BJP : జాతీయ కార్యవర్గంలోకి బండి సంజయ్, సోము వీర్రాజు - బీజేపీ హైకమాండ్ ఆదేశాలు-bjp appoints 10 new national executive members include bandi sanjay and somu veerraju ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bjp : జాతీయ కార్యవర్గంలోకి బండి సంజయ్, సోము వీర్రాజు - బీజేపీ హైకమాండ్ ఆదేశాలు

BJP : జాతీయ కార్యవర్గంలోకి బండి సంజయ్, సోము వీర్రాజు - బీజేపీ హైకమాండ్ ఆదేశాలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Jul 09, 2023 07:03 AM IST

BJP Latest News: జాతీయ కార్యవర్గం సభ్యులుగా బండి సంజయ్ తో పాటు సోము వీర్రాజును ఎంపిక చేసింది బీజేపీ హైకమాండ్. ఈ మేరకు శనివారం రాత్రి ఆదేశాలు జారీ అయ్యాయి.

బండి సంజయ్, సోము వీర్రాజు
బండి సంజయ్, సోము వీర్రాజు

BJP Party News : బీజేపీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని... పలువురు రాష్ట్ర అధ్యక్షులను మార్చిన ఆ పార్టీ.... కీలక నాయకులను జాతీయ కార్యకవర్గంలోకి తీసుకుంటుంది. ఇటీవలే తెలంగాణ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమించగా.... శనివారం మరో పది మందిని కూడా జాతీయ కార్యవర్గంలోకి తీసుకుంది. ఈ మేరకు జేపీ నడ్డా ఆదేశాలు జారీ చేశారు. ఇందులో తెలుగు రాష్ట్రాల మాజీ అధ్యక్షులకు చోటు దక్కింది.

బీజేపీ హైకమాండ్ కీలక నిర్ణయం
బీజేపీ హైకమాండ్ కీలక నిర్ణయం

ఈ జాబితాలో బండి సంజయ్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి సోము వీర్రాజు ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్‌ మాజీ అధ్యక్షుడు సురేశ్ కశ్యప్, బిహార్ మాజీ అధ్యక్షుడు సంజయ్ జైశ్వాల్, ఛత్తీస్‌గఢ్ సీనియర్ నేత విష్ణుదేవ్ సాయి, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ సభ్యుడు ధర్మలాల్ కౌశిక్, పంజాబ్ మాజీ అధ్యక్షుడు అశ్విని శర్మ, జార్ఖండ్ మాజీ అధ్యక్షుడు దీపక్ ప్రకాష్, రాజస్థాన్ సీనియర్ నాయకుడు కిరోడీ లాల్ మీనా, రాజస్థాన్ మాజీ అధ్యక్షుడు సతీష్ పూనియా ఉన్నారు.

ఇక శనివారం వరంగల్ లో పర్యటించారు ప్రధాని మోదీ. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయటంతో పాటు విజయ సంకల్ప్ సభలో ప్రసంగించారు. ఇక ఈ సభకు బండి సంజయ్ హాజరయ్యారు. స్టేజ్‌మీద బండి సంజయ్ ప్రసంగం మొదలుకాగానే బీజేపీ కార్యకర్తలు, అభిమానులు ఈలలు, కేకలతో హోరెత్తించారు. మరోవైపు నినాదాలతో సభా ప్రాంగణం మొత్తం మార్మోగిపోయింది. ఆయన వీరాభిమానులు సోషల్ మీడియాలో పోస్టులతో వైరల్ చేస్తున్నారు. అధ్యక్ష పదవి నుంచి తప్పించిన నేపథ్యంలో కూడా…. పార్టీనే ప్రాణమంటూ మాట్లాడారు. ‘నిజమైన కార్యకర్త మీరే సంజయ్ ’ అన్నా అంటూ కార్యకర్తలు ట్వీట్లు చేస్తున్నారు.

Whats_app_banner