CM KCR: వర్షాల్లో దెబ్బతిన్న ప్రతి ఎకరాకు రూ.10వేల నష్టపరిహారం..కేసీఆర్-cm kcr announced a compensation of ten thousand rupees per acre to the farmers who lost due to untimely rains ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Cm Kcr Announced A Compensation Of Ten Thousand Rupees Per Acre To The Farmers Who Lost Due To Untimely Rains

CM KCR: వర్షాల్లో దెబ్బతిన్న ప్రతి ఎకరాకు రూ.10వేల నష్టపరిహారం..కేసీఆర్

HT Telugu Desk HT Telugu
Mar 23, 2023 01:07 PM IST

CM KCR: అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్న రైతులకు తెలంగాణ సిఎం కేసీఆర్ సాయాన్ని ప్రకటించారు. వడగండ్లు, భారీ వర్షాలతో దెబ్బతిన్న 2.28లక్షల ఎకరాల్లో పంటలు కోల్పోయిన రైతులకు ఎకరాకు రూ.10వేల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. కౌలు రైతులకు కూడా పరిహారం అందిస్తామని కేసీఆర్ ప్రకటించారు.

ఖమ్మంలో మొక్క జొన్న పంటను పరిశీలిస్తున్న సిఎం కేసీఆర్
ఖమ్మంలో మొక్క జొన్న పంటను పరిశీలిస్తున్న సిఎం కేసీఆర్

CM KCR: దేశంలో రైతులకు అనుకూలమైన వ్యవసాాయ విధానాలు లేవని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆరోపించారు. వడగండ్లు,అకాల వర్షాలతో పంటలు కోల్పోయిన రైతుల్ని ఖమ్మం జిల్లాలో సిఎం కేసీఆర్ పరామర్శించారు. దేశంలో రైతులను ఆదుకునే విషయంలో డ్రామా నడుస్తోందని ఎద్దేవా చేశారు.

ట్రెండింగ్ వార్తలు

అకాల వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా 2,28,255ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. మొక్కజొన్న పంటలుె 1,29,446 ఎకరాల్లో నష్టపోయారని చెప్పారు. వరి పంట 72,509 ఎకరాల్లో, 8885 ఎకరాల్లో మామిడి తోటలు, 15,235 ఎకరాలలో ఇతర పంటలు వర్షాలకు పాడయ్యాయని చెప్పారు. రైతల్ని ఆదుకోడానికి రూ228 కోట్లను వెంటనే మంజూరు చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.

అకాల వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్న ఖమ్మం జిల్లాలో తెలంగాణ సిఎం కేసీఆర్ పర్యటించారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. మొక్క జొన్న చేలలో నేలకు ఒరిగిన పంటను మంత్రులతో కలిసి పరిశీలించారు. సిఎంతో పాటు సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పంటల్ని పరామర‌్శించారు.

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రకారం రైతులకు నష్ట పరిహారం వచ్చే అవకాశాలు లేవని కేసీఆర్ చెప్పారు. తెలంగాణలో పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేశామని, పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టామని, రైతుల కోసం ఫార్మర్స్‌ అసిస్టెన్స్‌ కార్యక్రమాలు చేపడుతున్నామని కేసీఆర్ చెప్పారు. కేంద్ర విధానాలు రైతులకు అనుగుణంగా లేవని, వాటితో ఉపయోగం లేదన్నారు.

వ్యవసాయం దండగ అనే చెప్పే మేధావులు దేశంలో చాలామంది ఉన్నారని, తెలంగాణలో తలసరి ఆదాయం రూ.3.05లక్షల రుపాయలు భారతదేశంలోనే అత్యధికంగా ఉందని, వ్యవసాయం వల్లే జిఎస్‌డిపి వాటా అత్యధికంగా ఉందన్నారు.అలాంటి వ్యవసాయాన్ని కాపాడుకుంటామని చెప్పారు.

లక్షలాదిమంది ఉపాధి పోసుకోవడంతో పాటు ఉద్యోగాలు కల్పిస్తున్న రంగంగా వ్యవసాయం ఉందన్నారు. దేశంలోని సగటు సాగు కంటే అత్యధికంగా తెలంగాణలో 56లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారని గుర్తు చేశారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. అద్భుతమైన వ్యవసాయ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ప్రస్తుతం ఇన్స్యూరెన్స్ కంపెనీలకు లాభం కలిగించే పథకాలు తప్ప రైతులకు లాభం చేసే విధానాలు లేవని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం రైతుల నడ్డి విరిచేలా వ్యవహరిస్తోందని విమర్శించారు.

దేశంలో సమగ్ర వ్యవసాయ విధానం రావాల్సి ఉంద్నారు. పంటలు కోల్పోయిన తర్వాత నష్టాన్ని అంచనా వేయడానికి కమిటీలు ఎప్పుడో వస్తాయని, అందుకే ఈసారి కేంద్రానికి నివేదిక కూడా పంపట్లేదన్నారు. తమ రైతుల్నితామే ఆదుకుంటామని చెప్పారు. రైతులు ఎలాంటి నిరాశకు గురి కావొద్దని కేసీఆర్‌ భరోసా ఇచ్చారు. తెలంగాణలో వ్యవసాయాన్ని నిర్వీర్యం కానివ్వమన్నారు.

కేంద్రం మొక్కజొన్న పంటకు ఎకరాకు రూ. 3,533 వరికి రూ.5400, మామిడికి 7500ఇస్తారని అవి రైతులకు ఏ మూలకు నరిపోవన్నారు. రైతులు మళ్లీ పుంజుకోడానికి ఎకరానికి పదివేల రుపాయల నష్టపరిహారం చెల్లిస్తున్నట్లు ప్రకటించారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోడానికి దేశంలో మొదటి సారి ఈ తరహా సాయం అందిస్తున్నట్లు చెప్పారు. పరిహారంలో కౌలు రైతుల్ని కూడా ఆదుకునేలా కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణలో రైతు ప్రభుత్వం అధికారంలో ఉందని, నిరాశకు గురి కావొద్దన్నారు. రైతులు ధైర్యంగా ఉండాలని సూచించారు. అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఖమ్మం తర్వాత మరో మూడు జిల్లాల్లో కేసీఆర్ పర్యటించనున్నారు.

IPL_Entry_Point