New Zealand vs England: న్యూజిలాండ్‌కు మరోసారి బజ్‌బాల్ రుచి చూపించిన ఇంగ్లండ్.. తొలి రోజే సెంచరీల మోత-new zealand vs england 2nd test as the visitors dominated day 1 with bazball cricket
Telugu News  /  Sports  /  New Zealand Vs England 2nd Test As The Visitors Dominated Day 1 With Bazball Cricket
న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపించిన హ్యారీ బ్రూక్, జో రూట్
న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపించిన హ్యారీ బ్రూక్, జో రూట్ (AP)

New Zealand vs England: న్యూజిలాండ్‌కు మరోసారి బజ్‌బాల్ రుచి చూపించిన ఇంగ్లండ్.. తొలి రోజే సెంచరీల మోత

24 February 2023, 11:39 ISTHari Prasad S
24 February 2023, 11:39 IST

New Zealand vs England: న్యూజిలాండ్‌కు మరోసారి బజ్‌బాల్ క్రికెట్ రుచి చూపించింది ఇంగ్లండ్. రెండో టెస్ట్ తొలి రోజే రూట్, బ్రూక్ సెంచరీల మోత మోగించడంతో భారీ స్కోరు వైపు దూసుకెళ్తోంది.

New Zealand vs England: టెస్ట్ క్రికెట్ కు ఇంగ్లండ్ పరిచయం చేసిన స్టైల్ బజ్‌బాల్. ఈ స్టైల్ తో అసలు టెస్ట్ క్రికెట్ ఆడే విధానాన్నే మార్చేసిందా టీమ్. బెన్ స్టోక్స్ కెప్టెన్సీ, బ్రెండన్ మెక్‌కలమ్ కోచింగ్ లో ఇంగ్లండ్ టీమ్ టెస్టుల్లో ప్రత్యర్థులను చిత్తు చిత్తుగా ఓడిస్తోంది. తాజాగా న్యూజిలాండ్ కు వాళ్ల సొంతగడ్డపైనే చుక్కలు చూపిస్తోంది.

తొలి టెస్టులో ఏకంగా 267 పరుగుల తేడాతో గెలిచిన ఇంగ్లండ్.. రెండో టెస్ట్ ను కూడా అలాగే మొదలుపెట్టింది. తొలి రోజే హ్యారీ బ్రూక్, జో రూట్ సెంచరీల మోత మోగించారు. కేవలం 21 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఇంగ్లండ్ ను ఈ ఇద్దరూ ఆదుకున్నారు. నాలుగో వికెట్ కు అజేయంగా 294 పరుగులు జోడించారు. తొలి రోజు వర్షం కారణంగా కేవలం 65 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైనా.. ఇంగ్లండ్ మాత్రం 3 వికెట్లకు 315 పరుగుల భారీ స్కోరు చేసింది.

అంటే టెస్ట్ క్రికెట్ తొలి రోజే ఓవర్ కు 4.84 రన్ రేట్ తో పరుగులు సాధించడం విశేషం. ఇదీ ఇంగ్లండ్ స్టైల్ బజ్‌బాల్ క్రికెట్. తొలి రోజు ఆట ముగిసే సమయానికి బ్రూక్ కేవలం 169 బంతుల్లో 184 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్ లో 24 ఫోర్లు, 5 సిక్స్ లు ఉన్నాయి. ఇక జో రూట్ 182 బంతుల్లో 101 రన్స్ చేశాడు. రూట్ తన ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు కొట్టాడు.

అంతకుముందు ఓపెనర్లు జాక్ క్రాలీ (2), బెన్ డకెట్ (9), ఓలీ పోప్ (10) విఫలమయ్యారు. దీంతో 21 పరుగులకే ఇంగ్లండ్ 3 వికెట్లు కోల్పోయింది. ఈ అద్భుతమైన ఆరంభంతో న్యూజిలాండ్ పైచేయి సాధించేసినట్లే అని సంబరపడింది. కానీ తర్వాత హ్యారీ బ్రూక్ తుఫాన్ ను ఊహించలేకపోయింది. బ్రూక్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

ఇప్పటి వరకూ కెరీర్ లో బ్రూక్ కేవలం 9 టెస్ట్ ఇన్నింగ్స్ ఆడి 800కుపైగా రన్స్ చేశాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి 9 ఇన్నింగ్స్ లో ఇన్న రన్స్ చేసిన మరో బ్యాటర్ లేకపోవడం విశేషం.

సంబంధిత కథనం