David Hussey on Rinku Singh: రింకూ సింగ్ ఇండియాకు ఆడతాడు.. ఆస్ట్రేలియా మాజీ జోస్యం-david hussey says kkr batter rinku singh to play for india ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  David Hussey On Rinku Singh: రింకూ సింగ్ ఇండియాకు ఆడతాడు.. ఆస్ట్రేలియా మాజీ జోస్యం

David Hussey on Rinku Singh: రింకూ సింగ్ ఇండియాకు ఆడతాడు.. ఆస్ట్రేలియా మాజీ జోస్యం

Maragani Govardhan HT Telugu
Apr 29, 2023 01:12 PM IST

David Hussey on Rinku Singh: కేకేఆర్ బ్యాటర్ రింకూ సింగ్ భవిష్యత్తులో టీమిండియా తరఫున ఆడతాడని ఆసీస్ మాజీ డేవిడ్ హస్సీ అభిప్రాయపడ్డారు. అతడు అద్భుతమైన ఆటగాడంటూ కితాబిచ్చారు.

రింకూ సింగ్
రింకూ సింగ్ (AFP)

David Hussey on Rinku Singh: కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్ రింకూ సింగ్ ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్‌కు 29 పరుగులు అవసరం కాగా.. 5 బంతుల్లో 5 సిక్సర్లు కొట్టిన ఈ స్టార్ కేకేఆర్ తరఫున ఫినిషింగ్ రోల్ పోషిస్తున్నాడు. తనదైన శైలి ఆటతీరుతో ఆకట్టుకుంటున్న రింకూ త్వరలో టీమిండియా తరఫున ఆడాలని కోల్‌కతా అభిమానులు కోరుకుంటున్నారు. ఇదే విషయాన్ని ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ డేవిడ్ హస్సీ కూడా అన్నారు. భవిష్యత్తులో భారత్‌ తరఫున ఆడేందుకు రింకూ సింగ్‌కు ప్రతి ఛాన్స్ ఉందని స్పష్టం చేశాడు.

"రింకూ సింగ్‌లో అద్భుతమన ప్రతిభ దాగుంది. అతడు దేశవాళీ క్రికెట్‌లో బాగా రాణిస్తున్నాడు. కేకేఆర్ ఫ్రాంఛైజీ అతడికి బాగా మద్దతు ఇస్తోంది. దీంతో అతడు తన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నాడు. రింకూ తన ఆటను తదుపరి స్థాయికి తీసుకెళ్లాడు. అతడు త్వరలో భారత్ తరఫున ఆడతాడని ఆశిస్తున్నాను" అని డేవిడ్ హస్సీ అన్నారు.

రింకూ సింగ్ కోల్‌కతా తరఫున 2018 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే రెగ్యూలర్‌గా 2021 నుంచి మాత్రమే ఆ జట్టు అతడికి ఛాన్స్ ఇస్తోంది. ఈ సీజన్‌లో రింకూ అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటికే కేకేఆర్ తరఫున అత్యధిక స్కోరు సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. అతడు 8 మ్యాచ్‌ల్లో 62,75 సగటుతో 251 పరుగులు చేశాడు. 158.88 స్ట్రైక్ రేటుతో అతడు బ్యాటింగ్ చేయడం గమనార్హం. లోవర్ మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తున్న రింకూ ఇప్పటికే తన పేరిట రెండు అర్ధ శతకాలు నమోదు చేశాడు.

గుజరాత్‌తో ఇటీవల జరిగిన మ్యాచ్‌లో రింకూ సింగ్ అదరగొట్టాడు. 5 బంతుల్లో 28 పరుగులు అవసరం కాగా.. 5 సిక్సర్లు బాది కేకేఆర్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. యష్ దయాల్ వేసిన చివరి ఓవర్లో ఈ సిక్సర్లు బాదాడు. ఫలితంగా కేకేఆర్ 3 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో దయాల్ 31 పరుగులతో రాణించాడు.

Whats_app_banner