Rinku Singh | మ్యాచ్‌కు ముందే స్కోరు చేతిపై రాసుకొచ్చి.. అలాగే దంచికొట్టిన రింకూ-rinku singh written the score which he wanted to score on his hand before start of the play ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Rinku Singh | మ్యాచ్‌కు ముందే స్కోరు చేతిపై రాసుకొచ్చి.. అలాగే దంచికొట్టిన రింకూ

Rinku Singh | మ్యాచ్‌కు ముందే స్కోరు చేతిపై రాసుకొచ్చి.. అలాగే దంచికొట్టిన రింకూ

HT Telugu Desk HT Telugu
May 03, 2022 03:02 PM IST

ఓ ప్లేయర్‌ బాగా ఆడటం వేరే.. ఈ రోజు కచ్చితంగా బాగా ఆడతానని చెప్పి మరీ ఆడటం వేరే. కోల్‌కతా ప్లేయర్‌ రింకూ సింగ్‌ ఇలాగే చేశాడు. మ్యాచ్‌కు ముందే తాను ఎంత స్కోరు చేయాలనుకుంటున్నది చేతిపై రాసుకొని వచ్చి మరీ కొట్టాడు.

నైట్ రైడర్స్ ప్లేయర్ రింకూ సింగ్
నైట్ రైడర్స్ ప్లేయర్ రింకూ సింగ్ (PTI)

ముంబై: రింకూ సింగ్‌.. చాలా ఏళ్లుగా ఐపీఎల్‌లో కనిపిస్తున్నా ఈ ప్లేయర్‌ సత్తా ఎవరికీ తెలియదు. సోమవారం రాజస్థాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో తీవ్ర ఒత్తిడిలో బరిలోకి దిగిన అతడు.. ఎంతో కూల్‌గా ఆడేసి తన టీమ్‌కు విజయం కట్టబెట్టాడు. నితీష్‌ రాణాతో కలిసి కీలకమైన భాగస్వామ్యం నెలకొల్పిన రింకూ.. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు గెలుచుకున్నాడు.

అయితే మ్యాచ్‌ తర్వాత ఇదే నితీష్‌ రాణాతో కలిసి మాట్లాడిన రింకూ ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పాడు. మ్యాచ్‌ ప్రారంభానికి ముందే తాను ఈ మ్యాచ్‌లో ఎన్ని రన్స్‌ చేయాలో చేతిపై రాసుకున్నాడట. నితీష్‌ అతని చేయి చూస్తూ ఇదేంటని అడిగితే.. రింకూ ఈ మాట చెప్పాడు. ఈ మ్యాచ్‌లో 50 రన్స్‌ చేయాలి.. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలవాలి అని ముందే తాను డిసైడైనట్లు అతడు చెప్పడం విశేషం.

తన చేతిపై 50 రన్స్‌ చేయాలని రాసుకున్నా చివరికి అతడు 23 బాల్స్‌లోనే 42 రన్స్‌ చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇన్ని రన్స్‌ చేస్తావని నీకు మ్యాచ్‌కు ముందే ఎలా తెలుసు అని నితీష్ అడగగా.. నేను ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలవాలని చాలా కాలంగా అనుకుంటున్నాను.. మొత్తానికి ఐదేళ్ల తర్వాత నా లక్ష్యం నెరవేరింది అని రింకూ చెప్పాడు.

అంతేకాదు యూపీలోని అలీగఢ్‌ నుంచి ఐపీఎల్‌ ఆడిన తొలి ప్లేయర్‌ తానేననీ రింకూ గర్వంగా చెప్పుకున్నాడు. అక్కడి నుంచి వచ్చిన ఎంతో మంది ప్లేయర్స్‌ రంజీ ట్రోఫీలో ఆడినా.. ఐపీఎల్‌ ఆడిన తొలి ప్లేయర్‌ మాత్రం తానేనని రింకూ అన్నాడు. ఈ ఛాన్స్‌ కోసం తాను ఐదేళ్లుగా ఎదురుచూస్తున్నానని, తాను చాలా కష్టపడ్డానని చెప్పాడు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్