ICC WTC Final : డబ్ల్యూటీసీ ఫైనల్‌కు డ్యూక్​కు బదులుగా కూకబుర్ర బంతి.. రెండింటికి తేడా ఏంటి?-world test championship between india and australia will be played with the kookaburra ball ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  World Test Championship Between India And Australia Will Be Played With The Kookaburra Ball

ICC WTC Final : డబ్ల్యూటీసీ ఫైనల్‌కు డ్యూక్​కు బదులుగా కూకబుర్ర బంతి.. రెండింటికి తేడా ఏంటి?

Anand Sai HT Telugu
May 20, 2023 12:13 PM IST

ICC WTC Final : గతేడాది ఇంగ్లండ్ న్యూజిలాండ్‌లో పర్యటించింది. ఆ సమయంలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ డ్యూక్ బంతిపై ఫిర్యాదు చేశాడు. తాజాగా ఇదే విషయంపై మరోసారి చర్చ నడుస్తోంది.

డ్యూక్ వర్సెస్ కూకబుర్ర
డ్యూక్ వర్సెస్ కూకబుర్ర

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ (ICC WTC Final)కి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) ముగిసిన వెంటనే, ఇండియా, ఆస్ట్రేలియా జట్టు ఆటగాళ్లు టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం ఇంగ్లాండ్‌కు వెళ్లనున్నారు. ICC WTC ఫైనల్ జూన్ 7 నుండి 11 వరకు జరుగుతుంది. లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానం ఈ చారిత్రాత్మక పోరుకు సాక్ష్యం కానుంది. ఇప్పుడు ఈ ముఖ్యమైన మ్యాచ్‌కు డ్యూక్ బంతికి బదులుగా కూకబుర్ర బంతిని ఉపయోగించాలని నిర్ణయించారని తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం రికీ పాంటింగ్ ఐసీసీతో జరిగిన సమావేశంలో డ్యూక్ కంటే కూకబుర్ర బంతి ఎలా మెరుగ్గా ఉంటుందో వివరించాడు. 'ఆస్ట్రేలియా, భారత్ మ్యాచ్ అంటే అదే హైలైట్. భారత స్పిన్నర్లు, ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ల మధ్య పోరు ఉత్కంఠ రేపనుంది. ఓవల్ మైదానంలో ఇది కచ్చితంగా జరుగుతుంది. ఓవల్ పిచ్ సాధారణంగా బ్యాట్స్‌మెన్‌కు మంచిది. స్పిన్నర్‌లకు కొంత మేరకు అనుకూలంగా ఉంటుంది. డ్యూక్ అంత ప్రభావవంతంగా లేదు. కాబట్టి కూకబుర్ర బంతిని వాడాలి.' అని అన్నాడు.

గతేడాది ఇంగ్లండ్‌ న్యూజిలాండ్‌లో పర్యటించింది. ఆ సమయంలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా డ్యూక్ బంతిపై ఫిర్యాదు చేశాడు. మ్యాచ్ జరుగుతున్న కొద్దీ బంతి ఆకారాన్ని కోల్పోతుందని, మృదువుగా మారి స్వింగ్ కోల్పోతుందని విలియమ్సన్ ఫిర్యాదు చేశాడు.

కూకబుర్ర ఒక ఆస్ట్రేలియన్ స్పోర్టింగ్ గూడ్స్ కంపెనీ. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్‌తో సహా చాలా జట్లు తమ తమ దేశాల్లో టెస్ట్ క్రికెట్ ఆడేందుకు కూకాబుర్ర కంపెనీ బంతిని ఉపయోగిస్తున్నాయి. ఈ బంతి లోపలి రెండు పొరలు చేతితో కుట్టినవి. భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన WTC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో డ్యూక్ బంతిని ఉపయోగించారు. దీని రంగు చెర్రీ ఎరుపు. కూకబుర్రా బాల్‌తో పోలిస్తే SG బాల్‌ను కుట్టడానికి ఉపయోగించే దారం మందంగా ఉంటుంది. SG బాల్‌లో కుట్లు మధ్య దూరం తక్కువగా ఉంటుంది.

కూకబుర్ర బాల్ సీమ్ వైపు పట్టు బాగా ఉంది. బౌలర్లు తమ ప్రయోజనం కోసం దానిని సురక్షితంగా పట్టుకోవడానికి వీలు కల్పిస్తుంది. బంతి మెరుపును కోల్పోయిన తర్వాత కూడా కూకబుర్రా ఎత్తుగా బౌన్స్ చేయగలదు. కాబట్టి ఫాస్ట్, మీడియం పేస్ బౌలర్లు బౌన్స్ ద్వారా బ్యాట్స్‌మెన్‌లను కట్టడి చేయవచ్చు. ఈ ముఖ్యమైన టోర్నమెంట్ కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఇప్పటికే టీమ్ ఇండియాను ప్రకటించింది. అంతకుముందు టెస్టు జట్టు నుంచి తప్పుకున్న అజింక్యా రహానే మళ్లీ పునరాగమనం చేశాడు.

WhatsApp channel

టాపిక్