SRH in IPL 2023 Auction: ఐపీఎల్ 2023 మినీ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ దూకుడు ప్రదర్శిస్తోంది. కీలక ఆటగాళ్ల కోసం భారీ మొత్తం వెచ్చిస్తోంది. ఇంగ్లాండ్ క్రికెటర్ హ్యారీ బ్రూక్‌ను రూ.13.25 కోట్ల భారీ మొత్తాని కొనుగోలు చేసింది. అంతేకాకుండా మయాంక్ అగర్వాల్‌ను కూడా రూ. 8.25 కోట్లకు కొనుగోలు చేయడం విశేషం. మొదటి నుంచి ఈ ఇద్దరి కోసం తీవ్రంగా ప్రయత్నించిన సన్‌రైజర్స్ చివరకు సక్సెస్ అయింది. సన్‌రైజర్స్ పర్సులో ఎక్కువ మొత్తం ఉండటంతో అనుకున్న వ్యూహాన్ని పకడ్భందీగా అమలు చేసి విజయవంతమైంది.
హ్యారీ బ్రూక్ కోసం రాజస్థాన్ రాయల్స్ జట్టు కూడా తీవ్రంగా ప్రయత్నించింది. కానీ వారి వద్ద 13.2 కోట్లు మాత్రమే ఉండటంతో రేసు నుంచి తప్పుకుంది. చివరకు సన్‌రైజర్స్ అతడిని చేజిక్కించుకుంది. అతడికి ఇంత డిమాండ్ రావడానికి ప్రధాన కారణం ఇటీవల పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో 3 శతకాలతో విజృంభించాడు. అంతేకాకుండా భీకర ఫామ్‌లో ఉన్న అతడు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేశాడు. టెస్టు క్రికెట్‌లోనే కాకుడా టీ20 ఫార్మాట్‌లో అతడికి మెరుగైన గణాంకాలు ఉన్నాయి. గతంలో పాకిస్థాన్ సూపర్ లీగ్, బిగ్‌బాష్ లీగ్‌లో ఆడిన అనుభవముంది. 20 టీ20లు ఆడిన అతడు 26.57 సగటుతో 372 పరుగులు చేశాడు. అంతేకాకుండా 133.77 స్ట్రైక్ రేటుతో ఆడాడు. తన కనీస ధరను రూ.1.5 కోట్లుగా నిర్దేశించిన అతడు 13.25 కోట్లకు అమ్ముడు పోవడంతో ఫుల్ ఖుషీగా ఉన్నాడు.
మరోపక్క మయాంక్ అగర్వాల్ మయాంక్ అగర్వాల్ కోసం చెన్నై, సన్‌రైజర్స్ మధ్య పోటీ నడిచింది. దీంతో రూ.కోటి బేస్‌ప్రైస్‌తో మొదలైన అతని బిడ్ దూసుకెళ్తూనే ఉంది. చివరికి సన్‌రైజర్స్ హైదరాబాద్ అతన్ని రూ.8.25 కోట్లకు కొనుగోలు చేసింది.
సంబంధిత కథనం
టాపిక్