Nagoba Jatara : వైభవంగా నాగోబా జాతర-ఆలయ ప్రవేశం చేసిన కొత్త కోడళ్లు
Nagoba Jatara : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్ గ్రామంలో నాగోబా జాతర వైభవంగా కొనసాగుతుంది. ఈ జాతర వివిధ కార్యక్రమాలు ఆదివాసి పద్ధతిలో నిర్వహించారు.
Nagoba Jatara : ఉమ్మడి ఆదిలాబాద్ లోని ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో ప్రతి సంవత్సరం పుష్య మాసంలో జరిగే నాగోబా జాతర అధ్యంతం అత్యంత వైభవంగా కొనసాగుతుంది. అమావాస్య రోజు ప్రారంభించిన ఈ జాతరకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ గఢ్ మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్ వివిధ రాష్ట్రాల నుంచి ఆదివాసి భక్తులు హాజరవుతారు. ఈ జాతరలో వివిధ కార్యక్రమాలు సంప్రదాయబద్ధంగా ఆదివాసి పద్ధతిలో నిర్వహిస్తారు. ఆదివాసి తెగలు గోండ్ (పర్థాన్) లో మేస్రం వంశస్థుల వంశదేవునిగా నాగోబా (సర్పం)ను ఆరాధిస్తారు. ఎంతో నియమనిష్ఠలతో ఈ కార్యక్రమాన్ని జరుపుతారు. బేటింగ్...మహా పూజ అనంతరం అర్ధరాత్రి సమయంలో ఆదివాసి మేస్రం వంశంలోని కొత్త కోడళ్లు అప్పటివరకు నాగోబా ఆలయం ప్రవేశం చేయనటువంటి కోడళ్లు ఈ కార్యక్రమంతో ఆలయ ప్రవేశం చేస్తారు. ఈ జాతరలో భాగంగా ఆదివారం నాడు పేర్సే పేన్ పూజ, బేటింగ్ నిర్వహించారు. ఆదివాసి గోండు వారి ఆదిదేవుడుగా పేర్సే పేన్ ను పూజిస్తారు. అదే విధంగా నాగోబా ఆలయం వెనకాల ఉన్నటువంటి బాన్ ఆలయంలో ముందుగా పటేల్స్ కిత్త గ్రూప్ వారు పూజ చేసి అనంతరం మిగతా వారు పూజ చేశారు. అనంతరం బేటింగ్ కార్యక్రమాలకు హాజరైన కొత్త కోడలు మట్టికుండలతో నీరు తీసుకువచ్చి పుట్ట తయారు చేసి పూజలు నిర్వహించారు.
ఆదివాసీల నాగోబా జాతర
ఆదివాసి గోండ్ తెగవారి ఆరాధ్య దైవం నాగోబా జాతర అదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో ప్రతి సంవత్సరం పుష్య మాసంలో జరుగుతుంది. జాతరకి తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, ఛత్తీస్ గఢ్ మహారాష్ట్ర, ఒడిశా మధ్యప్రదేశ్‌తో పాటు వివిధ రాష్ట్రాల నుంచి ఆదివాసీలు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. ఈ జాతరలో వివిధ కార్యక్రమాలు సంప్రదాయబద్ధంగా ఆదివాసీ పద్ధతిలో నిర్వహిస్తారు. ఆదివాసీ తెగలు గోండ్ (పర్థాన్) లో గల మేస్రం వంశస్థుల వంశదేవునిగా నాగోబా (సర్పం)న్ని ఆరాధిస్తారు. ఎంతో నియమనిష్ఠలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
స్థల పురాణం ప్రకారం
జాగ్దేవి మహాదేవుణ్ణి ప్రత్యక్షం చేసుకుని శివుని ద్వారా వరం పొందుతుంది. ఈ వరంతో 12 సంవత్సరాలు ప్రతిరోజు నియమనిష్ఠలతో బేరులి (మర్రి వృక్షం) దగ్గర పాము పుట్టకి కలశం లేదా జారీతో ప్రతిరోజు జలాభిషేకం చేసి పూజిస్తుంది. ఫలితంగా జాగ్దేవికి భార్దేవ్ జన్మిస్తారు. భార్ దేవ్‌కి నాగమోతితో వివాహం జరిపిస్తుంది.
ఈ వివాహ కార్యక్రమాన్ని ఈరా సుఖ తాత పర్యవేక్షణలో జరుగుతుంది. వీరు నాగ బీడ్ ప్రాంతంలో స్థిరపడతారు. వారసత్వంగా వస్తున్నాం 'కలశం' 'జారీ' లేదా 'మురడి'ని తన కుమారుడైన జలకల్ దేవునికి అప్పగించి వీరు తండ్రి మాట ప్రకారం కేస్లాపూర్ గ్రామం వచ్చి గ్రామానికి పునాది వేసి అక్కడే స్థిరపడతారు. వీరికి ఏడుగురు కుమారులు సంతానం ఉన్నారు. కేస్లాపూర్ లో పాడిపంటలు, వ్యవసాయం, పంటల అత్యంత దిగుబడితో ధన రాశులతో కలకలాడుతున్న సమయంలో కేస్లాపూర్ గ్రామంలోకి దుష్టశక్తులు ప్రవేశిస్తాయి. దీనితో పంటలు, సంపద పూర్తిగా నాశనం అవుతుంది. ఇలాంటి సమయంలో తమ దైవం నాగోబా, పాము కేస్లాపూర్ గ్రామంలోకి వచ్చి ఇక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకోవడం వల్ల దుష్టశక్తులు మాయమై మునుపటి పంటలు పశు సంపద సమృద్ధిగా అభివృద్ధి చెందుతుంది.
దీనికి ప్రతీకగానే ప్రతి సంవత్సరం గోండ్స్ పుష్య మాసంలో ప్రతి ఏడాది జలంతో నాగ దేవునికి అభిషేకం చేసి సంప్రదాయ, సంగీత వాయిద్యాలతో ఆచారం ప్రకారం ప్రతి ఏడాది జాతర జరుపుతున్నారు. గోండ్స్ ఆదివాసులు తమ ఆచారం ప్రకారం ముందుగా 'చకడా’ (ఎడ్ల బండి)తో నాగోబా పీఠాధిపతి ఇంటి నుంచి బయలుదేరి తమ బంధువులు గోండ్ వారి గ్రామాలకి వెళ్లి ప్రచారం చేస్తూ పూజకు కావలసిన కుండలను సిరికొండ గ్రామంలో గల గుగ్గిళ్ళ వంశం వారికి తమ పూజకు కావలసిన మట్టికుండలా తయారు చేయమని చెప్పి కటోడ, గాధే ప్రధాన్ తిరిగి పీఠాధిపతి ఇంటికి చేరుకుంటారు. దీనిని 'చందుర్ ధూప్' అని కూడా అంటారు.
సంబంధిత కథనం