Joe Root on World Cup: ఇండియాలో వరల్డ్ కప్ గెలవడం మాకు ఈజీ: జో రూట్
Joe Root on World Cup: ఇండియాలో వరల్డ్ కప్ గెలవడం తమకు ఈజీ అని అన్నాడు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్. డిఫెండింగ్ ఛాంపియన్స్ గా మళ్లీ ట్రోఫీని నిలబెట్టుకోవడానికి ఇది తమకు గొప్ప అవకాశమని చెప్పాడు.
Joe Root on World Cup: క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లండ్ కు ఎన్నో దశాబ్దాల తర్వాత 2019లో తొలి వన్డే వరల్డ్ కప్ చేరింది. అంతకుముందు, ఆ తర్వాత రెండుసార్లు టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఆ టీమ్.. ఈసారి ఇండియాలో జరగబోయే వన్డే వరల్డ్ కప్ ను నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో ఉంది. అయితే ఉపఖండంలో వరల్డ్ కప్ జరగడం తమకు ఓ గొప్ప అవకాశమని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ అన్నాడు.
ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో ఇండియాలో వన్డే వరల్డ్ కప్ జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడ ఆడిన అనుభవం తమకు ఈ మెగాటోర్నీలో ఎంతగానో ఉపయోగపడనుందని రూట్ చెప్పాడు. స్పిన్ బౌలింగ్ ను తమ బ్యాటర్లు ఎంత సమర్థంగా ఎదుర్కొంటారన్న దానిపైనే తమ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయని అన్నాడు.
"ఇది మాకు గొప్ప అవకాశం. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. మా వరల్డ్ టైటిల్ ను గెలవడానికి మాకు గొప్ప అవకాశం ఉంది. ఇప్పటికే మా ప్లేయర్స్ చాలా సమయం ఇండియాలో గడిపారు. అక్కడి కండిషన్స్ బాగా తెలుసు. స్పిన్ ను ఎంత సమర్థంగా ఎదుర్కొంటాం, వరల్డ్ కప్ కు ముందు తక్కువ సంఖ్యలో ఉన్న వన్డే మ్యాచ్ లలో ఎలా ఆడతామన్నదానిపై ఆధారపడి ఉంటుంది" అని రూట్ అన్నాడు.
వన్డేల్లో జో రూట్ కు మంచి రికార్డు ఉంది. ఇప్పటి వరకూ 16 సెంచరీలు సహా 50 సగటుతో 6207 రన్స్ చేశాడు. అయితే 2019లో జరిగిన వరల్డ్ కప్ నుంచి ఇప్పటి వరకూ రూట్ ఒక్క సెంచరీ కూడా చేయలేదు. పైగా సగటు కూడా 30 కంటే తక్కువగా ఉంది. ప్రస్తుతం అతడు యూఏఈలో జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో ఆడుతున్నాడు.
"ఈ ఏడాది చివర్లో ఇండియాలో వరల్డ్ కప్ ఉంది. దానికి ముందు ఈ ఐఎల్ టీ20లో నా గురించి నేను చాలా నేర్చుకుంటాను. పరిమిత ఓవర్ల క్రికెట్ లో కొంతకాలంగా నాకు అనుభవం లేదు. ఓ ప్లేయర్ గా ఈ లీగ్ నాకు ఉపయోగపడుతుందేమో చూడాలి" అని రూట్ చెప్పాడు.
సంబంధిత కథనం