter)
(2 / 4)
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆర్.సుభాష్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వైసీపీ రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య, మాజీ ఎంపీ మందా జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. ఏ సిద్ధాంతాల ఆధారంగా జైపాల్ రెడ్డి రాజకీయాలు చేశారో.. అవి ఇప్పటి రాజకీయాల్లో లోపించాయన్నారు సీతారాం ఏచూరి. చివరి వరకు విలువలకు కట్టుబడి పనిచేసిన నాయకుడు జైపాల్ రెడ్డి అని.. ఆయన లేకపోవడం దేశానికి తీరని లోటని వ్యాఖ్యానించారు.(twitter)
(3 / 4)
ఐదు దశాబ్ధాలుగాకు పైగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న నేతగా జైపాల్ రెడ్డికి పేరుంది. ఉత్తమ పార్లమెంటీరియన్ కూడా ఆయనకు లభించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. హైకమాండ్ ను ఒప్పించటంలో కీలకంగా వ్యవహరించారు.(HT)
(4 / 4)
సుదీర్ఘ కాలంపాటు ప్రజాజీవితంలో రాణించిన నేత జైపాల్ రెడ్డి అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. మచ్చలేని రాజకీయ నేతగా పేరున్న ఆయన్ను.. గౌరవించుకోవటం మన అందరి బాధ్యత అని చెప్పారు. గల్లీ నుంచి ఢిల్లీకి ఎదిగిన నేతగా జైపాల్ రెడ్డికి పేరుందని వ్యాఖ్యానించారు. ఆయన కృషి వల్లే మహబూబ్ నగర్ జిల్లాలోని పలు ప్రాంతాలకు కృష్ణా జలాలు వచ్చాయని కొనియాడారు.(twitter)
ఇతర గ్యాలరీలు